// // Whirlpool 9kg ACE XL Washing Machine: రూ.15 వేలకే..బెస్ట్ వాషింగ్ మెషీన్! -->
E-Paper
Advertisement

రూ.15 వేలకే 9kg భారీ వాషింగ్ మెషీన్!ఉప్పు నీటితోనూ మొండి మరకలు మాయం

రూ.15 వేలకే 9kg భారీ వాషింగ్ మెషీన్!ఉప్పు నీటితోనూ మొండి మరకలు మాయం
Advertisement

Whirlpool 9kg ACE XL Washing Machine: పెద్ద ఫ్యామిలీ అంటే ఎక్కువ బట్టలు మామూలే! ముఖ్యంగా వర్షాకాలంలోనో.. చలికాలంలోనో ఆ బట్టలు ఉతకడం, ఆరబెట్టడం అంటే ఆడవారికి ఒక పెద్ద యుద్ధమే. అయితే.. మీ ఈ కష్టాలను తీర్చేందుకు వర్ల్‌పూల్ అదిరిపోయే మెషీన్‌ను తెచ్చింది. అదే Whirlpool 9 kg ACE XL. తక్కువ ధరలో ఎక్కువ బట్టలను ఉతికే. ఈ మెషీన్ ప్రత్యేకతలు తెలిస్తే.. మీరు ఫిదా అవ్వాల్సిందే.

బెస్ట్ ఫీచర్లు- పూర్తి వివరాలు: 

9 కేజీల కెపాసిటీ.. ఒక్కసారి వేస్తే చాలు:
చాలా మంది చిన్న మెషీన్లు కొని, బట్టలను రెండు మూడు సార్లుగా విడదీసి ఉతుకుతుంటారు. దీని వల్ల టైమ్, కరెంటు రెండూ వేస్ట్. కానీ ఈ ACE XL మోడల్ ఏకంగా 9 కేజీల కెపాసిటీతో వస్తుంది. అంటే మీ ఇంటి బెడ్ షీట్లు, కర్టెన్లు, బరువైన జీన్స్ బట్టలు అన్నీ ఒక్కసారే వాష్ చేసేయొచ్చు.పెద్ద కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.

Advertisement

ఈ మెషీన్ ఎందుకు అంత స్పెషల్?
1.3D స్క్రబ్ టెక్నాలజీ: బట్టల మీద మొండి మురికి ఉన్నా? ఇందులోని 3D స్క్రబ్ పద్ధతి బట్టలను లోపల మూడు వైపులా కదిలిస్తూ ఉతుకుతుంది. దీనివల్ల షర్టు కాలర్లు, కఫ్స్ దగ్గర ఉండే మురికిని చేత్తో రుద్దే పని లేకుండానే క్లీన్ చేస్తుంది.

2.ఉప్పు నీటిలోనూ క్లీనింగ్: చాలా ఇళ్లలో బోరు నీరు లేదా ఉప్పు నీరు ఉంటుంది. సాధారణ మెషీన్లు ఈ నీటిలో సరిగ్గా పని చేయవు. కానీ వర్ల్‌పూల్ ‘హార్డ్ వాటర్ వాష్’ టెక్నాలజీతో ఈ సమస్యకు చెక్ పెట్టింది.

Advertisement

3.కరెంటు బిల్లు టెన్షన్ లేదు: ఇది 5-స్టార్ రేటింగ్ కలిగిన మెషీన్. అంటే తక్కువ కరెంటుతో ఎక్కువ పని చేస్తుంది. కరెంట్ బిల్లు ఎక్కువగా రాకుండానే మీ బట్టలు మెరిసిపోతాయి.

స్మార్ట్ డిజైన్.. అదిరిపోయే పెర్ఫార్మెన్స్:

ఈ మెషీన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీనికి కింద పెద్ద చక్రాల ఇచ్చారు. కాబట్టి ఇంట్లో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు.

1.ఆటో రీస్టార్ట్: ఉతికేటప్పుడు కరెంటు పోయిందా? నో ప్రాబ్లం. మళ్ళీ పవర్ రాగానే మెషీన్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే వాషింగ్ మొదలుపెడుతుంది.

2.సూపర్ స్పీడ్ డ్రైయర్: ఇందులోని 1400 RPM మోటార్ బట్టలను చాలా వేగంగా ఆరబెడుతుంది. వర్షాకాలంలో కూడా బట్టలు త్వరగా డ్రై అవుతాయి.

Also Read: బడ్జెట్ ధరలోనే బ్రాండెడ్ టీవీ.. 43 ఇంచుల శాంసంగ్ 4K అల్ట్రా HD టీవీపై సూపర్ డిస్కౌంట్

ధర, బెస్ట్ డీల్ ఎక్కడ?
ప్రస్తుతం ఈ Whirlpool 9kg ACE XL ధర మార్కెట్లో సుమారు రూ. 14,500 నుంచి రూ.16,000 మధ్యలో ఉంది.

అమెజాన్/ఫ్లిప్‌కార్ట్: సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లు వాడితేరూ.13,500 కే వచ్చే ఛాన్స్ ఉంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్: మీ పాత వాషింగ్ మెషీన్ ఇస్తే.. ఇంకా భారీ డిస్కౌంట్ పొందొచ్చు.

మీరు తక్కువ ఖర్చులో.. ఎక్కువ రోజులు నడిచే బ్రాండెడ్ వాషింగ్ మెషీన్ కోసం చూస్తుంటే.. కళ్ళు మూసుకుని ఈ వర్ల్‌పూల్ మోడల్‌ను ఇంటికి తెచ్చేసుకోండి. ఇది కేవలం బట్టలు ఉతికే మెషీన్ మాత్రమే కాదు.. మీ ఇంట్లో ఒక నమ్మకమైన పని మనిషిలా తోడుంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×