E-Paper
Advertisement

షావోమీ నుంచి 100 ఇంచుల భారీ స్మార్ట్ టీవీ.. తక్కువ ధరలో హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్!

షావోమీ నుంచి 100 ఇంచుల భారీ స్మార్ట్ టీవీ.. తక్కువ ధరలో హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్!
Advertisement

Xiaomi TV S Mini LED 2026: బడ్జెట్ ధరలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించే షావోమీ.. టీవీల విషయంలో మరోసారి తమ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. తాజాగా 2026 ఎడిషన్‌ పేరుతో షావోమీ టీవీ ఎస్ మినీ ఎల్‌ఈడీ సిరీస్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఇందులో చిన్న సైజుల నుంచి మొదలుకొని ఏకంగా 100 ఇంచుల భారీ స్క్రీన్ వరకు రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. దీంతో ఇక ఇంట్లోనే ఒక మినీ థియేటర్‌ను సెట్ చేసుకోవచ్చన్నమాట.

లైవ్ విజువల్స్ చూస్తున్న ఫీలింగ్..

ఈ టీవీల్లో వాడిన డిస్‌ప్లే క్వాలిటీ మామూలుగా లేదు. మినీ ఎల్‌ఈడీ టెక్నాలజీ వల్ల రంగులు చాలా నేచురల్‌గా, స్పష్టంగా కనిపిస్తాయి. పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉన్నా కూడా బొమ్మ క్లియర్‌గా కనిపించేలా దీనిలో 2000 నిట్స్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. ఇక గేమింగ్ అంటే ఇష్టపడే కుర్రాళ్లకు ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమ్స్ ఆడేటప్పుడు గానీ, ఫాస్ట్‌గా కదిలే యాక్షన్ సీన్లు చూసేటప్పుడు గానీ స్క్రీన్ ఎక్కడా ఆగకుండా చాలా స్మూత్‌గా సాగిపోతుంది.

Advertisement

Also Read: ఏందీ.. ఏసీలపై 65% డిస్కౌంటా? ఈ అమెజాన్ ధమాకా సేల్‌ను మిస్ చేసుకుంటే ఇంకెప్పుడూ కొనలేరు!

ఆడియో క్వాలిటీ అదిరింది..

ఈ స్మార్ట్ టీవీలో షావోమీ తమ సొంత ఏఐ ఇమేజ్ ఇంజిన్‌ను పెట్టింది. ఇది మనం చూసే వీడియోకి తగ్గట్టుగా సెట్టింగ్స్ మార్చేసి బెస్ట్ క్వాలిటీని ఇస్తుంది. ఇక ఆడియో గురించి చెప్పాలంటే.. వరల్డ్ ఫేమస్ హార్మన్ కంపెనీ వాళ్లు దీని సౌండ్‌ను ట్యూన్ చేశారు. దీంతోపాటు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండటంతో సౌండ్ వింటుంటే మనం థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది కంపెనీ లేటెస్ట్ హైపర్ ఓఎస్ మీద పనిచేస్తుంది.

ధర ఎంతంటే?

Advertisement

ఇక ఈ టీవీ ధర విషయానికి వస్తే.. 55 ఇంచుల మోడల్ రూ.38,000 దగ్గర మొదలవుతుంది. ఇక భారీగా ఉండే 100 ఇంచుల మోడల్ ధర దాదాపు రూ.1,28,000 వరకు ఉంటుంది. ప్రస్తుతానికి ఇవి చైనాలో రిలీజ్ అయ్యాయి. కానీ షావోమీకి మన దగ్గర ఉన్న క్రేజ్ చూస్తుంటే.. త్వరలోనే ఈ సిరీస్ మన దేశంలోనూ సందడి చేసే అవకాశం ఉంది. మంచి క్వాలిటీ ఉన్న పెద్ద టీవీ కావాలనుకునే వారికి ఇది కచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Also Read: సమ్మర్ హీట్‌కు బై బై.. మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టాప్-5 బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×