E-Paper
Advertisement

హోటల్ రూమ్స్‌లో ‘గ్లాస్ బాత్‌రూమ్స్’ ఎందుకు ఉంటాయో తెలుసా? ప్రైవసీ కంటే ఆ రీజనే ముఖ్యమా?

హోటల్ రూమ్స్‌లో ‘గ్లాస్ బాత్‌రూమ్స్’ ఎందుకు ఉంటాయో తెలుసా? ప్రైవసీ కంటే ఆ రీజనే ముఖ్యమా?
Advertisement

Hotel Glass Bathrooms: సాధారణంగా చాలా హోటల్‌ రూమ్స్‌లో ఉండే బాత్‌రూమ్‌లకు గోడలకు బదులుగా పారదర్శకమైన గ్లాస్ (గాజు) ఉండటం మనలో చాలామంది గమనించే ఉంటాం. చూడటానికి ఇవి చాలా మోడ్రన్‌గా అనిపించినప్పటికీ.. ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) ముఖ్యం అనుకునేవారికి మాత్రం కాస్త ఇబ్బందిగా, వింతగా అనిపిస్తుంది. అయితే, హోటల్స్ ఇలా డిజైన్ చేయడం వెనుక కేవలం అందం మాత్రమే కాదు.. చాలా ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. అవేటంటే..

చిన్న గదిని పెద్దగా చూపించడం:

సిటీల్లో ఉండే హోటల్ రూమ్‌లు చాలావరకు పరిమితమైన స్థలంలో ఉంటాయి. అక్కడ సిమెంట్ గోడలు కడితే రూమ్ మరింత చిన్నగా, ఇరుకుగా అనిపిస్తుంది. అదే గ్లాస్ వాల్స్ పెట్టడం వల్ల రూమ్ అంతా ఒకేలా తెరిచినట్టు అనిపించి, కాస్త పెద్దదనే భ్రమను కల్పిస్తుంది. ఇరుకుదనం పోయి రూమ్ విశాలంగా కనిపించడం కోసమే ఈ ట్రిక్ ప్లే చేస్తారు.

సహజమైన వెలుతురు కోసం:

Advertisement

సాధారణంగా హోటల్ బాత్‌రూమ్‌లకు విడిగా కిటికీలు ఉండవు. దీంతో పగటిపూట కూడా లైట్లు వేయాల్సి వస్తుంది. అదే గ్లాస్ ప్యానెల్స్ ఉంటే.. మెయిన్ రూమ్ కిటికీల గుండా వచ్చే సహజమైన సూర్యకాంతి బాత్‌రూమ్‌లోకి కూడా వస్తుంది. ఇది రూమ్‌కు మంచి లుక్ ఇవ్వడమే కాకుండా, పగటిపూట కరెంట్ వాడకాన్ని తగ్గించి హోటల్స్ యాజమాన్యానికి విద్యుత్ ఆదా చేయడంలో సహాయపడుతుంది.

Also Read: 6000mAh బ్యాటరీ, క్రేజీ లుక్స్.. RCB ఫ్యాన్స్ కోసం భారత్‌లో స్పెషల్ ఎడిషన్ లాంచ్!

లగ్జరీ లుక్, ఈజీ మెయింటెనెన్స్:

Advertisement

గాజు గోడలు రూమ్‌కు ఒక రకమైన ప్రీమియం, స్పా లాంటి లగ్జరీ లుక్‌ను తీసుకొస్తాయి. ఆధునిక కాలంలో ఇదొక ట్రెండ్‌గా మారింది. దీనికి తోడు.. సాధారణ గోడలపై తేమ వల్ల పెయింట్ ఊడిపోవడం, బూజు పట్టడం వంటి సమస్యలు ఉంటాయి. కానీ గ్లాస్ వాల్స్‌ను క్లీన్ చేయడం చాలా సులువు. తక్కువ శ్రమతోనే బాత్‌రూమ్‌ను ఎప్పుడూ నీట్‌గా ఉంచడానికి ఇది వీలవుతుంది.

ప్రైవసీ కోసం ఆధునిక టెక్నాలజీ:

గ్లాస్ బాత్‌రూమ్ అనగానే అందరికీ వచ్చే మొదటి అనుమానం ప్రైవసీ. అయితే హోటల్స్ దీనికి కూడా ప్రత్యామ్నాయాలు ఇస్తున్నాయి. అన్నిచోట్లా పూర్తిగా కనిపించే గ్లాస్ వాడరు. కొన్నిచోట్ల ఫ్రాస్టెడ్ (మసక) గ్లాస్ వాడితే.. మరికొన్ని లగ్జరీ హోటల్స్‌లో ఒక బటన్ నొక్కగానే పారదర్శక గాజు కాస్తా వైట్‌గా మారిపోయే స్మార్ట్ గ్లాస్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇంకొన్ని చోట్ల లోపలి వైపు స్క్రీన్స్ లేదా కర్టెన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా రూమ్‌ను స్టైలిష్‌గా మార్చడానికే హోటల్స్ ఈ విధానాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాయి.

Also Read: ఐఫోన్ కాదు బాస్.. యాపిల్ నుంచి ఊహించని ‘విజువల్’ గ్యాడ్జెట్.. అసలు ఆట 2027 లోనే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×