E-Paper
Advertisement

సుర్రుమనే ఎండలకు.. షావోమీ ‘కూల్’ పంచ్.. జస్ట్ 15 సెకన్లలో చిల్లుమనే చల్లదనం!

సుర్రుమనే ఎండలకు.. షావోమీ ‘కూల్’ పంచ్.. జస్ట్ 15 సెకన్లలో చిల్లుమనే చల్లదనం!
Advertisement

Xiaomi AC: ప్రముఖ టెక్ కంపెనీ షావోమీ (Xiaomi) సరికొత్త ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు మార్కెట్ కు పరిచయం చేస్తూనే ఉంటుంది. తాజాగా హోమ్ అప్లయన్స్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ ఒక సరికొత్త ఫ్లోర్ స్టాండింగ్ ఎయిర్ కండిషనర్‌ (Mijia Powerful Wind Floor Standing Air Conditioner)ను లాంచ్ చేసింది. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడేవారు.. గదిలోకి రాగానే కేవలం 15 సెకన్లలోనే చల్లదనాన్ని అందించడం ఈ ఏసీ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఫ్లోర్ స్టాండింగ్ ఏసీకి సంబంధించిన మరిన్ని ప్రత్యేకతలు గురించి ఇప్పుడు చూద్దా.ం

ర్యాపిడ్ కూలింగ్ టెక్నాలజీ

సాధారణ ఏసీలు గదిని కూల్ చేయడానికి కనీసం 5 నుండి 10 నిమిషాల సమయం తీసుకుంటాయి. కానీ షావోమీ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫ్లోర్ స్టాండింగ్ ఏసీలో అత్యాధునిక ‘ర్యాపిడ్ కూలింగ్ టెక్నాలజీ’ని ఉపయోగించారు. దీనివల్ల కంప్రెసర్ ఆన్ చేసిన వెంటనే అత్యంత వేగంగా చల్లటి గాలిని గది నలుమూలలా వ్యాపింపజేస్తుంది. కంపెనీ ప్రకారం.. ఏసీ ఆన్ చేసిన కేవలం 15 సెకన్లలోనే గది ఉష్ణోగ్రతలో మార్పును గమనించవచ్చు.

ఇంటికి స్టైలిష్ లుక్

Advertisement

ఈ ఏసీని ఎంతో స్టైలిష్ గా షావోమీ డిజైన్ చేసింది. చూడటానికి ఇది విలాసవంతమైన టవర్ లాగా కనిపిస్తుంది. దీని డిజైన్ చాలా ప్రీమియంగా, మోడ్రన్‌గా ఉండటం వల్ల మీ లివింగ్ రూమ్‌ లేదా బెడ్‌రూమ్‌కు ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. గోడలకు రంధ్రాలు చేయాల్సిన అవసరం లేకుండా గదిలో ఎక్కడైనా సులభంగా దీనిని ఫిక్స్ చేసుకోవచ్చు.

మొబైల్‌తోనే కంట్రోల్

షావోమీ ప్రొడక్ట్ అంటేనే స్మార్ట్ ఫీచర్లకు కేరాఫ్ గా చెబుతుంటారు. ఈ టవర్ ఏసీ కూడా అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. దీనిని మిలియా (Mi Home) యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయవచ్చు. ఆఫీస్ నుండి ఇంటికి బయల్దేరే ముందే ఫోన్ ద్వారా ఏసీ ఆన్ చేసుకుంటే.. ఇంటికి వచ్చేసరికి గది మొత్తం కూల్‌గా మారిపోతుంది. అంతేకాదు ఇది గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి వాయిస్ కమాండ్స్‌తో కూడా పనిచేస్తుంది.

విద్యుత్ ఆదా

Advertisement

ఈ ఫ్లోర్ స్టాండింగ్ ఏసీ.. గదిని వేగంగా చల్లబరచడంతో పాటు విద్యుత్ ను సైతం ఆదా చేస్తుందని షావోమీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో నెక్స్ట్ జనరేషన్ ఇన్వర్టర్ కంప్రెసర్‌ను వాడటం వల్ల గది ఉష్ణోగ్రతను బట్టి పవర్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల కరెంట్ వినియోగం చాలా వరకు తగ్గుతుందని సాధారణ ఏసీలతో పోలిస్తే ఇది ఎక్కువ విద్యుత్‌ను ఆదా చేస్తుందని షావోమీ పేర్కొంది.

Also Read: ఏసీని ఎలా పడితే అలా ఆఫ్ చేస్తున్నారా? అయితే షెడ్డుకు వెళ్లడం ఖాయం!

ఇంతకీ ధర ఎంతంటే?

షావోమీ ఈ ఫ్లోర్ స్టాండింగ్ ఏసీని.. చైనా మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను 5,999 యువాన్లుగా నిర్ణయించింది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర దాదాపు రూ.84,394గా ఉంది. త్వరలోనే భారత మార్కెట్లోకి సైతం ఈ స్టాండింగ్ ఏసీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×