E-Paper
Advertisement

Xiaomi Mijia Electric Shaver: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 నెలలు నాన్-స్టాప్ షేవింగ్.. మిజియా ఎలక్ట్రిక్ షేవర్ ప్రో హైలైట్స్ ఇవే!

Xiaomi Mijia Electric Shaver: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 నెలలు నాన్-స్టాప్ షేవింగ్.. మిజియా ఎలక్ట్రిక్ షేవర్ ప్రో హైలైట్స్ ఇవే!
Advertisement

Xiaomi Mijia Electric Shaver Pro: షియోమి పేరు వినగానే వినియోగదారులకు ముందుగా గుర్తుకువచ్చేది.. మంచి క్వాలిటీ, కొత్త ఫీచర్స్, ఆఫోర్డబుల్ ధరలు. ఇదే ఫార్ములాను ఇప్పుడు గ్రూమింగ్ సెగ్మెంట్‌లో కూడా కొనసాగిస్తోంది. తాజాగా కంపెనీ ‘Mijia Electric Shaver Pro’ మోడల్‌ను లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్లు, పూర్తి వివరాలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 3 నెలలు నో టెన్షన్:

ఈ ఎలక్ట్రిక్ షేవర్‌ ప్రధాన హైలైట్‌ ఏమిటంటే.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 90 రోజులపాటు ఎలాంటి టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. అంతేకాదు.. ఈ షేవర్‌లో ఉన్న డబుల్-రింగ్ టెక్స్చర్డ్ బ్లేడ్ సిస్టమ్ షేవింగ్ పనితీరును దాదాపు 48 శాతం వరకు పెంచుతుందని కంపెనీ చెబుతోంది. దీంతో చర్మంపై ఒత్తిడి లేకుండా మరింత మృదువైన, క్లీన్ షేవ్‌ను పొందవచ్చు. ఈ షేవర్‌లో ఉన్న మరో అదనపు ఫీచర్ ఏమిటంటే.. 360 డిగ్రీలు తిరిగే షేవింగ్ హెడ్ ఇది. ముఖాకారానికి అనుగుణంగా మలచుకొని మరింత ప్రిసైజ్‌గా షేవ్ చేసేలా సహాయపడుతుంది. అయితే.. ఈ కొత్త మోడల్ ధరను మాత్రం షియోమి సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

నొప్పి, చిరాకు ఉండదు:

Advertisement

షియోమీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ సేవర్‌లో 1.76 మిలియన్ సిలికాన్ ఆధారిత మైక్రోబీడ్‌లు ఉన్నాయి. దీనిని ఉపయోగించినప్పుడు ముఖం మీద గరుకును తగ్గించి, నొప్పి లేదా చికాకును నివారిస్తాయి. ఇది లో-నికెల్ స్టీల్‌తో తయారు చేయబడిన షేవర్. దీంతో సున్నితమైన చర్మం కలిగిన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. భారీ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉన్న ఈ ఎలక్ట్రిక్ షేవర్ ఛార్జింగ్ కోసం USB టైప్-C కి మద్దతు ఇస్తుంది. ఇది IPX8 రేటింగ్‌తో లభిస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×