E-Paper
Advertisement

Xiaomi 17 Max పవర్‌ఫుల్ ఎంట్రీ.. 8,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో టెక్ ప్రియుల్లో కాక రేపుతోంది!

Xiaomi 17 Max పవర్‌ఫుల్ ఎంట్రీ.. 8,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో టెక్ ప్రియుల్లో కాక రేపుతోంది!
Advertisement

Xiaomi 17 Max: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమి తమ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో మరో సరికొత్త ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. అదే Xiaomi 17 Max. ఈ నెల మొదట్లో జరిగిన ఒక భారీ ఈవెంట్‌లో షావోమి YU7 GT కార్, బ్యాండ్ 10 ప్రో, ఇయర్ క్లిప్ TWS వంటి గ్యాడ్జెట్స్‌తో పాటు ఈ ఫోన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో షావోమి 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్, 17 అల్ట్రా మోడల్స్ ఉండగా.. ఇప్పుడు వీటికి తోడుగా ఈ మ్యాక్స్ వెర్షన్ వచ్చి చేరింది. ముఖ్యంగా భారీ బ్యాటరీ, అదిరిపోయే కెమెరా కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని దీనిని డిజైన్ చేశారు.

లైకా బ్రాండింగ్ కెమెరా:

ఈ Xiaomi 17 Max ఫీచర్ల విషయానికి వస్తే.. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం దీనిలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను వాడారు. దీంతో ఫోన్ చాలా స్మూత్‌గా, ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఇక ఫొటోగ్రఫీ ప్రియుల కోసం లైకా బ్రాండింగ్‌తో కూడిన 200MP కెమెరాను అమర్చారు. దీనితో ఎలాంటి లైటింగ్‌లోనైనా అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు.

భారీ బ్యాటరీ బ్యాకప్:

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ. దీనిలో ఏకంగా 8,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఎక్కువ సమయం ఫోన్ వాడేవారికి, గేమర్స్‌కు ఈ బ్యాటరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండ్రోజుల వరకు ఛార్జింగ్ అయిపోదనే నమ్మకాన్ని ఈ ఫోన్ ఇస్తుంది.

Also Read: వామ్మో.. రూ.63 వేలా? సోనీ కొత్త యానివర్సరీ హెడ్‌ఫోన్స్‌లో అంత స్పెషల్ ఏముందో చూసేద్దామా!

ధర ఎంతంటే?

Advertisement

ఇకపోతే Xiaomi 17 Max ధర విషయానికి వస్తే.. చైనాలో దీని బేస్ వేరియంట్ (12GB RAM + 256GB స్టోరేజ్) ధర సుమారు రూ.67,800గా ఉంది. ఇందులో గరిష్టంగా 16GB RAM, 512GB స్టోరేజ్ వరకు మొత్తం నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్ బ్లాక్, స్కై బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ అమ్మకాలు మే 25 నుంచి చైనాలో ప్రారంభం కానున్నాయి.

గ్లోబల్ లాంచ్ ఎప్పుడు?

ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలోనే అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలోకి వస్తుందా లేదా అనేదానిపై కంపెనీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే షావోమి 17, 17 అల్ట్రా మోడల్స్ ఇప్పటికే గ్లోబల్‌గా అందుబాటులో ఉన్నాయి. అలాగే త్వరలోనే షావోమి 17T, 17T ప్రో మోడల్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి.. ఈ మ్యాక్స్ వెర్షన్ కేవలం చైనా మార్కెట్‌కే పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read: బ్యాంక్ అకౌంట్‌తో పనిలేదిక.. టీనేజర్స్ కోసం టాప్-8 సూపర్ డిజిటల్ పాకెట్ మనీ యాప్స్ ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×