E-Paper
Advertisement

Google TV Projector: రూ.20 వేలకే 1200 ANSI బ్రైట్‌నెస్.. గూగుల్ టీవీ సపోర్ట్‌తో బెస్ట్ హోమ్ థియేటర్ ప్రొజెక్టర్ లాంచ్!

Google TV Projector: రూ.20 వేలకే 1200 ANSI బ్రైట్‌నెస్.. గూగుల్ టీవీ సపోర్ట్‌తో బెస్ట్ హోమ్ థియేటర్ ప్రొజెక్టర్ లాంచ్!
Advertisement

Google TV Projector: మూవీ లవర్స్ కోసం ప్రముఖ బ్రాండ్ Wzatco తాజాగా ఓ క్రేజీ ప్రొజెక్టర్‌ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. Wzatco Yuva Infinity పేరుతో వచ్చిన ఈ ప్రొజెక్టర్‌ చిన్న రూముల్లో కూడా పెద్ద స్క్రీన్ అనుభూతిని అందించేలా, అత్యాధునిక గూగుల్ టీవీ ఫీచర్లతో రూపొందించారు. ఇప్పుడీ ప్రొజెక్టర్ ధర, ఫీచర్లు, కీలక వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..

అద్భుతమైన లైటింగ్..

ఈ వజాట్కో యువ ఇన్ఫినిటీ ప్రొజెక్టర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది 1200 ANSI ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. తద్వారా రూంలో కాస్త వెలుతురు ఉన్నా కూడా పిక్చర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ ప్రొజెక్టర్ 1080p రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు 4K వీడియోలను కూడా ప్లే చేయగలదు. HDR10+ సపోర్ట్ ఉండటం వల్ల కలర్స్ చాలా నేచురల్, రిచ్‌గా కనిపిస్తాయి.

Advertisement

Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు వాడొచ్చు.. 8,500mAh బ్యాటరీతో వస్తోన్న షియోమీ 17T ప్రో!

స్మార్ట్ ఎంటర్టైన్మెంట్..

యువ ఇన్ఫినిటీలో అఫీషియల్ గూగుల్ టీవీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు. దీంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి యాప్స్‌ను నేరుగా వాడుకోవచ్చు. అలాగే ఈ ప్రొజెక్టర్‌లో Widevine L1 సపోర్ట్ ఉండటం వల్ల కంటెంట్‌ను హై క్వాలిటీలో స్ట్రీమ్ చేయొచ్చు. దీంతోపాటు గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్..

Advertisement

సాధారణంగా గోడకు – ప్రొజెక్టర్‌కు మధ్య ఎక్కువ దూరం ఉండాలి. కానీ ఇందులో షార్ట్ త్రో రేషియో ఫీచర్ ఉండటంతో తక్కువ దూరం నుంచే దాదాపు 300 అంగుళాల వరకు పెద్ద స్క్రీన్‌ అనుభూతిని పొందవచ్చు. అంతేకాదు.. కేవలం 1.8 కేజీల బరువు ఉండే ఈ ప్రొజెక్టర్‌ను ఎక్కడికైనా సులువుగా పట్టుకెళ్లొచ్చు. దీనికి ఉన్న రొటేటబుల్ స్టాండ్ వల్ల యాంగిల్‌ను అడ్జస్ట్ చేయడం కూడా సులభం.

ధర వివరాలు..

ప్రస్తుతం ఈ వజాట్కో యువ ఇన్ఫినిటీ ప్రొజెక్టర్ అమెజాన్ ఇండియా, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.49,990 ఉండగా, లాంచ్ ఆఫర్ కింద కేవలం రూ.19,990కే లభిస్తోంది. కంపెనీ దీనిపై ఒక ఏడాది వారంటీని అందిస్తోంది. అయితే, వారంటీ పొందాలంటే కొన్న తర్వాత కంపెనీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి.

Also Read: రూ.13 వేలకే శాంసంగ్ 5G ఫోన్.. లెదర్ ఫినిష్ లుక్‌తో గెలాక్సీ F70e భారత్‌లో లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×