E-Paper
Advertisement

మీ ఏసీ నుంచి ఇలాంటి శబ్దం వస్తోందా? అయితే అది పేలడానికి సిద్ధంగా ఉన్నట్టే!

మీ ఏసీ నుంచి ఇలాంటి శబ్దం వస్తోందా? అయితే అది పేలడానికి సిద్ధంగా ఉన్నట్టే!
Advertisement

AC Explosion: సెగలు కక్కుతున్న ఈ వేడి ఉష్ణోగ్రతలో చల్ల చల్లని గాలి వీచే ఎయిర్ కండీషనర్‌లు కొన్నిసార్లు మనుషుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇంట్లో ఏసీ వాడేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ప్రాణాలు పోయే ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇటీవల అనకాపల్లిలో జరిగిన ఏసీ పేలుడు ఘటన అందరినీ కలవరపెడుతోంది.

హాయిగా నిద్రపోతున్న మనిషిని ఆ ఏసీ నిద్రలోనే బలి తీసుకుంది. అర్ధరాత్రి ఒక్కసారిగా ఏసీ పేలడంతో బెడ్‌కు మంటలు అంటుకుని, ఆ మనిషి నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశాడు. అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి? మనం చేసే పొరపాట్లు ఏమిటి? అలాంటి ప్రమాదాలను ఎలా నివారించాలి? అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆపకుండా వాడేస్తున్నారా?

Advertisement

ఏసీకి మెయిన్ పార్ట్ కంప్రెషర్. బయట ఎండలు 45 డిగ్రీలు దాటిందంటూ.. మనం ఏసీని గంటల తరబడి, అస్సలు ఆపకుండా వాడేస్తుంటాం. దీనివల్ల కంప్రెషర్ విపరీతంగా వేడెక్కిపోతుంది. మెషిన్ మీద లోడ్ ఎక్కువైతే లోపల ప్రెజర్ పెరిగి ఒక్కసారిగా పేలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే.. ఏసీకి అప్పుడప్పుడు కాస్త విరామం ఇవ్వడం చాలా ముఖ్యం.

Also Read: వాల్‌కి స్టిక్ చేస్తే చాలు.. కిచెన్‌లో హాయిగా వంట చేసుకోవచ్చు, ఈ ‘ఏసీ ఫ్యాన్’ ధర ఎంతంటే?

గ్యాస్ లీకేజీని గుర్తిస్తున్నారా?

Advertisement

ఏసీలో వాడే గ్యాస్ (R-32 లేదా R-410A) చాలా పవర్‌ఫుల్. పైపులు పాతవైపోయినా లేదా ఫిట్టింగ్ సరిగ్గా లేకపోయినా గ్యాస్ లీక్ అవుతుంది. ఇలా లీకైన గ్యాస్ గదిలో ఉన్నప్పుడు, ఏ చిన్న ఎలక్ట్రిక్ స్పార్క్ (షార్ట్ సర్క్యూట్ వంటిది) వచ్చినా గది మొత్తం మంటలు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.

వోల్టేజ్ తేడాలను చెక్ చేస్తున్నారా?

సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. వోల్టేజీలో తేడాలు రావడం వలన ఏసీలు బాంబులా పేలుతున్నాయి. అలాగే నాణ్యత లేని వైర్లు వాడితే అవి త్వరగా వేడెక్కి షార్ట్ సర్క్యూట్ అవుతాయి. అందుకే.. మొండితనానికి పోకుండా మంచి క్వాలిటీ ఉన్న స్టెబిలైజర్‌ను వాడటం చాలా ముఖ్యం.

అవుట్‌డోర్ యూనిట్ ఎక్కడ పెట్టారు?

చాలామంది అవుట్‌డోర్ యూనిట్‌ను గాలి ఆడని ఇరుకైన సందుల్లో లేదంటే విపరీతమైన ఎండ తగిలే చోట పెడతారు. ఈ మెషిన్‌లోని వేడి బయటకు వెళ్లకపోతే అది త్వరగా హీట్ ఎక్కి ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి.. యూనిట్ చుట్టూ గాలి ఆడేలా చూసుకోవడం మర్చిపోవద్దు.

అసలు సర్వీసింగ్ చేయిస్తున్నారా?

ఎయిర్ కండీషనర్ ఫిల్టర్లలో దూళి పేరుకుపోతే గాలి రాదు. అప్పుడు కూలింగ్ ఇవ్వడానికి మెషిన్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇలా యంత్రం మీద భారం పెరిగితే అది కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏడాదికి కనీసం రెండు సార్లయినా టెక్నీషియన్‌ను పిలిపించి చెక్ చేయించుకోవడం చాలా అవసరం.

Also Read: రూ.800కే ఇండక్షన్ స్టవ్ అని ఎగబడి కొన్నారు.. కట్ చేస్తే, ఢాం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×