// // Xiaomi 17T Series: 12GB ర్యామ్, లేటెస్ట్ ఫీచర్లతో Xiaomi 17T వస్తోంది! -->
E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ 16తో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదేనా? Xiaomi 17T అదిరిపోయే ఫీచర్లు లీక్!

ఆండ్రాయిడ్ 16తో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదేనా? Xiaomi 17T అదిరిపోయే ఫీచర్లు లీక్!
Advertisement

Xiaomi 17T Series: షావోమీ నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ సందడి చేయడానికి రెడీ అవుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే షావోమీ 17 సిరీస్ ఒక ఊపు ఊపేస్తుండగా.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా Xiaomi 17T సిరీస్‌ను కంపెనీ రంగంలోకి దించుతోంది. తాజాగా ఈ ఫోన్ గీక్‌బెంచ్ అనే వెబ్‌సైట్‌లో కనిపించడంతో.. అసలు దీనిలో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి? దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? అనే విషయాలపై సోషల్ మీడియాలో టెక్ లవర్స్ మధ్య పెద్ద చర్చే నడుస్తోంది.

Xiaomi 17T వస్తోంది..

షావోమీ తన సబ్ ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో 17T, 17T ప్రో అనే రెండు కొత్త మోడళ్లను లాంచ్ చేసే ప్లాన్‌లో ఉంది. గీక్‌బెంచ్ ఏఐ డేటాబేస్‌లో ఒక కొత్త ఫోన్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ మోడల్ నెంబర్‌ను బట్టి చూస్తే అది పక్కాగా షావోమీ 17T అని అర్థమవుతోంది. ఈ కొత్త ఫోన్ మిడ్‌రేంజ్ ధరలోనే మనకు ఒక ప్రీమియం ఫీలింగ్‌ను ఇచ్చేలా కంపెనీ డిజైన్ చేస్తోందట. బడ్జెట్ కాస్త అటు ఇటుగా ఉన్నా.. ఫ్లాగ్‌షిప్ రేంజ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ కానుంది.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో ప్రీమియం వైర్డ్ హెడ్‌ఫోన్స్.. సెన్హైజర్ కొత్త టైప్-సి గ్యాడ్జెట్స్ లాంచ్, పూర్తి వివరాలు మీ కోసం!

డైమెన్సిటీ చిప్‌సెట్..

ఈ ఫోన్ పనితీరు విషయానికొస్తే.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది. దీని స్పీడ్ ఎంతలా ఉంటుందంటే.. మనం ఫోన్‌లో ఏ పని చేసినా చాలా వేగంగా అయిపోతుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్ కోసం మాలి G720 MC8 జీపీయూని ఇచ్చారు. కాబట్టి.. భారీ గేమ్‌లు ఆడేవాళ్లకు, మొబైల్‌లో ఎప్పుడూ మల్టీ టాస్కింగ్ చేసేవాళ్లకు ఇది సూపర్ ఛాయిస్ అవుతుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కొన్ని టాప్ ఫోన్లలో కూడా ఇదే చిప్‌సెట్ వాడుతున్నారు. కాబట్టి పర్ఫార్మెన్స్ అదిరిపోతుందని గ్యారెంటీగా చెప్పొచ్చు.

లేటెస్ట్ సాఫ్ట్‌వేర్..

Advertisement

ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలంటే RAM ముఖ్యం కదా. అందుకే దీనిలో ఏకంగా 12GB RAMను ఇస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌పై నడుస్తుంది. దీనికి తోడు షావోమీ సొంత సాఫ్ట్‌వేర్ హైపర్‌ఓఎస్ 3 ఉండటంతో ఫోన్ వాడటం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక AI విషయంలో కూడా ఈ ఫోన్ అదరగొడుతోంది. ఫొటోలు ఎడిట్ చేయడం నుంచి వాయిస్ అసిస్టెంట్ వరకు అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా స్మార్ట్‌గా పనిచేస్తాయి.

భారత్‌లోకి ఎప్పుడంటే?

ఈ షావోమీ 17T సిరీస్ ఫోన్లు ఇప్పటికే కొన్ని ముఖ్యమైన సర్టిఫికేషన్లను పూర్తి చేసేసుకున్నాయి. దీన్ని బట్టి చూస్తే లాంచ్ డేట్ ఎంతో దూరంలో లేదని క్లియర్‌గా అర్థమవుతోంది. మన దేశంలో ఏప్రిల్ చివర్లో లేదంటే మే నెల మొదటి వారంలో ఈ ఫోన్లు లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ధర ఎంత ఉంటుంది? ఫుల్ స్పెసిఫికేషన్స్ ఏంటి? అనే వివరాలు కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది. మంచి కెమెరా, మంచి స్పీడ్ ఉన్న ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ ఫోన్ కచ్చితంగా నచ్చుతుంది.

Also Read: యాపిల్ ఫ్యాన్స్‌కు పండగే.. iPhone 17పై ఊహించని డిస్కౌంట్, ఎక్కడో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×