E-Paper
Advertisement

Charger Cable: ఛార్జర్ కేబుల్‌కు ఉన్న ఆ రౌండ్ పార్ట్ ఏంటో తెలుసా? 99% మందికి తెలియని అసలు సీక్రెట్ ఇదే!

Charger Cable: ఛార్జర్ కేబుల్‌కు ఉన్న ఆ రౌండ్ పార్ట్ ఏంటో తెలుసా? 99% మందికి తెలియని అసలు సీక్రెట్ ఇదే!
Advertisement

Charger Cable: సాధారణంగా మన ల్యాప్‌టాప్ ఛార్జర్లు లేదా పాతకాలపు ఫోన్ కేబుళ్లను ఒకసారి గమనిస్తే.. చివర్లో చిన్న రౌండ్ పార్ట్ లాంటి భాగం కనిపిస్తుంది. చాలామంది దీనిని ఏదో డిజైన్ అనుకుంటారు. మరికొందరు అది ఫ్యూజ్ అని పొరబడతారు. కానీ నిజానికి ఎలక్ట్రానిక్ పరికరాలు క్షేమంగా ఉండటంలో ఈ చిన్న సిలిండర్ లాంటి పార్ట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీనినే ఫెర్రైట్ బీడ్  లేదా ఫెర్రైట్ చోక్ అని పిలుస్తారు.

ఫెర్రైట్ బీడ్ అంటే ఏమిటి?

వైర్ ద్వారా కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు సహజంగానే కొన్ని అధిక పౌనఃపున్యం కలిగిన తరంగాలు లేదా విద్యుత్ నాయిస్ ఉత్పన్నమవుతాయి. ఈ అనవసరమైన తరంగాలు పరికరానికి వెళ్లే సిగ్నల్స్‌ను అడ్డుకోవడమే కాకుండా, లోపల ఉండే సున్నితమైన సర్క్యూట్లను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఫెర్రైట్ బీడ్ ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తూ.. ఈ అనవసరమైన ఎలక్ట్రికల్ నాయిస్‌ను అడ్డుకుంటుంది. ఇది కరెంట్‌ను ఆపదు కానీ, అందులోని అంతరాయలను తొలగించి స్వచ్ఛమైన శక్తిని మాత్రమే పరికరానికి అందేలా చూస్తుంది. అందుకే దీనిని నాయిస్ ఫిల్టర్ అని కూడా పిలుస్తారు.

Advertisement

Also Read: మతిపోగొట్టే డిస్కౌంట్స్.. రూ.8,990కే స్మార్ట్ టీవీ, ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై భారీ ధర తగ్గింపు!

పరికరాల రక్షణలో దీని పాత్రేంటి?

ఛార్జింగ్ కేబుల్ ద్వారా డేటా లేదా కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫరెన్స్ ఏర్పడుతుంది. ఈ చిన్న రౌండ్ సిలిండర్ లేకపోతే ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఒక్కోసారి హ్యాంగ్ అవ్వడం, సిగ్నల్ తక్కువగా రావడం లేదా ఛార్జింగ్ ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి పరికరాల్లో డేటా బదిలీ సజావుగా సాగడానికి, వాటి పనితీరు స్థిరంగా ఉండటానికి ఈ ఫెర్రైట్ బీడ్ ఎంతో అవసరం. ఇది బయటి నుంచి వచ్చే విద్యుత్ అంతరాయాలను కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది.

సాంకేతికతలో కీలక మార్పులు:

Advertisement

నేటి ఆధునిక ఫోన్ ఛార్జర్లు, ల్యాప్‌టాప్ కేబుళ్లపై ఈ రౌండ్ పార్ట్ మనకు ఎక్కువగా కనిపించడం లేదు. దానికి కారణం సాంకేతికతలో వచ్చిన మార్పులే. ఇప్పటి తరం ఛార్జర్లు, కేబుల్ కనెక్టర్లను తయారు చేసేటప్పుడే, వాటి లోపల ఇన్ బిల్ట్ ఫిల్టర్లను అమర్చుతున్నారు. అంటే.. అప్పుడు బయట ఉన్న రక్షణ కవచం ఇప్పుడు లోపలికి చేరిందన్నమాట. అయితే గీజర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు వంటి భారీ కరెంట్ పరికరాల్లో వీటిని ఇప్పటికీ వాడుతున్నారు.

Also Read: ఇక థియేటర్‌కు వెళ్లనక్కర్లేదు.. తక్కువ ధరలో షియోమీ 75 ఇంచుల క్యూలెడ్ టీవీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×