E-Paper
Advertisement

AC Cooling Tips: సర్వీసింగ్ చేయించినా.. ఏసీ కూలింగ్ రావడం లేదా? వెంటనే ఇలా చేయండి!

AC Cooling Tips: సర్వీసింగ్ చేయించినా.. ఏసీ కూలింగ్ రావడం లేదా? వెంటనే ఇలా చేయండి!
Advertisement

AC Cooling Tips: వేసవిలో ఏసీని పెద్ద ఎత్తున ప్రజలు వినియోగిస్తుంటారు. కొందరైతే సమ్మర్ రావడానికి ముందే ఏసీని సర్వీసింగ్ చేయించి.. ఎలాంటి సమస్యలు రాకుండా సిద్దమవుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సర్వీస్ చేయించిన్పపటికీ ఏసీ నుంచి సరైన కూలింగ్ రాకపోవచ్చు. దీని వెనుక అనేక కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ కారణాలు ఏంటి? వాటిని ఏ విధంగా పరిష్కరించాలి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

గ్యాస్ లీకేజీ

సర్వీసింగ్ తర్వాత కూడా చల్లటి గాలి రాకపోవడానికి 90 శాతం కారణం.. గ్యాస్ తగ్గిపోవడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏసీ గొట్టాల్లో చిన్నపాటి లీకేజీ ఉన్నా గ్యాస్ తగ్గిపోయి.. కేవలం ఫ్యాన్ లాగా మాత్రమే గాలి ఇస్తుంది. ఇలాంటి సందర్భాల్లో టెక్నీషియన్‌తో గ్యాస్ ప్రెజర్ చెక్ చేయించి.. లీక్ ఎక్కడ ఉందో కనుగొని దానిని రిపేర్ చేయించండి. తర్వాత గ్యాస్ రీఫిల్ చేయిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.

కూలింగ్ కాయిల్స్ సమస్య

Advertisement

సర్వీసింగ్‌ సమయంలో కొందరు టెక్నిషియన్లు పైపైన క్లీన్ చేస్తుంటారు. దీని వల్ల ఇండోర్ యూనిట్‌లోని ఎవాపరేటర్ కాయిల్స్, అవుట్‌డోర్ యూనిట్‌లోని కండెన్సర్ కాయిల్స్ మధ్యలో దుమ్ము అలాగే ఉండిపోవచ్చు. ఫలితంగా గాలిలోని వేడిని తొలగించలేక ఏసీ నేరుగా ఆ గాలినే సరఫరా చేసే అవకాశముంది. ఈ సందర్భాల్లో డీప్ క్లీనింగ్ చేయించడం ద్వారా కాయిల్స్ సందుల్లోని మొండి మురికిని వదిలించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

థర్మోస్టాట్ సెట్టింగ్స్

కొందరు చేసే పొరపాటు వల్ల కూడా ఏసీ కూలింగ్ ఇవ్వకపోవచ్చు. ఏసీ రిమోట్ లో అనుకోకుండా ఫ్యాన్ మోడ్, డ్రై మోడ్ ను ఆన్ చేస్తే.. ఏసీ కూలింగ్ ఇవ్వదు. అలాగే ఏసీలోని థర్మోస్టాట్ సెన్సార్ సరిగ్గా పని చేయకపోయినా ఏసీ కంప్రెసర్ ఆన్ అవ్వదని నిపుణులు అంటున్నారు. ఈ సందర్భాల్లో రిమోట్‌లో ‘కూల్ మోడ్’ ఆన్ లో ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఉష్ణోగ్రతను 24 డిగ్రీలకి సెట్ చేసి చూడండి.

కంప్రెసర్ వైఫల్యం

Advertisement

సాధారణంగా ఏసీలకు కంప్రెసర్ గుండెకాయ వంటిది. కంప్రెసర్ స్టార్ట్ అవ్వకపోయినా.. పదే పదే ట్రిప్ అయినా కూలింగ్ రాదు. అంతేకాకుండా అవుట్‌డోర్ యూనిట్ నుండి శబ్దం రాకపోయినా, విపరీతమైన శబ్దం వస్తున్నా కూడా కంప్రెసర్ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. ప్రొఫెషనల్ మెకానిక్ ను పిలిపించి.. కంప్రెసర్ పనితీరును చెక్ చేయించి పరిష్కరించుకుంటే బెటర్.

Also Read: Kitchen Tips: వంటగది షెల్ఫ్స్‌లో.. అల్యూమినియం ఫాయిల్‌.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కిటికీలు తెరిచి ఉంచడం

కొన్ని సందర్భాల్లో ఏసీ బాగానే ఉన్నా.. గదిలోని కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం వల్ల కూలింగ్ బయటకు పోయే ప్రమాదం ఉంది. దీని వల్ల రూమ్ లో చల్లగా అనిపించదు. అలాగే గది పరిమాణం కంటే తక్కువ కెపాసిటీ ఉన్న ఏసీని వాడినా కూలింగ్ సరిపోకపోవచ్చు.

Also Read: ఏసీ, ఇండక్షన్ స్టవ్ ఒకేసారి వాడుతున్నారా? కొంపలు అంటుకుపోతాయ్.. ఈ విషయాలు తెలుసుకోండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×