// // Xiaomi Civi 6 Series: మీడియాటెక్ ప్రాసెసర్‌తో షావోమీ సివి 6 సిరీస్! -->
E-Paper
Advertisement

గేమర్లకు, సినిమా ప్రియులకు పండగే.. Xiaomi Civi 6 Proలో భారీ మార్పులు, ఫైనల్ లుక్ చూశారా?

గేమర్లకు, సినిమా ప్రియులకు పండగే.. Xiaomi Civi 6 Proలో భారీ మార్పులు, ఫైనల్ లుక్ చూశారా?
Advertisement

Xiaomi Civi 6 Series: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షావోమీ.. ఇప్పుడు Civi సిరీస్‌లో సరికొత్త ఫోన్లను రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోంది. తాజా లీక్స్ ప్రకారం.. Xiaomi Civi 6, Xiaomi Civi 6 Pro మోడల్స్ త్వరలోనే మార్కెట్‌లో సందడి చేయనున్నాయి. ముఖ్యంగా కెమెరా క్లారిటీ, డిస్‌ప్లే విషయంలో ఈసారి కంపెనీ గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.

డిస్‌ప్లే చూస్తే కళ్లకు విందే:

ఫోన్ చూడగానే ముందుగా మనల్ని ఆకట్టుకునేది దాని స్క్రీనే కదా. అందుకే ఈ కొత్త సిరీస్‌లో డిస్‌ప్లే విషయంలో భారీ మార్పులు చేశారు. మామూలు Civi 6 మోడల్ 6.59 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంటే.. Pro వెర్షన్ మాత్రం 6.83 అంగుళాల భారీ స్క్రీన్‌తో వస్తోంది. ఈ రెండింటిలోనూ 1.5K రిజల్యూషన్ ఇస్తున్నారు. దీంతో సినిమా చూసినా, గేమ్స్ ఆడినా ఆ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవల్‌లో ఉంటుందన్నమాట.

ఈసారి ప్రాసెసర్ అదుర్స్:

Advertisement

సాధారణంగా షావోమీ తమ Civi మోడల్స్‌లో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లను వాడుతుంటుంది. కానీ ఈసారి మాత్రం మీడియాటెక్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. Civi 6లో డైమెన్సిటీ 8500 చిప్‌సెట్ వస్తుండగా.. Pro మోడల్‌లో ఇంకా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను వాడుతున్నారట. దీనివల్ల ఫోన్ స్పీడ్ పెరగడమే కాకుండా.. మల్టీ టాస్కింగ్ కూడా చాలా సులభతరం కానుంది.

Also Read: ఐఫోన్ రేంజ్ కెమెరా, సూపర్ స్పీడ్.. ఈ Vivo S50t ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి!

5x ఆప్టికల్ జూమ్ ఫీచర్:

Advertisement

ఈసారి రెండు మోడల్స్‌లోనూ 50MP పెరిస్కోప్ కెమెరాను వాడుతున్నారు. ఇందులో ఉండే 5x ఆప్టికల్ జూమ్ ఫీచర్ వల్ల చాలా దూరంలో ఉన్న వస్తువులను కూడా పిక్సెల్స్ పగలకుండా చాలా క్లియర్‌గా ఫొటోలు తీసుకోవచ్చు. అలాగే ఇన్‌స్టా రీల్స్ చేసే వారికి, ఫొటోషూట్స్ అంటే ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.

పాత మోడల్ కంటే పవర్‌ఫుల్:

గతేడాది వచ్చిన Civi 5 Proలో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ ఉండేవి. అయితే ఇప్పుడు రాబోతున్న Civi 6 Pro అంతకు మించిన ఫీచర్లతో వస్తోంది. తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ మన దేశానికి వచ్చేసరికి రూ.41,000 పైనే ఉండొచ్చు. ఫీచర్లను బట్టి చూస్తే ఈ ధర రీజనబుల్ అనిపిస్తోంది.

భారత్‌లోకి ఎప్పుడంటే?

ఎప్పటిలాగే షావోమీ ఈ ఫోన్లను ముందుగా చైనాలోనే విడుదల చేయనుంది. ఆ తర్వాతే గ్లోబల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. స్టైలిష్ లుక్, అదిరిపోయే కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్లు యూత్‌ను బాగా ఆకట్టుకుంటాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చి ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాలి.

Also Read: 9020mAh బ్యాటరీ.. 90W ఫాస్ట్ ఛార్జింగ్, iQOO Z11 గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×