E-Paper
Advertisement

బయట వర్షం.. ఇంట్లో ఏసీ లీకేజీ.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

బయట వర్షం.. ఇంట్లో ఏసీ లీకేజీ.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
Advertisement

AC Leakage: వర్షాకాలంలో చాలామంది ఇళ్లల్లో ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఏసీ నుంచి నీరు లీక్ అవ్వడం ఒకటి. బయట వర్షం పడుతుంటే ఇంట్లో ఏసీ ఆన్ చేయగానే గదిలోకి నీరు కారడం తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? అలాగే ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఈ కథనంలో చూద్దాం.

డ్రెయిన్ పైపులో బ్లాకేజ్

సాధారణంగా ఏసీలు.. వర్క్ అవుతున్నప్పుడు గదిలోని తేమను లాగేసి ఆ నీటిని డ్రెయిన్ పైపు ద్వారా బయటకు పంపుతుంది. అయితే వర్షకాలంలో గాలిలో తేమ (హ్యుమిడిటీ) ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో నీరు తయారవుతుంది. ఈ సమయంలో డ్రెయిన్ పైపులో దుమ్ము, ధూళి, నాచు పేరుకుపోయి ఉండటం వల్ల ఆ నీరు బయటకు వెళ్లలేదు. ఇండోర్ యూనిట్ నుంచే లోపలికి లీక్ అవ్వడం అవుతూ ఉంటుంది.

డ్రెయిన్ పైపు ఫిక్స్ చేయకపోవడం

Advertisement

ఏసీ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు డ్రెయిన్ పైపుకు సరైన వాలు ఉండాలి. పైపు ఎగుడుదిగుడుగా ఉన్నా, దాని చివర భాగం నీటి బకెట్‌లో మునిగిపోయి ఉన్నా.. నీరు వెనక్కి తన్నుకొస్తుంది. వర్షకాలంలో పైపు చివర భాగంలో బురద లేదా నీరు చేరి బ్లాక్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

ఇన్సులేషన్ దెబ్బతినడం

ఏసీకి సంబంధించిన కాపర్ పైపులపై ప్రత్యేకమైన ఇన్సులేషన్ ఫోమ్ ఉంటుంది. ఇది పైపులపై మంచు లేదా నీటి చుక్కలు చేరకుండా చూస్తుంది. ఒకవేళ ఈ ఇన్సులేషన్ పాతబడిపోయి దెబ్బతినడంతో పాటు.. వర్షకాలంలోని విపరీతమైన తేమ వల్ల పైపులపై నీటి చుక్కలు (Condensation) ఏర్పడతాయి. ఒక్కో బొట్టులా గదిలో కిందకు కారుతుంటాయి.

మురికిగా మారిన ఎయిర్ ఫిల్టర్లు

Advertisement

ఏసీ ఫిల్టర్లలో విపరీతంగా దుమ్ము చేరినప్పుడు గాలి ప్రసరణ ఫ్రీగా జరగదు. దీనివల్ల ఏసీ కాయిల్స్ పై మంచు గడ్డకట్టే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. వర్షకాలంలో రూమ్ టెంపరేచర్ మారినప్పుడు ఆ మంచు కరిగి ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీరు ఇండోర్ యూనిట్ నుంచి బయటకు లీక్ అవుతుందని తెలియజేస్తున్నారు.

Also Read: SIR భాష వివాదం.. హైకోర్టులో ఆసక్తికర వాదనలు.. ఈసీకి జడ్జి సూటి ప్రశ్న!

పరిష్కరించడం ఎలా?

ఏసీ లీకేజీ సమస్యను ముదిరిపోకముందే కొన్ని చిన్న చిన్న చిట్కాలతో ఫిక్స్ చేసుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఏసీ ఫిల్టర్లను శుభ్రంచేయాలని సూచిస్తున్నారు. అలాగే డ్రెయిన్ పైపులో ఏవైనా అడ్డంకులు ఉంటే వాక్యూమ్ క్లీనర్ ద్వారా లేదా గాలిని గట్టిగా ఊదడం ద్వారా (Flushing) లోపల ఉన్న చెత్తను తొలగించాలి. అదే విధంగా బయట ఉన్న డ్రెయిన్ పైపు సరిగ్గా కిందకే ఉందో లేదో చెక్ చేసి.. పైపు చివర భాగం గాలిలో ఫ్రీగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ పైపులపై ఉన్న బ్లాక్ కలర్ ఇన్సులేషన్ కవర్ పాడైపోతే మార్కెట్లో దొరికే కొత్త ఇన్సులేషన్ టేప్ ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చని తెలియజేస్తున్నారు.

Also Read: క్లీనింగ్ ఇక చాలా ఈజీ.. సోఫాలు, మంచాల కోసం.. బెస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×