E-Paper
Advertisement

యూట్యూబ్‌లో చేసింది ఒకే ఒక్క వీడియో!.. అయినా 6 మిలియన్ సబ్‌స్క్రైబర్లు..

యూట్యూబ్‌లో చేసింది ఒకే ఒక్క వీడియో!.. అయినా 6 మిలియన్ సబ్‌స్క్రైబర్లు..
Advertisement

YouTube History: 2005 ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావేద్ కరీం అనే ముగ్గురు పేపాల్ (PayPal) మాజీ ఉద్యోగులు కలిసి యూట్యూబ్‌ను ప్రారంభించారు. అప్పట్లో దీనిని “Tune In, Hook Up” ‘ట్యూన్ ఇన్ హుక్ అప్’ అనే పేరుతో ఒక వీడియో డేటింగ్ వెబ్‌సైట్‌గా రూపొందించారు. వినియోగదారులు తమ గురించి వీడియోలు అప్‌లోడ్ చేసి, తమకు నచ్చిన భాగస్వాములను వెతుక్కోవాలనేది వీరి ప్రధాన ఉద్దేశ్యం. అయితే, ఈ ఆలోచన అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఐదు రోజులైనా ఒక్క వీడియో కూడా అప్‌లోడ్ కాలేదు. చివరకు ఎవరైనా, ఏ వీడియో అయినా అప్‌లోడ్ చేసేలా నిబంధనలను సడలించడంతో యూట్యూబ్ అసలు ప్రయాణం మొదలైంది.

Read also-వామ్మో.. ఏంటయ్యా జక్కన్న.. ఒక్క ఫైట్ కోసం అన్ని కోట్లా..?

తొలి వీడియో

Advertisement

2005, ఏప్రిల్ 23న జావేద్ కరీం “Me at the zoo” అనే 18 సెకన్ల వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇదే యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన మొట్టమొదటి వీడియో. దాదాపు ఇరవై ఏళ్లు గడుస్తుంది. అప్పటి నుంచి ఆకౌంట్ నుంచి వేరే వీడియో ఏమీ అప్ లోడ్ కాలేదు. కానీ దాదాపు 60 లక్షల మంది చందారారులు ఉన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు.. మరో వీడియో కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో. యూట్యూబ్ ఎదుగుదలను గమనించిన గూగుల్ (Google), అది ప్రారంభమైన 18 నెలలకే (నవంబర్ 2006లో) 1.65 బిలియన్ డాలర్లకు దీనిని కొనుగోలు చేసింది. ఈ వార్త అప్పట్లో ఒక సంచలనంగా మారింది.

నేడు యూట్యూబ్ కేవలం వినోద సాధనమే కాదు, ఒక భారీ విజ్ఞాన భాండాగారం ఉపాధికి మార్గం కూడా. యూట్యూబ్‌కి ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ప్రతి నిమిషానికి సుమారు 500 గంటలకు పైగా నిడివి గల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. గూగుల్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసే రెండో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్.

Advertisement

Read also-ఇల్లు ఇల్లాలు పిల్లలు.. మార్చి 31 : చందుకు వల్లి బాగోతం తెలిసిపోతుందా..? మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. నర్మద దెబ్బ అదుర్స్..

మైలురాళ్లు

యూట్యూబ్ క్రియేటర్లుకు తమ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాన్ని కల్పించింది. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా క్రీడలు, వార్తలు ఈవెంట్లను ప్రజలకు చేరువ చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా టిక్‌టాక్ వంటి యాప్‌లకు పోటీగా తక్కువ నిడివి గల వీడియోలను ప్రవేశపెట్టింది. ఒక చిన్న డేటింగ్ వెబ్‌సైట్‌గా మొదలైన యూట్యూబ్, నేడు స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. విద్య, వినోదం, వంటలు, టెక్నాలజీ ఇలా ఏ రంగం గురించి తెలుసుకోవాలన్నా ఇప్పుడు యూట్యూబ్ మొదటి చిరునామాగా మారింది. సాధారణ వ్యక్తులను సైతం సెలబ్రిటీలుగా మార్చిన ఘనత ఈ ప్లాట్‌ఫారమ్‌కే దక్కుతుంది. ప్రస్తుతం ఊహ తెలిసిన వాళ్లు నుంచి ముసిలి వాళ్ల వరకూ యూట్యూబ్ అంటే తెలియని వాళ్లు ఉండరు. ఇప్పడు యూట్యూబ్ ఎంతో మందికి జీవనాధారంగా కూడా మారింది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×