Washing Machine: ఈ రోజుల్లో ఇళ్లలో స్థలం లేక చాలామంది ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను బాత్రూమ్‌లలోనే ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. అయితే.. బాత్రూమ్ వాతావరణం ఎప్పుడూ తడిగా, ఉక్కపోతగా ఉంటుంది. ఇలాంటి చోట మెటల్ బాడీ ఉన్న మెషీన్లు త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లకు ‘హార్డ్ ప్లాస్టిక్ ఔటర్ బాడీ’ని ఎక్కువగా వాడుతున్నారు. అసలు తడి వాతావరణంలో ప్లాస్టిక్ బాడీ ఎందుకు అంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందో.. దాని వెనక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ రోజుల్లో వాషింగ్ మెషీన్ లేని ఇల్లు ఊహించుకోవడం కష్టం. అయితే.. అపార్ట్‌మెంట్ కల్చర్ పెరిగాక చాలా మంది వాషింగ్ మెషీన్‌ను బాత్రూమ్‌లోనే సెట్ చేసుకుంటున్నారు. బాత్రూమ్ అనగానే ఎక్కువ నీటి వాడకం, గాలిలో తేమ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కండిషన్స్‌లో మెటల్ లేదా ఐరన్ బాడీ ఉన్న మెషీన్లు పెడితే అవి త్వరగా పాడవుతాయి. అందుకే హార్డ్ ప్లాస్టిక్ (ABS లేదా ఫైబర్ లాంటి హై-గ్రేడ్ ప్లాస్టిక్) బాడీ ఉన్న ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. దీని వెనక ఉన్న ముఖ్యమైన కారణాలు ఇవే..
1. 100% తుప్పు పట్టే ఛాన్సే లేదు:
ఐరన్ లేదా మెటల్ బాడీకి నీరు, గాలి తగిలితే కెమికల్ రియాక్షన్ జరిగి చాలా త్వరగా తుప్పు పడుతుంది. బాత్రూమ్‌లలో ఉండే విపరీతమైన తేమ వల్ల కేవలం ఏడాది లేదా రెండేళ్లలోనే మెటల్ బాడీ మెషీన్ల కింద భాగం మొత్తం చిట్లిపోతుంది. అదే హార్డ్ ప్లాస్టిక్ విషయానికి వస్తే.. దీనిపై నీరు ఎంత పడినా, ఎంత హ్యుమిడిటీ ఉన్నా తుప్పు పట్టే ప్రసక్తే ఉండదు. దీని వల్ల మెషీన్ కొత్తదనం కోల్పోకుండా చాలా కాలం మన్నుతుంది.
2. ఎలక్ట్రిక్ షాక్‌ల నుంచి ఫుల్ సేఫ్టీ :
బాత్రూమ్‌లో ఉన్నప్పుడు మన కాళ్లు తడిగా ఉంటాయి. పొరపాటున మెషీన్ వైరింగ్‌లో ఏదైనా చిన్న ఫాల్ట్ వచ్చి బాడీకి కరెంట్ పాస్ అయితే.. మెటల్ బాడీ వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ ప్లాస్టిక్ అనేది ‘బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ’. అంటే ప్లాస్టిక్ గుండా కరెంట్ ప్రవహించదు. కాబట్టి బాత్రూమ్ లాంటి తడి ప్రదేశాల్లో ప్లాస్టిక్ బాడీ ఉన్న మెషీన్లు వాడటం వల్ల మన ఫ్యామిలీకి 100% సేఫ్టీ ఉంటుంది.
Also Read: ఎండలు కాదు కదా..ఎంత ఉక్కపోతనైనా.. ఉఫ్ అని ఊదేసే 5 బెస్ట్ ఏసీలు ఇవే
3. మెయింటెనెన్స్ చాలా ఈజీ :
మెటల్ బాడీ ఉన్న మెషీన్లపై డిటర్జెంట్ మరకలు, గట్టి నీటి వల్ల వచ్చే తెల్లటి మరకలు పడితే అవి అంత ఈజీగా వదలవు. పైగా మెటల్ స్క్రాచ్ పడితే అక్కడ పెయింట్ ఊడిపోయి తుప్పు మొదలవుతుంది. కానీ హార్డ్ ప్లాస్టిక్ బాడీని క్లీన్ చేయడం చాలా ఈజీ. ఒక తడి గుడ్డతో తుడిస్తే చాలు.. మరకలన్నీ మాయమైపోతాయి. స్క్రాచెస్ పడినా పెద్దగా ఇబ్బంది ఉండదు.
4. బరువు తక్కువ.. కంఫర్ట్:
హార్డ్ ప్లాస్టిక్ బాడీలు మెటల్ బాడీల కంటే బరువు తక్కువగా ఉంటాయి. దీని వల్ల బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు లేదా మెషీన్ ప్లేస్ మార్చేటప్పుడు ఈజీగా జరుపుకోవచ్చు. తక్కువ బరువు ఉన్నప్పటికీ.. ఈ ప్లాస్టిక్ బాడీలు చాలా బలంగా ఉంటాయి. మెషీన్ లోపల ఉండే వైబ్రేషన్స్, మోటార్ స్పీడ్‌ను ఇవి ఈజీగా తట్టుకోగలవు.
మీరు మీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను బాత్రూమ్‌లో లేదా బాల్కనీ లాంటి తడి తగిలే చోట పెట్టాలనుకుంటే.. కళ్లు మూసుకుని హార్డ్ ప్లాస్టిక్ బాడీ ఉన్న మోడల్‌ను ఎంచుకోండి. ఇది మీ మెషీన్ లైఫ్‌ను పెంచడమే కాకుండా.. మీకు బెస్ట వాషింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.