E-Paper
Advertisement

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!
Advertisement

Wine Bottle Screw Caps: సాధారణంగా వైన్ బాటిల్ అనగానే చాలామంది మనసులో మెదిలేది ఆ చెక్క కార్క్ (Cork) మూత, దాన్ని తీసేటప్పుడు వచ్చే శబ్దం. కానీ ఈమధ్య చాలా వైన్ బాటిళ్లకు సాధారణ మద్యం సీసాల్లాగే తిప్పి తీసే స్క్రూ క్యాప్‌లు రావడం చూస్తున్నాం. అసలు కొన్ని రకాల వైన్లకు మాత్రమే ఇలా నార్మల్ మూతలు ఎందుకు పెడుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.

సౌకర్యంతో పాటు భద్రత:

సాధారణ మూతలు పెట్టడానికి మొదటి కారణం సౌకర్యం. కార్క్ మూత తీయాలంటే ప్రత్యేకమైన ఓపెనర్ కావాలి. సరిగ్గా తీయకపోతే అది విరిగి బాటిల్ లోపల పడిపోయే ప్రమాదం ఉంది. కానీ స్క్రూ క్యాప్‌లతో ఆ తిప్పలు ఉండవు. చేతితో చాలా సులభంగా తెరవవచ్చు. తాగిన తర్వాత మళ్లీ గట్టిగా మూసి భద్రపరుచుకోవచ్చు.

బూజు వాసన సమస్యకు పరిష్కారం:

Advertisement

కార్క్ మూతల వల్ల వైన్ లవర్స్‌కు ఎదురయ్యే పెద్ద సమస్య ‘కార్క్ టెయింట్’. అంటే.. కార్క్ చెక్కలో ఉండే కొన్ని రసాయనాల వల్ల వైన్ పాడుకావడం లేదా బూజు వాసన రావడం జరుగుతుంది. దీంతో దాదాపు 3 నుండి 5 శాతం వైన్ సీసాలు పాడవుతుంటాయి. నార్మల్ మూతలు వాడటం వల్ల ఈ ప్రమాదం ఉండదు.

Also Read: వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

వైన్ తాజాగా ఉండటానికి:

Advertisement

అన్ని వైన్లు ఏళ్ల తరబడి దాచి తాగాల్సిన అవసరం లేదు. మార్కెట్లోకి వచ్చే చాలా రకాల వైన్లు కొన్న కొన్ని నెలల్లోనే తాగేసేవి. ఇలాంటి వైన్లలోని పండ్ల సువాసన, తాజాదనం బయటకు పోకుండా, గాలి తగలకుండా సీల్ చేయడానికి ఈ నార్మల్ స్క్రూ క్యాప్‌లే చాలా బాగా పనిచేస్తాయి.

ఖర్చు తగ్గింపులో భాగమే:

సహజమైన కార్క్ మూతల తయారీకి ఎక్కువ ఖర్చవుతుంది. ఆ ఖర్చు బాటిల్ ధరపై పడుతుంది. సాధారణ మూతలను వాడటం వల్ల తయారీ ఖర్చు తగ్గి, వినియోగదారులకు తక్కువ ధరలోనే మంచి వైన్ అందుబాటులోకి వస్తుంది. అందుకే బడ్జెట్ వైన్ల తయారీదారులు ఈ మూతలనే ఎక్కువగా ఇష్టపడతారు.

మారుతున్న ఆలోచనా విధానం:

ఒకప్పుడు నార్మల్ మూత ఉంటే అది తక్కువ రకం వైన్ అనే భ్రమ ఉండేది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లోని ప్రముఖ కంపెనీలు కూడా తమ అత్యుత్తమ వైన్లకు నార్మల్ క్యాప్‌లనే వాడుతున్నాయి. వైన్ నాణ్యతను కాపాడటంలో నార్మల్ మూతలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయని వైన్ మేకర్లు నిరూపిస్తున్నారు.

Also Read: మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×