E-Paper
Advertisement

Wood Fire Cooking: కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారా? ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే!

Wood Fire Cooking: కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారా? ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే!
Advertisement

Wood Fire Cooking: మన దేశంలో చాలా ఏళ్లుగా కట్టెల పొయ్యి మీద వంట చేయడం ఒక సంప్రదాయం. ఇప్పటికీ గ్రామాల్లోనే కాదు, కొన్ని పట్టణాల్లో కూడా ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా చేసిన వంటకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. కట్టెల పొయ్యి మీద వండిన అన్నం , కూరలకు ఉండే ఆ ప్రత్యేకమైన స్మోకీ ఫ్లేవర్ మరెక్కడా దొరకదు. కానీ అదే సమయంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. ఈ సాంప్రదాయ పద్దతిలో రుచితో పాటు కొన్ని ఆరోగ్యపరమైన సవాళ్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

కట్టెల పొయ్యి వల్ల లాభాలు ఏంటి?

Advertisement

1.కట్టెల పొయ్యిపై చేసిన వంటకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ముఖ్యంగా చపాతీ, కూర, పప్పు వంటివి చాలా టేస్టీగా ఉంటాయి. మంట నెమ్మదిగా ఉండడం వల్ల వంట బాగా కుదురుతుంది.

2. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఎంటంటే.. ఖర్చు తక్కువగా అవుతుంది. గ్రామాల్లో కట్టెలు సులభంగా దొరకడం వల్ల గ్యాస్ ఖర్చు ఉండదు. అందుకే చాలా కుటుంబాలు దీనిని ఇష్టపడతాయి.

Advertisement

3. కరెంట్ లేదా గ్యాస్ అవసరం లేకపోవడం కూడా దీనికి పెద్ద ప్లస్. పవర్ కట్ ఉన్నా, గ్యాస్ లేకపోయినా సులభంగా కట్టెల పొయ్యిపై వంట చేసుకోవచ్చు.

4. కొన్ని సందర్భాల్లో మంట ఎక్కువగా ఉంటే త్వరగా వంట చేయవచ్చు. అలాగే ప్రకృతి నుంచి వచ్చే వనరులు కావడంతో ఇది కొంతవరకు సహజమైన పద్ధతి అని చెప్పవచ్చు.

నష్టాలు ఏంటి?

1.కట్టెల పొయ్యి వల్ల వచ్చే పెద్ద సమస్య పొగ. ఈ పొగ ఆరోగ్యానికి చాలా హానికరం. దీన్ని ఎక్కువగా పీల్చడం వల్ల దగ్గు, శ్వాస సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు. ముఖ్యంగా వంట చేసే మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడతారు.

2. ఇంకా ఒక సమస్య ఏమిటంటే ఇంటి గోడలు, పాత్రలు నల్లగా మారిపోవడం. ప్రతిరోజూ శుభ్రం చేయడం కష్టంగా ఉంటుంది.

3. కట్టెలు తెచ్చుకోవడం కూడా ఒక పెద్ద పని. వాటిని కొట్టడం, ఎండబెట్టడం, నిల్వ చేయడం అన్నీ టైమ్ తీసుకుంటాయి.

4. గ్యాస్ స్టౌవ్‌లా మంటను వెంటనే కంట్రోల్ చేయడం కష్టం. ఎక్కువ మంట పెరిగితే వంట మాడిపోవచ్చు. తక్కువైతే మాత్రం ఎక్కువ టైమ్ పడుతుంది.

5. ఇంకా చెట్లను ఎక్కువగా నరికితే పర్యావరణానికి కూడా నష్టం జరుగుతుంది. అడవులు తగ్గిపోవడం, కాలుష్యం పెరగడం వంటి సమస్యలు వస్తాయి.

Also Read: ఇక స్టవ్‌తో పనిలేదు! ఈ మల్టీ-కుక్కర్ ఉంటే చాలు.. బిర్యానీ నుంచి సూప్ వరకు అన్నీ వండొచ్చు!

జాగ్రత్తలు తీసుకుంటే మంచిది:

కట్టెల పొయ్యి వాడుతున్నప్పుడు ఓపెన్ ప్లేస్‌లో లేదా మంచి గాలి వెళ్లే ప్రదేశంలో వాడటం మంచిది. పొగ బయటకు వెళ్లేలా చిమ్నీ ఉండటం ఇంకా బెటర్. ఎండిన కట్టెలు వాడితే పొగ కొంచెం తక్కువగా ఉంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×