E-Paper
Advertisement

Wireless vs Wired Charging: మీ మెుబైల్ బ్యాటరీకి ఏది బెస్ట్? ఛార్జింగ్ స్పీడ్, భద్రతకు.. ఏ పద్దతి సురక్షితం!

Wireless vs Wired Charging: మీ మెుబైల్ బ్యాటరీకి ఏది బెస్ట్? ఛార్జింగ్ స్పీడ్, భద్రతకు.. ఏ పద్దతి సురక్షితం!
Advertisement

Wireless vs Wired Charging: సాధారణంగా మెుబైల్స్ కు బ్యాటరీ అనేది ప్రాణాధారం వంటిది. ఛార్జింగ్ స్పీడ్ సరిగ్గా లేకుంటే ఎంత ఖరీదైన ఫోన్ అయినప్పటికీ నిరూపయోగంగా మారిపోతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బ్యాటరీనీ రెండు విధాలుగా ఛార్జ్ చేసే పద్దతులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి సంప్రదాయ పద్దతిలో ఛార్జింగ్ వైర్ ను ఉపయోగించి ఛార్జ్ చేయడమైతే.. మరొకటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వైర్ లెస్ గా బ్యాటరీని నింపడం. అయితే ఈ రెండు పద్దతుల్లో ఏది బ్యాటరీకి సురక్షితం అన్న సందేహం చాలా మందిలో సహజంగానే ఉంటుంది. కాబట్టి వైర్ vs వైర్ లెస్ ఛార్జింగ్ మధ్య వ్యత్యాసాలు, ఫాస్ట్ ఛార్జింగ్ కు ఏది బెస్ట్? వంటి అంశాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఏది వేగవంతమైనది?

మెుబైల్ బ్యాటరీని ఫాస్ట్ గా ఛార్జ్ చేయడంలో వైర్డ్ ఛార్జింగ్ స్పష్టమైన విజేతగా నిలుస్తుంది. వైర్ల ద్వారా విద్యుత్ నేరుగా ఫోన్‌కు చేరుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో 20W నుంచి 200W వరకు వేగంతో ఛార్జింగ్ చేసే వైర్డ్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వైర్‌లెస్ ఛార్జింగ్‌లో విద్యుత్ గాలి ద్వారా (Induction) ప్రసారం కావడం వల్ల కొంత శక్తి వృథా అయ్యే ఛాన్స్ ఉంది. ఫలితంగా వైర్డ్ ఛార్జింగ్ తో పోలిస్తే వైర్ లెస్ ఛార్జింగ్ కాస్త నెమ్మదిగా బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది.

ఏది సురక్షితమైనది?

Advertisement

ఫోన్ లేదా బ్యాటరీ సెఫ్టీ విషయంలో వైర్, వైర్ లెస్ రెండూ ఒకే రకమైన భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటాయి. కానీ రెండింటి మధ్య కొన్ని చిన్న చిన్న తేడాలు మాత్రం ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్ సమయంలో ఫోన్, ఛార్జింగ్ ప్యాడ్ మధ్య ఎక్కువ వేడి పుడుతుంది. ఇది ఎలక్ట్రానిక్ పరికరాలకు మంచిది కాదు. నాణ్యత లేని వైర్లు, నాసికరం ఛార్జింగ్ పోర్ట్స్ వాడితే తప్ప.. వైర్డ్ ఛార్జింగ్ చాలా సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.

బ్యాటరీ మన్నికకు ఏది బెస్ట్?

ప్రస్తుతం మెజారిటీ ఫోన్లలో లిథియం – అయాన్ (Lithium-ion) బ్యాటరీలనే ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాటరీలకు వేడి అనేది ప్రధాన శత్రువుగా నిపుణులు చెబుతుంటారు. వైర్ లెస్ ఛార్జింగ్ ను వాడితే.. ఇది ఫోన్‌ను ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది. దీనివల్ల కాలక్రమేణా బ్యాటరీ సామర్థ్యం త్వరగా తగ్గిపోవచ్చు. అదే వైర్డ్ ఛార్జింగ్ అయితే ఫోన్ తక్కువ సమయంలోనే వేగంగా ఛార్జ్ అవ్వడంతో పాటు.. వైర్ లెస్ తో పోలిస్తే తక్కువ వేడినే ఇది జనరేట్ చేస్తుంది. కాబట్టి బ్యాటరీ మన్నికకు వైర్డ్ ఛార్జింగ్ అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.

Advertisement

Also Read: 4 గంటల విమాన ప్రయాణం.. ఆకాశంలో నరకం చూసిన మహిళ.. చేతులెత్తి మెుక్కుతూ వీడియో!

ఓవరాల్‌గా ఏది బెస్ట్?

ఫోన్ చాలా ఫాస్ట్ గా ఛార్జింగ్ అవ్వాలి, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ కాలం ఉండాలని భావిస్తే వైర్డ్ ఛార్జింగ్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. కేబుల్స్ ఇబ్బంది లేకుండా, కేవలం సౌకర్యం మాత్రమే కావాలని భావిస్తే వైర్ లెస్ ఛార్జింగ్ ఎంచుకోవచ్చు. అయితే, వైర్‌లెస్ ఛార్జింగ్ వాడేటప్పుడు ఫోన్ కేస్ (Cover) తీసివేయడం వల్ల వేడిని కొంతవరకు తగ్గించవచ్చు.

Also Read: India Korea: భారత్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు.. మోదీతో అత్యవసర భేటి.. 8 ఏళ్ల తర్వాత ఎందుకీ ఆకస్మిక పర్యటన!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×