E-Paper
Advertisement

Virtual Dating:వర్చువల్‌గా డేటింగ్.. ఆ యాప్స్ ఉంటే చాలు..!

Virtual Dating:వర్చువల్‌గా డేటింగ్.. ఆ యాప్స్ ఉంటే చాలు..!
Advertisement

Virtual Dating:ఇప్పుడు ఏ వస్తువైనా.. క్షణాల్లో మన ముందు ఉండేలాగా టెక్నాలజీ ఏర్పడింది. దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడాలన్నా.. షాపింగ్ చేయాలన్నా.. అన్నీ వర్చువల్‌గానే జరిగిపోతున్నాయి. ఒక మనిషి ఒకచోటి నుండి మరొక చోటుకి ప్రయాణం చేయకుండానే తనకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఇవన్నీ వర్చువల్‌గా ఉన్నట్టుగానే డేటింగ్‌ కూడా వర్చువల్‌గా చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నట్టు రీసెర్చ్‌లో తేలింది.

శాస్త్రవేత్తలు.. టెక్నాలజీతో ఒక సెపరేట్ వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించారు. అదే మెటావర్స్. మెటావర్స్‌లో ఇద్దరు మనుషులు దగ్గరగా లేకపోయినా.. దగ్గరగా ఉన్నట్టే ఫీల్ అవ్వచ్చు. అంతే కాదు ఈ మెటావర్స్ సాయంతో శారీరికంగా ఒకచోట లేకపోయినా.. అక్కడకు వెళ్లిన అనుభూతిని పొందవచ్చు. ప్రస్తుతం ఈ మెటావర్స్‌కు టెక్ ప్రపంచంలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే చాలామంది ఈ మెటావర్స్‌నే తమ డేటింగ్ స్పాట్‌గా మార్చేసుకున్నారు.

Advertisement

తాజాగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. పురుషులలో 60 శాతం, మహిళలలో 48 శాతం మెటావర్స్‌లో వర్చువల్ డేటింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారని తెలిసింది. మామూలుగా ఇండియాలో అరేంజ్ మ్యారేజ్ పద్ధతి ఎక్కువగా ఆచరణలో ఉంటుంది. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో డేటింగ్, రిలేషన్‌షిప్ అనేవాటిని ప్రోత్సహించరు. అలాంటి వారికి ఈ మెటావర్స్ బెటర్ ఆప్షన్‌లాగా కనిపిస్తోంది. ఇది తాము ఉండే చోటి నుండే కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవడానికి సహాయపడుతుంది.

ముందుగా ఈ మెటావర్స్‌లో వ్యక్తులు తమ అవతార్‌ను క్రియేట్ చేసుకోవాలి. అంటే వారు ఎలా ఉంటారు, వాటి డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేవాటితో తమ ఏనిమేషన్ పిక్చర్‌ను క్రియేట్ చేయాలి. ఆ తర్వాత తమకు నచ్చిన అవతార్‌తో వర్చువల్‌గా బార్లు, క్లబ్స్, పార్కులు.. ఇలా ఎక్కడికైనా వర్చువల్‌గా వెళ్లిపోవచ్చు. మామూలుగా కొత్త మనుషులతో ఎక్కువగా కలవలేని వారికి కూడా ఈ మెటావర్స్ అడ్వాంటేజ్‌ను ఇస్తుంది.

Advertisement

ఒకరితో ఒకరు ఎదురెదురుగా కూర్చొని కలిసి మాట్లాడడానికి, వర్చువల్‌గా కలిసి మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. కానీ ఇలా కూడా కొత్త మనుషులతో అనుబంధం ఏర్పరుచుకునే అవకాశం లభిస్తుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికీ చాలామందికి ఈ మెటావర్స్ డేటింగ్ గురించి అవగాహన లేకపోయినా.. ఇండియాలో ఈ టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. వర్చువల్ డేటింగ్ కోసం మెటావైబ్, మింగౌట్, స్వూన్ మీ లాంటి యాప్స్ మార్కెట్లో ఉన్నాయి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×