E-Paper
Advertisement

Wi-Fi Sensing: సీసీ కెమెరాలు, వేరబుల్స్‌కు గుడ్‌బై.. Wi-Fi సెన్సింగ్‌తో ఎవరినైనా సైలెంట్‌‌గా ట్రాక్ చేసేయండి ఇలా!

Wi-Fi Sensing: సీసీ కెమెరాలు, వేరబుల్స్‌కు గుడ్‌బై.. Wi-Fi సెన్సింగ్‌తో ఎవరినైనా సైలెంట్‌‌గా ట్రాక్ చేసేయండి ఇలా!
Advertisement

Wi-Fi Sensing: సాధారణంగా మనకు బాగా కావాల్సిన గురించి తెలుసుకోవడానికో.. లేదా మరే ఇతర కారణాల కోసమే ఇంట్లో నాలుగు గోడల మధ్య వాళ్లేం చేస్తున్నారో తెలుసుకోవడానికి సీసీ కెమెరాలను అమర్చుతాం. అప్పుడు ఇంట్లో వాళ్లేం చేస్తున్నారో ఫోన్ ద్వారా మనకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఆ నాలుగు గోడల బయట కూడా ఏం చేస్తున్నారో తెలుసుకునే వెసులుబాటు గేమ్‌ చేంజర్‌గా మారిన Wi-Fi సెన్సింగ్‌ టెక్నాలజీ మన ముందుకు వచ్చేసింది. దీని వల్ల మీ వై-ఫై ఇంటర్నెట్‌కు మాత్రమే కాదు.. సెక్యూరిటీకి కూడా ఎలాంటి ఢోకా లేదంటున్నారు టెక్ నిపుణులు.

ట్రాకింగ్ మరింత సులభం:

ఇప్పటి వరకూ ఇంట్లోనే, ఆఫీసులోనే లేదా ఏదైనా స్టోర్లలోనే నాలుగు గోడల మధ్య ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే సీసీ కెమెరాలు ఉంటే చాలు అనుకున్నాం. కానీ ఇప్పుడు నాలుగు గోడలకు అవతల కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవడం సులభం. అవును మీరు విన్నది నిజమే.. Wi-Fiను ఉపయోగించి మీరు మనుషుల కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే వెసులుబాటు అందుబాటులో ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే టెస్టింగ్‌ పూర్తి చేసుకొని.. కమర్షియల్‌గా కూడా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

బాడీ మ్యాపింగ్‌తో పట్టేయొచ్చు:

Advertisement

కొద్ది రోజులుగా టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మరింత అప్‌గ్రేడ్ చేశారు. దీనికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డెన్స్‌పోస్‌ మోడల్‌ను యాడ్ చేశారు. తద్వారా ఇప్పుడు బాడీ మ్యాపింగ్‌ మరింత సులభంగా మారింది. ఇక నుంచి మనుషులు ఏ గోడ వెనకున్నా.. ఏం చేస్తున్నా.. ఈజీగా ట్రాక్ చేసేయవచ్చు.

Wi-Fi సెన్సింగ్ ఏం చేస్తుంది?

ఇంతకీ Wi-Fi సిగ్నల్స్‌ మనుషుల కదలికలను ఎలా గుర్తించగలవనే కదా మీ సందేహం. ఇంట్లో వై-ఫై ఉంటే.. దాని సిగ్నల్స్‌ రూమ్‌లో సర్క్యూలేట్‌ అవుతుంటాయి. ఆ సిగ్నల్స్‌ ఇంట్లో ఉన్న మనుషులు, ఆబ్జెక్ట్స్‌ను తగిలినప్పుడు.. పక్కకు తప్పుకుంటాయి. కాబట్టి.. మనం రూమ్‌లో అటు ఇటు నడుస్తున్నప్పుడు.. సులభంగా కనిపెట్టవచ్చు. దీనినే Wi-Fi సెన్సింగ్ అంటారు. ఈ మార్పులను రౌటర్ ఛానల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ద్వారా గుర్తిస్తుంది. CSI డేటాను AI, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు అనలైజ్‌ చేసి డేటాను మనకు చూపిస్తాయన్న మాట.

కెమెరాలు అక్కర్లేదిక:

Advertisement

ఇక కెమెరాలకు గోడలు అడ్డంగా మారతాయి. కానీ వై-ఫై సిగ్నల్స్‌కు ఆ ప్రాబ్లం లేదు. మీరు ట్రాక్ చేయాలనుకున్న వ్యక్తి వై-ఫై సిగ్నల్స్‌ సరౌండింగ్స్‌లో ఉంటే చాలు. ఈజీగా కనిపెట్టేస్తాయి. అయితే ఈ వై-ఫై సెన్సింగ్ వినడానికి బాగానే అనిపించినా.. ఇక్కడ ఓ చిన్న భయం కూడా ఉంది. అదేంటంటే.. మీ Wi-Fiని ఎవరైనా హ్యాక్‌ చేస్తే మాత్రం.. మీరేం చేస్తున్నారు అనేది ఇక ఓపెన్ సీక్రేట్ అని చెప్పవచ్చు.

 

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×