// // గోరంత కూలింగ్ ఫ్యాన్.. స్మార్ట్ గ్లాసెస్ ప్రపంచంలో కొత్త విప్లవం! -->
E-Paper
Advertisement

ఇది కదా టెక్నాలజీ అంటే.. స్మార్ట్ గ్లాసెస్ కోసం గోరంత కూలింగ్ ఫ్యాన్!

ఇది కదా టెక్నాలజీ అంటే.. స్మార్ట్ గ్లాసెస్ కోసం గోరంత కూలింగ్ ఫ్యాన్!
Advertisement

xMEMS Cooling Fan: మన చేతి గోరంత ఉండే ఒక చిన్న ఫ్యాన్.. రేపు మనం వాడే స్మార్ట్ గ్లాసెస్ భవిష్యత్తునే మార్చేస్తుందని ఊహించగలమా? అవును మీరు విన్నది నిజమే! సాధారణంగా స్మార్ట్ గ్లాసెస్‌ను ఎక్కువసేపు వాడితే వేడెక్కడం అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీనికి శాశ్వతంగా ముగింపు పలుకుతూ xMEMS Labs ఒక వినూత్న మైక్రో కూలింగ్ టెక్నాలజీని పరిచయం చేసింది.

వేడిని తగ్గించే ‘మైక్రో కూలింగ్’ విప్లవం:

ఈ కొత్త కూలింగ్ వ్యవస్థను µCooling పేరుతో కంపెనీ పిలుస్తోంది. ఇది ఒక చిన్న చిప్ రూపంలో ఉండి.. నేరుగా గ్లాసెస్ ఫ్రేమ్‌లోనే సరిపోతుంది. చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ, పరికరం ఉపరితల ఉష్ణోగ్రతను ఏకంగా 40 శాతం వరకు తగ్గిస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా.. వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని 70 శాతం వరకు పెంచుతుంది. దీంతో వినియోగదారులు రోజంతా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ గ్లాసెస్‌ను ధరించవచ్చు.

Advertisement

Also Read: షాపింగ్ మాత్రమే కాదు, ఇకపై ఫుడ్ కూడా.. Flipkart కొత్త ప్లాన్ మామూలుగా లేదుగా!

సన్నని స్పీకర్లతో మెరుగైన ఆడియో:

కేవలం కూలింగ్ మాత్రమే కాకుండా.. బరువు తగ్గించేందుకు అత్యంత సన్నని స్పీకర్ వ్యవస్థను కూడా కంపెనీ పరిచయం చేసింది. ‘సికామోర్’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ స్పీకర్ మందం కేవలం ఒక మిల్లీమీటర్ మాత్రమే ఉంటుంది. గ్లాసెస్ హ్యాండిల్స్‌లో అమర్చే ఈ స్పీకర్ల వల్ల బరువు పెరగకుండానే, నాణ్యమైన సౌండ్, ఏఐ అసిస్టెంట్లతో మాట్లాడేటప్పుడు స్పష్టమైన ఆడియో లభిస్తుంది.

ఏఐ యుగంలో తేలికైన స్మార్ట్ గ్లాసెస్:

Advertisement

ప్రస్తుతం స్మార్ట్ గ్లాసెస్ పరిధి పెరిగి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు ఎక్కువ అవుతున్నాయి. ప్రాసెసింగ్ ఎక్కువయ్యే కొద్దీ వేడి, పరికరం బరువు కూడా పెరుగుతాయి. ఈ రెండింటినీ అదుపులో ఉంచడానికి ఈ కూలింగ్ ఫ్యాన్, సన్నని స్పీకర్ల కాంబినేషన్ అద్భుతంగా తోడ్పడుతుంది. బరువు తక్కువగా, వేడెక్కకుండా ఉండే స్మార్ట్ గ్లాసెస్ రోజువారీ వాడకానికి ఎంతో అనుకూలంగా మారనున్నాయి.

త్వరలోనే ప్రదర్శనకు:

ఈ కొత్త టెక్నాలజీని త్వరలోనే తైపీ, షెన్‌జెన్‌లలో జరగబోయే ప్రత్యేక సదస్సుల్లో కంపెనీ ప్రదర్శించనుంది. ఈ సాంకేతికత గనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. మనం వాడే స్మార్ట్ గ్లాసెస్ మరింత తేలికగా, స్టైలిష్‌గా, శక్తివంతంగా మారడం ఖాయం.

Also Read: ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×