E-Paper
Advertisement

ఫ్రిడ్జ్ అక్కర్లేదు.. కానీ నీళ్లు ఐస్‌లా చల్లబడతాయ్.. 3,000 ఏళ్ల నాటి అద్భుత టెక్నిక్!

ఫ్రిడ్జ్ అక్కర్లేదు.. కానీ నీళ్లు ఐస్‌లా చల్లబడతాయ్.. 3,000 ఏళ్ల నాటి అద్భుత టెక్నిక్!
Advertisement

Clay Pot Water: వేసవిలో దాహం ఏ స్థాయిలో వేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బయటి వేడికి శరీరంలోని నీటి శాతం వేగంగా ఆవిరై.. వెంటవెంటనే దాహం వేస్తుంటుంది. ఈ సందర్భాల్లో చాలా మంది తమ గొంతు తడిపేందుకు ఫ్రిడ్జ్ నీళ్లనే ఉపయోగిస్తుంటారు. కానీ, 3,000 ఏళ్ల సంవత్సరాలం క్రితం ఇలాంటి ఫ్రిడ్జ్ లు ఏవీ మన పూర్వీకులకు అందుబాటులో లేవు. అప్పుడు వారు చల్లటి నీటి కోసం మట్టి కుండనే ఉపయోగించేవారు. ఈ నీళ్లు దాహం తీర్చడంతో పాటు ఆరోగ్యానికి సైతం మేలు చేసేవని మన తాతముత్తాతలు చెబుతూ ఉండేవారు. అది ఎలాగో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

మట్టి కుండ నీరు చల్లదనం..

మట్టి కుండల్లో నీరు చల్లబడటం వెనుక ఒక శాస్త్రీయ సూత్రం ఉంది. కుండ ఉపరితలంపై కంటికి కనిపించని వేలాది సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వీటి గుండా నీరు నిరంతరం కుండ వెలుపలికి చేరుతూ ఉంటుంది. బయట ఉండే వేడి గాలి తగలగానే ఈ నీరు ఆవిరిగా (బాష్పీభవనం) మారుతుంది. ఈ ప్రక్రియలో కుండ లోపల ఉండే వేడిని అది లాగేసుకోవడం వల్ల.. లోపలి నీరు సహజ ప్రక్రియలో చల్లబడుతుంది.

జీర్ణక్రియకు అమృతం

Advertisement

ఫ్రిడ్జ్ లోని అతి చల్లని నీరు తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి జీర్ణక్రియ మందగిస్తుందని నిపుణులు చెబుతుంటారు. కానీ మట్టి కుండ నీరు శరీర ఉష్ణోగ్రతకు తగినట్లుగా ఉంటుంది. ఇది జీవక్రియను (Metabolism) వేగవంతం చేస్తుంది. ఇందులో ఉండే సహజ ఖనిజాలు.. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించి గుండెను, గొంతును ఆరోగ్యంగా ఉంచుతాయి.

వడదెబ్బ నుంచి రక్షణ

వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. దీంతో బయట తిరుగుతున్నప్పుడు ఒక్కసారిగా వడదెబ్బకు గురవుతుంటారు. ముఖ్యంగా వృద్దులు, చిన్నారులు.. వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ప్రతీ వేసవిలోనూ చూస్తూనే ఉంటాం. అయితే మట్టికుండలో నీరు తాగడం ద్వారా దీనికి చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మట్టిలోని ఖనిజాలు శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయని పేర్కొంటున్నారు. ఇప్పటితో పూర్వం రోజుల్లో వడదెబ్బలు ఈ స్థాయిలో లేకపోవడానికి ఇది కూడా ఒక కారణమని నిపుణులు అంటున్నారు.

Advertisement

Also Read: బీఆర్ఎస్ అధికారంలోకి.. వచ్చేది లేదు సచ్చేది లేదు.. టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

pH స్థాయిల సమతుల్యం

మట్టికి సహజంగానే క్షార గుణం (Alkaline nature) ఉంటుంది. శరీరం ఎసిడిక్ స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు.. మట్టి కుండలోని నీరు శరీరంలోని pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ప్లాస్టిక్ బాటిళ్లలోని కెమికల్స్ భయం లేకుండా స్వచ్ఛమైన మట్టి సువాసనతో కూడిన ఈ నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెుత్తంగా చూస్తే.. పర్యావరణానికి హాని చేసే కరెంట్ బిల్లులు పెంచే ఫ్రిడ్జ్ ల కంటే.. వేల ఏళ్ల నాటి మన సాంప్రదాయ మట్టి కుండ వైపు మొగ్గు చూపడం అటు ప్రకృతికి ఇటు మన శరీరానికి ఎంతో శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: సెంట్రింగ్ కార్మికుల ధర్నాకు కవిత సపోర్ట్.. ప్రభుత్వానికి అల్టిమేటం.. చర్చలకు రాకుంటే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×