E-Paper
Advertisement

బేస్‌మెంట్‌లు, లిఫ్టుల్లో నెట్‌వర్క్ ఎందుకు పనిచేయదు? అసలు నిజం ఇదీ!

బేస్‌మెంట్‌లు, లిఫ్టుల్లో నెట్‌వర్క్ ఎందుకు పనిచేయదు? అసలు నిజం ఇదీ!
Advertisement

Mobile Signal: రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో వేగంగా పనిచేసే మొబైల్ నెట్ వర్క్, ఇంటర్నెట్.. బేస్‌మెంట్‌ లోకి వెళ్లే సరికి ఒక్కసారిగా ఆగిపోతుంది. అటు ఎలివేటర్ (లిఫ్ట్) ఎక్కినా ఇదే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

బేస్‌మెంట్‌లో ఎందుకు రాదంటే?

మొబైల్ డేటా లేదా వైఫై సిగ్నల్స్ అనేవి విద్యుదయస్కాంత తరంగాలు రూపంలో ప్రయాణిస్తాయి. ఇవి గాలిలో సులువుగా ప్రయాణించినప్పటికీ ఘనపదార్థాలను దాటుకుని వెళ్లడం వీటికి చాలా కష్టం. బేస్‌మెంట్‌లు సాధారణంగా భూమికి దిగువన కాంక్రీట్ గోడలు, ఇటుకలు, మట్టితో నిర్మించబడి ఉంటాయి. ఈ మందపాటి పొరలను దాటుకుని రేడియో తరంగాలు లోపలికి ప్రవేశించలేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఎలివేటర్ల సంగతేంటి?

Advertisement

ఇక ఎలివేటర్ల విషయానికి వస్తే అవి పూర్తిగా లోహంతో (స్టీల్ లేదా ఇనుము) తయారవుతాయి. సైన్స్ ప్రకారం.. లోహంతో మూసివేయబడిన ఒక పెట్టె లాంటి నిర్మాణాన్ని ‘ఫెరడే కేజ్’ (Faraday Cage) అంటారు. ఇది బయట నుంచి వచ్చే ఎలాంటి విద్యుదయస్కాంత సిగ్నళ్లను లోపలికి రానివ్వదు. లోపలి సిగ్నళ్లను బయటకు వెళ్లనివ్వదు. అందుకే లిఫ్ట్ డోర్ పడగానే మీ ఫోన్ సిగ్నల్ ఆటోమేటిగ్గా మాయమవుతూ ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

దూరం, దిశ కూడా కారణమే..

సాధారణంగా మొబైల్ టవర్లు ఎత్తైన భవనాల పైన, ఓపెన్ గ్రౌండ్స్‌లో ఉంటాయి. వాటి నుంచి వచ్చే సిగ్నల్స్ భూమికి కింద ఉండే బేస్‌మెంట్‌లలోకి ప్రయాణించేలా డిజైన్ చేయబడవని నిపుణులు చెబుతున్నారు. సిగ్నల్ ప్రయాణించే మార్గంలో ఎన్నో అడ్డంకులు ఉండటం వల్ల బేస్‌మెంట్‌కు చేరేసరికి దాని శక్తి పూర్తిగా క్షీణిస్తుందని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Also Read: వానొచ్చినా నో టెన్షన్.. నీటిలో తడిచినా అదరగొట్టే.. టాప్-5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు!

వైర్‌లెస్ సాంకేతికత

కాంక్రీట్ గోడలు, లిఫ్ట్ సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం చాలా షాపింగ్ మాల్స్, అపార్ట్‌మెంట్లలో బేస్‌మెంట్‌ల లోపల కూడా ప్రత్యేకంగా ‘ఇన్-బిల్డింగ్ సొల్యూషన్స్ (IBS)’ నెట్‌వర్క్ యాంటెన్నాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల మెుబైల్, నెట్ సిగ్నల్స్ మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.

Also Read: ATMలో కార్డ్ ఇరుక్కుపోయిందా? కంగారు వద్దు మామ.. వెంటనే ఇలా చేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×