E-Paper
Advertisement

కరెంట్ బిల్స్ మోత మోగుతున్నాయా? మీ ఏసీని క్లీన్ చేయకపోతే జేబుకి చిల్లే బ్రో!

కరెంట్ బిల్స్ మోత మోగుతున్నాయా? మీ ఏసీని క్లీన్ చేయకపోతే జేబుకి చిల్లే బ్రో!
Advertisement

Importance of ac cleaning: ఎండాకాలం వస్తే చాలు.. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లో ఏసీలు నాన్-స్టాప్‌గా ఆన్ లోనే ఉంటాయి. అయితే.. చాలా మంది ఏసీ కొన్నాక దాన్ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం తప్ప.. దాని క్లీనింగ్ గురించి అస్సలు పట్టించుకోరు. “ఏసీ బాగానే పనిచేస్తోంది కదా.. ఇప్పుడే ఎందుకు క్లీన్ చేయడం?” అని లైట్ తీసుకుంటారు. కానీ.. మనం అనుకునేదాని కంటే రెగ్యులర్ ఏసీ క్లీనింగ్ చాలా ముఖ్యం. క్లీన్ చేయని ఏసీ కేవలం మీ రూమ్‌ని మాత్రమే కాదు.. మీ హెల్త్‌ని, మీ జేబుని కూడా ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏసీ క్లీనింగ్ ఎందుకు అంత ముఖ్యం?

Advertisement

మనం రోజూ ఇల్లు ఊడ్చినప్పుడు ఏసీ కూడా గదిలో ఉండే గాలిని నిరంతరం పీల్చుకుంటూ ఉంటుంది. ఆ ప్రాసెస్‌లో జరిగే కొన్ని షాకింగ్ విషయాలు ఇవే..

1. శ్వాసకోశ సమస్యలు.. అలర్జీల గోల:
మీ ఏసీ ఫిల్టర్లలో దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. మీరు ఏసీ ఆన్ చేసిన ప్రతిసారీ ఆ మురికి గాలి మళ్లీ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. దీని వల్ల ఉదయాన్నే లేవగానే విపరీతమైన తుమ్ములు, జలుబు, దగ్గు వస్తాయి.
ఇంట్లో ఆస్తమా ఉన్నవాళ్లకు లేదా చిన్న పిల్లలకు ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఏసీ లోపల తేమ ఉండటం వల్ల ఫంగస్ చేరి వింత వాసన రావడం స్టార్ట్ అవుతుంది.

Advertisement

2. కరెంట్ బిల్లుల మోత :
ఏసీ ఫిల్టర్లు, కాయిల్స్ బ్లాక్ అయిపోయినప్పుడు.. గాలి సరిగ్గా బయటకి రాలేదు. దాంతో గదిని కూల్ చేయడానికి ఏసీ లోపల ఉండే కంప్రెషర్ డబుల్ కష్టపడాల్సి వస్తుంది. అది ఎంత ఎక్కువ కష్టపడితే, అంత ఎక్కువ కరెంట్ వాడుకుంటుంది. ఫలితంగా నెల ఆఖర్లో మీ కరెంట్ బిల్ చూసి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేవలం ఏసీని క్లీన్‌గా ఉంచడం వల్ల 15% నుంచి 20% వరకు కరెంట్ ఆదా అవుతుంది.

3. కూలింగ్ తగ్గిపోవడం:
“ఏసీ 18 డిగ్రీల్లో పెట్టినా అస్సలు చల్లగా అవ్వడం లేదు బాస్!” అని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏసీ సర్వీసింగ్ చేయకపోవడమే. లోపల ఉండే ఎవాపరేటర్ కాయిల్స్ మీద దుమ్ము పేరుకుపోతే.. అవి గాలిని చల్లబరిచే శక్తిని కోల్పోతాయి. ఫ్యాన్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది.

4. ఏసీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది:
మురికిగా ఉన్న ఏసీని అలాగే వాడటం వల్ల లోపల పార్ట్స్ త్వరగా వేడెక్కిపోయి పాడవుతాయి. గ్యాస్ లీకేజ్ అవ్వడం, కంప్రెషర్ ట్రిప్ అవ్వడం లాంటి మేజర్ రిపేర్లు వస్తాయి. సీజన్ స్టార్ట్ అయ్యే ముందు క్లీన్ చేసుకుంటే వేల రూపాయల రిపేర్ ఖర్చులు తప్పుతాయి.

Also Read: ఎండలు మండిపోతున్నాయా? కరెంట్ బిల్లు భయం లేని 5 బెస్ట్ స్మార్ట్ ఏసీలు ఇవే..

ఇంట్లోనే ఏసీని ఈజీగా ఎలా క్లీన్ చేయాలి?
ప్రతిసారీ టెక్నీషియన్‌ను పిలవక్కర్లేదు. కనీసం నెలకు రెండు సార్లు మీరే సింపుల్‌గా ఈ స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.

పవర్ ఆఫ్ చేయండి: సేఫ్టీ ఫస్ట్. క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు ఏసీ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి.

ఫ్రంట్ ప్యానెల్ ఓపెన్ చేయండి: ఏసీ ఇండోర్ యూనిట్ ముందు ఉండే ప్యానెల్‌ను ఈజీగా పైకి లాగవచ్చు.

ఫిల్టర్లు తీయండి: లోపల ఉండే ప్లాస్టిక్ మెష్ ఫిల్టర్లను మెల్లగా బయటకు తీయండి.

వాష్ చేయండి: టాప్ వాటర్ కింద ఆ ఫిల్టర్లను పెట్టి, నార్మల్ బ్రష్‌తో దుమ్ము మొత్తం పోయేలా క్లీన్ చేయండి.

ఆరబెట్టి ఫిక్స్ చేయండి: ఫిల్టర్లను ఎండలో కాకుండా నీడలో పూర్తిగా ఆరబెట్టి, మళ్లీ యథాస్థానంలో ఫిక్స్ చేయండి.

నోట్: అయితే.. ఏసీ లోపల ఉండే కాయిల్స్, డ్రైనేజీ పైపులు, అవుట్‌డోర్ యూనిట్ క్లీన్ చేయడానికి మాత్రం సంవత్సరానికి కనీసం రెండు సార్లు ప్రొఫెషనల్ టెక్నీషియన్‌ను పిలవడం మంచిది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×