E-Paper
Advertisement

రూ.29,999 లాంచ్ ఆఫర్ ధరకే షావోమి ప్రీమియం టీవీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

రూ.29,999 లాంచ్ ఆఫర్ ధరకే షావోమి ప్రీమియం టీవీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Advertisement

Xiaomi Fire TV FX Series: స్మార్ట్ టీవీ మార్కెట్లో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ ప్రముఖ టెక్ బ్రాండ్ షావోమి (Xiaomi) తన సరికొత్త ప్రీమియం ‘షావోమి టీవీ ఎఫ్ఎక్స్ మినీ ఎల్‌ఈడీ’ (Xiaomi TV FX Mini LED) సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో 43 ఇంచుల నుంచి ఏకంగా 75 ఇంచుల భారీ స్క్రీన్ వరకు రకరకాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ఎల్‌ఈడీ టీవీలతో పోలిస్తే.. విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో అందించే ఈ సరికొత్త డివైజ్, ఫైర్ టీవీ సపోర్ట్ , అద్భుతమైన గేమింగ్ ఫీచర్లతో వస్తోంది. మిమ్మల్ని థియేటర్ ప్రపంచంలోకి తీసుకెళ్లే ఈ స్మార్ట్ టీవీల పూర్తి ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో అద్భుతమైన విజువల్స్:

Advertisement

షావోమి ఎఫ్ఎక్స్ సిరీస్‌లో అత్యంత ముఖ్యమైన హైలైట్ దీని డిస్‌ప్లే టెక్నాలజీ. ఇందులో క్యూడి మినీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఉపయోగించారు. ఇది కంపెనీ యొక్క సొంత ‘క్వాంటం మ్యాజిక్’ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ స్క్రీన్‌ల వెనుక వందలాది చిన్న చిన్న ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. ఇవి స్క్రీన్‌పై వచ్చే రంగులను, వెలుతురును చాలా ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాయి. దీని వల్ల సాధారణ టీవీలలో వచ్చే బూడిద రంగు మసక లేకుండా.. ‘ప్యూర్ బ్లాక్’ విజువల్స్, అద్భుతమైన బ్రైట్‌నెస్ లభిస్తాయి.

ఈ స్మార్ట్ టీవీలు 4K అల్ట్రా హెచ్‌డీ (3840×2160 పిక్సెల్స్) రిజల్యూషన్, HDR10, HDR10+ ఫార్మాట్లకు సపోర్ట్ ఇస్తాయి. అంతేకాదు.. డైరెక్టర్లు సినిమాను ఎలా తీశారో అదే క్వాలిటీతో చూడటానికి ఇందులో ‘ఫిల్మ్‌మేకర్ మోడ్’ కూడా ఉంది. ఇక దీని అల్ట్రా-స్లిమ్ మెటాలిక్ బెజెల్-లెస్ డిజైన్ కారణంగా, 75 ఇంచుల మోడల్‌లో దాదాపు 98 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో లభిస్తుంది. అంటే టీవీ చూస్తున్నప్పుడు అంచులు అస్సలు కనిపించవు.

Advertisement

గేమర్లకు పండగే:
గేమింగ్ ఇష్టపడే వారి కోసం షావోమి ఈ సిరీస్‌లో అదిరిపోయే ఫీచర్లను చేర్చింది. 43 ఇంచుల మోడల్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుండగా.. 55 ఇంచులు, 65 ఇంచులు , 75 ఇంచుల పెద్ద మోడల్స్‌లో DLG 120Hz గేమ్ మోడ్ అందించారు. దీంతో పాటు ఆటో లో లేటెన్సీ మోడ్ (ALLM), MEMC టెక్నాలజీలు ఉన్నాయి. దీని వల్ల హై-గ్రాఫిక్స్ గేమ్‌లు ఆడుతున్నప్పుడు గానీ.. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు గానీ ఎక్కడా స్క్రీన్ లాగ్ లేదా బ్లర్ అవ్వకుండా విజువల్స్ చాలా స్మూత్‌గా సాగుతాయి.

ఫైర్ టీవీ, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్:
సాధారణంగా షావోమి టీవీలు గూగుల్ టీవీ లేదా ప్యాచ్‌వాల్‌తో వస్తాయి. కానీ ఈ సరికొత్త ఎఫ్ఎక్స్ సిరీస్‌లో ఫైర్ టీవీ ఇన్-బిల్ట్‌గా ఇచ్చారు. దీని వల్ల యూజర్లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి 12,000 పైగా అప్లికేషన్లను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఇందులో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ కూడా బిల్ట్-ఇన్ ఉంది. కాబట్టి కేవలం వాయిస్ కమాండ్‌తో టీవీని కంట్రోల్ చేయవచ్చు. యాపిల్ ఎయిర్‌ప్లే 2 (Apple AirPlay 2) సపోర్ట్ ఉండటం వల్ల ఐఫోన్ స్క్రీన్‌ను కూడా సులభంగా టీవీకి కాస్ట్ చేసుకోవచ్చు.

ఈ టీవీల పర్ఫార్మెన్స్ కోసం క్వాడ్-కోర్ కార్టెక్స్-A55 ప్రాసెసర్‌తో పాటు 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. భారీ స్టోరేజ్ ఉండటం వల్ల ఎక్కువ యాప్స్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే.. ఇందులో డాల్బీ ఆడియో , DTS:X , DTS వర్చువల్:ఎక్స్ సపోర్ట్‌తో కూడిన 20W స్పీకర్ సిస్టమ్ ఉంది. 55 ఇంచులు , ఆపై మోడల్స్‌లో క్వాడ్-స్పీకర్ సెటప్ ఉండటం వల్ల సినిమా చూస్తున్నప్పుడు అద్భుతమైన థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది.

బ్యాంక్ ఆఫర్స్ ,సేల్స్:

హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి వేరియంట్‌ను బట్టి అదనంగా రూ.2,000 నుంచి రూ. 5,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ టీవీల సేల్స్ ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తో పాటు ఎంఐ అధికారిక వెబ్‌సైట్ (mi.com), లీడింగ్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఒక సంవత్సరం వారంటీతో వస్తున్న ఈ స్మార్ట్ టీవీలు, తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×