E-Paper
Advertisement

Black Shark GS3 Ultra Smartwatch: ఏముందీ షియోమీ స్మార్ట్ వాచ్.. 18 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో మార్కెట్లోకి కొత్త సరుకు!

Black Shark GS3 Ultra Smartwatch: ఏముందీ షియోమీ స్మార్ట్ వాచ్.. 18 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో మార్కెట్లోకి కొత్త సరుకు!
Advertisement

Black Shark GS3 Ultra Smartwatch: కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రముఖ టెక్ సంస్థ షియోమీ కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. Black Shark GS3 Ultra పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌వాచ్‌లు ప్రస్తుతం ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో విక్రయానికి వచ్చాయి. ఇది 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 160 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ఫీచర్లు కలిగి ఉన్న ఈ బ్లాక్ షార్క్ GS3 అల్ట్రా వాచ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

ఈ బ్లాక్ షార్క్ GS3 అల్ట్రా స్మార్ట్‌వాచ్.. సుమారు 18 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌వాచ్ డ్యూయల్-బ్యాండ్ GPSకి మద్దతు ఇస్తుంది. అలాగే కంపెనీ దీనిలో అనేక ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. ఈ స్మార్ట్‌వాచ్ మునుపటి బ్లాక్ షార్క్ GS3కి అప్‌గ్రేడ్ వెర్షన్ అని తెలుస్తోంది.

ధర, స్పెసిఫికేషన్లు:

Advertisement

ఈ బ్లాక్ షార్క్ GS3 అల్ట్రా స్మార్ట్‌వాచ్.. 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను 466×466 పిక్సెల్‌ల రిజల్యూషన్ 1000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఇది వాయిస్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఎన్విరాన్ మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 5ATM వాటర్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంది. 50 మీటర్ల వరకు నీటిలో మునిగిపోయినప్పటికీ వాచ్ డ్యామేజ్ అవకుండా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇక ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌వాచ్ ప్రారంభ ధర రూ.14,999గా ఉంది. అలాగే ఈ స్మార్ట్‌వాచ్ అన్ని ఫీచర్లు షియోమీ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యాయి. ఈ స్మార్ట్‌వాచ్ బ్లాక్, సిల్వర్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

18 రోజుల బ్యాటరీ బ్యాకప్:

Black Shark GS3 Ultra స్మార్ట్‌వాచ్.. 270 కి పైగా ఉచిత వాచ్‌ఫేస్‌లతో వస్తుంది. దీనిలో బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్, హార్ట్ రేట్ సెన్సార్, స్ట్రెస్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి హెల్త్ మానిటరింగ్ ఫీచర్ కూడాలు ఉన్నాయి. అలాగే రోజులో మనం ఎన్ని అడుగులు వేస్తున్నాం అని కూడా లెక్కిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌వాచ్ 45 రోజుల స్టాండ్‌బై టైమ్‌ను, సాధారణ వాడకంతో 18 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని సమాచారం.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×