E-Paper
Advertisement

WiFi Tips: రూటర్ బాగున్నప్పటికీ.. ఇంటర్నెట్ రావట్లేదా? అయితే ఈ తప్పులు చేస్తున్నట్లే!

WiFi Tips: రూటర్ బాగున్నప్పటికీ.. ఇంటర్నెట్ రావట్లేదా? అయితే ఈ తప్పులు చేస్తున్నట్లే!
Advertisement

WiFi Tips: సాధారణంగా ఇంట్లోని ఇంటర్నెట్ కనెక్షన్ స్లో అయిన ప్రతీసారి రూటర్ ను చాలా మంది నిందిస్తుంటారు. రూటర్ సరిగా లేకపోవడం వల్లే ఇంటర్నెట్ సరిగా రావట్లేదన్న అభిప్రాయానికి వచ్చేస్తుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక్కోసారి రూటర్ బాగున్నప్పటికీ ఇంటర్నేట్ స్లో అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి కారణం మీరు చేస్తున్న పొరపాట్లు కూడా కావొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్

కొన్ని సందర్భాల్లో మనకు మనకు తెలియకుండానే ఫోన్ లేదా కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్‌లో అనేక యాప్స్ డేటాను వాడుతుంటాయి. ఆటోమేటిక్ అప్డేట్స్ ఎనేబుల్ చేయడం వల్ల ఒక్కోసారి ఇంటర్నెట్ స్లో అయ్యే ఛాన్స్ ఉంది.

ఎలక్ట్రానిక్ పరికరాలు..

Advertisement

రూటర్ పక్కన మైక్రోవేవ్ ఓవెన్లు, బ్లూటూత్ స్పీకర్లు, మానిటర్లు ఉంటే అవి వైఫై సిగ్నల్‌ను అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా నెట్ రాకపోవడం, స్లో అవ్వడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

అధిక వైజ్‌ల కనెక్టింగ్

సాధారణంగా ఇంట్లోని వైఫైకి కుటుంబ సభ్యుల అందరి ఫోన్లు, ల్యాప్ టాప్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అయితే తక్కువ స్పీడ్ లేదా పరిమిత డేటా ఉన్న ఇంటర్నెట్ కు ఇన్ని కనెక్షన్లు ఉండటం వల్ల నెట్ స్లో అవ్వడం, డేటా లిమిట్ త్వరగా అయిపోవడం వంటివి జరగొచ్చు.

రూటర్ దూరంగా ఉండటం..

Advertisement

కొందరు వైఫై రూటర్ ను ఇంట్లో ఒక మూల అమర్చి వదిలేస్తారు. అప్పుడు మీరు వేరే గదిలో ఉండి నెట్ వాడాలని భావిస్తే.. సిగ్నల్ చాలా డల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మందపాటి గోడలను దాటుకొని వై ఫై సిగ్నల్ రావడం కష్టసాధ్యమవుతుందని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Drum Air Cooler: వార్నీ భలే ఉందే.. డ్రమ్ముతో కూలర్ తయారీ.. ఇక మీ డబ్బంతా ఆదా!

పరిష్కార మార్గాలు

పెద్దగా ఖర్చు లేకుండా, టెక్నిషియన్ అవసరం పడకుండా కొన్ని ఈజీ టిప్స్ ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచుకోవచ్చు. ముందుగా రూటర్ ను నేల మీద ఇంటి మూలల్లో అస్సలు పెట్టకండి. వీలైనంత వరకు ఇంటి మధ్యలో ఉంటే ఉత్తమం. మీ దగ్గర డ్యూయల్ బ్యాండ్ రూటర్ ఉంటే.. 5GHz బ్యాండ్‌ని వాడటానికి ప్రయత్నించండి. ఇది 2.4GHz కంటే ఎక్కువ వేగాన్ని ఇస్తుంది. మీకు తెలియకుండానే వైఫైని ఎవరైనా వాడుతున్నారేమో చెక్ చేయండి. రూటర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాత డివైజ్‌లను డిస్‌కనెక్ట్ చేయడం లేదా పాస్ వార్డ్ మార్చడం వంటివి చేయండి.

Also Read: Tamil Nadu Elections 2026: తమిళనాడు ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలకు సెలబ్రిటీలు క్యూ.. ఓటు హక్కు వినియోగం

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×