// // Best Foldable Phones 2025: ఫోల్డ్ ఫోన్ల ఫైట్ షురూ.. -->
E-Paper
Advertisement

Best Foldable Phones 2025: ఫోల్డ్ ఫోన్ల ఫైట్ షురూ.. 200ఎంపి కెమెరాతో శామ్‌సంగ్.. భారీ బ్యాటరీతో వివో.. ఏఐ పవర్‌తో గూగుల్

Best Foldable Phones 2025: ఫోల్డ్ ఫోన్ల ఫైట్ షురూ.. 200ఎంపి కెమెరాతో శామ్‌సంగ్.. భారీ బ్యాటరీతో వివో.. ఏఐ పవర్‌తో గూగుల్
Advertisement

Best Foldable Phones 2025: ఫోల్డ్ స్మార్ట్ ఫోన్‌లు ఒకప్పుడు కొత్తగా కనిపించిన ఆలోచన మాత్రమే. కానీ 2025 నాటికి ఇవే ప్రీమియం ఫోన్ విభాగంలో ప్రధాన ఆకర్షణగా మారాయి. పెద్ద స్క్రీన్ అవసరమయ్యే పనులకు టాబ్లెట్ అనుభూతిని ఇవ్వడం, అదే సమయంలో మడిచి జేబులో పెట్టుకునేలా ఉండడం వీటి అసలైన బలం. ఈ ఏడాది బ్రాండ్లు ఫోల్డ్ ఫోన్‌లను కేవలం డిజైన్ పరంగా కాదు, రోజువారీ వాడుకకు సరిపోయే మెయిన్ ఫోన్‌లుగా తయారు చేయడంపై పూర్తిగా దృష్టి పెట్టాయి. బ్యాటరీ డెన్సిటీ పెరగడం, ఫోన్ బరువు తగ్గడం, కెమెరా క్వాలిటీ ఫ్లాగ్‌షిప్ స్లాబ్ ఫోన్‌ల స్థాయికి చేరడం వల్ల ఫోల్డ్ ఫోన్‌లపై యూజర్ల నమ్మకం బాగా పెరిగింది.

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 (Samsung Galaxy Z Fold 7)

Advertisement

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఈ మార్పుకు మంచి ఉదాహరణ. టైటానియం బ్యాక్ ప్లేట్ వాడటం వల్ల ఫోన్ బరువు 215 గ్రాములకు తగ్గింది. లోపల 8.0 ఇంచ్ పెద్ద డిస్‌ప్లే ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ చాలా సులభంగా మారింది. ఒకేసారి 2 లేదా 3 యాప్‌లు ఓపెన్ చేసి పని చేయడం ఈ ఫోన్‌తో సాఫీగా జరుగుతుంది. కెమెరా విషయంలో కూడా పెద్ద అప్‌గ్రేడ్ కనిపిస్తుంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇవ్వడం వల్ల ఫోటోగ్రఫీ పరంగా ఇది అల్ట్రా సిరీస్ ఫోన్‌లకు దగ్గరగా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8తో ఏఐ ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే బ్యాటరీ కెపాసిటీ 4400mm యాంపియర్ వద్దే ఉండటం కొంతమందికి పరిమితిగా అనిపించవచ్చు.

Also Read: PlayStation Holiday Sale: వందల్లో కాదు వేలల్లో తగ్గింపు.. సోనీ హాలిడే సేల్‌లో అదిరిపోయే డీల్స్.. మిస్ అవ్వకండి

Advertisement

వివో ఎక్స్ ఫోల్డ్ 5 (Vivo X Fold 5)

వివో ఎక్స్ ఫోల్డ్ 5 బ్యాటరీ విషయంలో పూర్తిగా కొత్త స్థాయి చూపించింది. 6000mm యాంపియర్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇవ్వడం వల్ల ఫోల్డ్ ఫోన్‌లలోనే ఇది అతిపెద్ద బ్యాటరీగా నిలిచింది. 80 వాట్ల వైర్డ్ చార్జింగ్, 40 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ ఉండటం వల్ల ఛార్జింగ్ వేగం చాలా బాగుంటుంది. వాటర్ రెసిస్టెన్స్ విషయంలో ఐపిఎక్స్ 8, ఐపిఎక్స్ 9 రేటింగ్‌లు ఇవ్వడం వల్ల డ్యూరబిలిటీపై నమ్మకం పెరుగుతుంది. జైస్‌తో కలిసి తయారు చేసిన 3 కెమెరాలు, ఒక్కోటి 50 మెగాపిక్సెల్‌తో రావడం వల్ల డే ఫోటోలు, జూమ్ షాట్స్‌లో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఉండటం వల్ల పర్‌ఫార్మెన్స్ పరంగా ఎలాంటి లోటు అనిపించదు.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ (Google Pixel 10 Pro Fold)

గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ హార్డ్‌వేర్ కంటే సాఫ్ట్‌వేర్ భవిష్యత్తుపై ఎక్కువగా ఫోకస్ చేసింది. టెన్సర్ జీ 5 చిప్‌తో ఆన్ డివైస్ ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. లోపల 8 ఇంచుల ఓఎల్ఈడి డిస్‌ప్లే, బయట 6.3 ఇంచుల స్క్రీన్ ఉండటం వల్ల రోజువారీ వాడుక బ్యాలెన్స్‌గా ఉంటుంది. ప్రధానంగా 7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీ ఇవ్వడం దీన్ని దీర్ఘకాలం వాడే ఫోల్డ్ ఫోన్‌గా మార్చుతుంది. ఐపి 68 రేటింగ్ ఉండటం వల్ల డస్ట్ రెసిస్టెన్స్ కూడా లభిస్తుంది, ఇది ఫోల్డ్ ఫోన్‌లలో చాలా అరుదైన విషయం. ఇకపై ఫోల్డ్ ఫోన్ అనేది సెకండరీ డివైస్ కాదు, పూర్తి స్థాయి మెయిన్ ఫోన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×