E-Paper
Advertisement

Window AC vs Desert Cooler: ఏసీ వాడాలా? కూలర్ వాడాలా? సామాన్యులకు ఏది బెస్ట్?

Window AC vs Desert Cooler: ఏసీ వాడాలా? కూలర్ వాడాలా? సామాన్యులకు ఏది బెస్ట్?
Advertisement

Window AC vs Desert Cooler: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి. అయితే ఏసీని కొంటే పెద్ద మెుత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కూలర్ తక్కువ బడ్జెట్లో వచ్చినప్పటికీ మంచి కూలింగ్ ఇస్తుందా? లేదా? అన్న సందేహం చాలా మందికి ఉంది. ఈ నేపథ్యంలో విండో ఏసీ, డెసర్ట్ కూలర్ కు మధ్య ఉన్న ప్రధాన తేడాలు? సామాన్యుల ఇంటికి ఏది బెస్ట్? అన్నది ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

విద్యుత్ వినియోగం, నెలవారీ బిల్లు

విద్యుత్ ఖర్చు విషయంలో డెసర్ట్ కూలర్ అత్యంత పొదుపైనదిగా చెప్పొచ్చు. ఇది ఏసీ కంటే తక్కువగా.. సాధారణ సీలింగ్ ఫ్యాన్ కంటే కాస్త ఎక్కువగా విద్యుత్ ను వినియోగిస్తుంది. కాబట్టి నెలవారి విద్యుత్ బిల్లులో దీని కారణంగా పెద్దగా ప్రభావం ఉండదు. మరోవైపు విండో ఏసీ విషయానికి వస్తే అది కంప్రెసర్ సహాయంతో పనిచేస్తుంది. ఫలితంగా చాలా ఎక్కువ విద్యుత్తును అది ఖర్చు చేస్తుంది. ఏసీ వాడకం వల్ల రూ.వేలల్లో విద్యుత్ బిల్లు రావొచ్చు.

కూలింగ్ పరంగా చూస్తే..

Advertisement

కూలింగ్ విషయంలో ఏసీ, కూలర్ పనితీరు పూర్తి భిన్నంగా ఉంటాయి. డెసర్ట్ కూలర్లు.. నీటిని ఆవిరిచేస్తూ గాలిని చల్లబరుస్తుంది. దీనివల్ల గదిలో తేమ పెరుగుతుంది. మరోవైపు విండో ఏసీ గదిలోని వేడిని, తేమను తీసుకొని బయటకు పంపేస్తుంది. అదే సమయంలో బయటి నుంచి గాలిని తీసుకొని.. చల్లబరిచి గదిలోకి పంప్ చేస్తుంది. ఏసీల్లో గది ఉష్ణోగ్రతను మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకునేందుకు వీలుంటుంది. కానీ కూలర్లలో అలా సాధ్యం కాదు. కూలింగ్ విషయంలో ఏసీదే పైచేయి అని చెప్పవచ్చు.

రోజూవారీ వినియోగం..

రోజూవారి వినియోగం పరంగా చూస్తే.. కూలర్లు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. కూలర్‌లో నిరంతరం నీరు నింపడం, ప్రతి సంవత్సరం కూలింగ్ ప్యాడ్‌లను మార్చడం వంటి పనులు చేస్తుండాలి. అలాగే కూలర్ పనిచేస్తున్నప్పుడు వచ్చే శబ్దాన్ని కూడా భరిస్తూ ఉండాలి. అదే విండో ఏసీ విషయానికి వస్తే.. ఇలాంటి సమస్యలు ఉండవు. నీరు పోయాల్సిన అవసరమే రాదు. సైలెంట్ గా పనిచేస్తూ గదిని చాలా వేగంగా కూల్ చేస్తుంది.

వాతావరణ పరిస్థితులు

Advertisement

డెసర్ట్ కూలర్లు ఎండ తీవ్రంగా ఉండి.. గాలి పొడిగా (Dry Heat) ఉండే ప్రాంతాల్లో మాత్రమే అద్భుతంగా పనిచేస్తాయి. తీర ప్రాంతాలు, వర్షాకాలంలో వీటి ప్రభావం పెద్దగా ఉండదు. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూలర్ వల్ల ఉక్కపోత అమాంతం పెరుగుతుంది. అటు విండో ఏసీ ఏ రకమైన వాతావరణంలోనైనా సమర్థవంతంగా గదిని చల్లబరుస్తుంది.

బడ్జెట్ విషయంలో..

సాధారణంగా డెసర్ట్ ఎయిర్ కూలర్లు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉంటాయి. ఒక మంచి బ్రాండెడ్ డెసర్ట్ కూలర్ రూ.8,000 – 15,000 మధ్య వచ్చేస్తుంది. అదే విండో ఏసీ విషయానికి వస్తే.. దీనికోసం రూ.25,000 నుండి రూ.45,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ఏసీ కొనుగోలు ఖర్చు.. కూలర్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

Also Read: Magic Figure: సీఎం కుర్చీకి.. ‘మ్యాజిక్ ఫిగర్’కు లింక్ ఏంటి? ఎందుకు అంత పవర్‌ఫుల్!

ఏది కొంటే బెటర్?

తీర ప్రాంతాలు, ఉక్కపోత ఎక్కువగా ఉన్న ఏరియాల్లో జీవిస్తుంటే ఏసీ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. లేదంటే హైదరాబాద్ వంటి గాలి పొడిగా ఉండే ప్రాంతాల్లో జీవిస్తున్నట్లైతే కూలర్ బెస్ట్ ఛాయిస్ గా ఉంటుంది. వేసవిలో తక్కువ ఖర్చుతో నెట్టుకు రావాలని భావించేవారు కూలర్ ను కొంటే మంచిది. ఖర్చు అయినా పర్లేదు.. హాయిగా, కూల్ గా ఉండాలనుకుంటే మాత్రం విండో ఏసీపై మెుగ్గు చూపితే మంచిది.

Also Read: Vivo X300 Ultra vs Samsung S26 Ultra: మార్కెట్లో మోస్ట్ ట్రెండింగ్ ఫోన్స్.. దేని దమ్ము ఎంత? రెండిట్లో ఏది బెస్ట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×