// // Whirlpool ACE XL 9kg review: కరెంట్, నీళ్లు ఆదా..పర్ఫార్మెన్స్ అద్భుతం -->
E-Paper
Advertisement

కరెంట్, నీళ్లు ఆదా..పర్ఫార్మెన్స్ అద్భుతం

కరెంట్, నీళ్లు ఆదా..పర్ఫార్మెన్స్ అద్భుతం
Advertisement

Whirlpool ACE XL 9kg review: ఇంట్లో జనం ఎక్కువ ఉన్నప్పుడు రోజూ బట్టలు ఉతకడం ఒక పెద్ద టాస్క్. ముఖ్యంగా బెడ్ షీట్లు, దుప్పట్లు, జీన్స్ లాంటి హెవీ బట్టలు నానబెట్టి, ఉతకడానికి సాధారణ వాషింగ్ మెషీన్లు అస్సలు సరిపోవు. ఇలాంటి పెద్ద ఫ్యామిలీస్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బ్రాండ్ వర్ల్‌పూల్ తీసుకొచ్చిన జంబో మోడలే “వర్ల్‌పూల్ 9 కేజీ సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ (ACE XL)”. భారీ కెపాసిటీ, బడ్జెట్ ధరలో లభించే ఈ మోడల్ ప్రతీ ఇంటికి ఎలా హెల్ప్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పెద్ద కుటుంబాలకు పర్ఫెక్ట్ ఛాయిస్:

హోమ్ అప్లయన్సెస్ ట్రెండ్స్ ప్రకారం, కస్టమర్లు బడ్జెట్ ధరలో ఎక్కువ బట్టలు ఉతికే లార్జ్ కెపాసిటీ మెషీన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా సెమీ ఆటోమేటిక్ విభాగంలో.. వర్ల్‌పూల్ ACE XL ట్రెండ్ అవుతోంది. దీనికి గల ముఖ్య కారణాలు, ఇందులోని స్పెషల్ ఫీచర్లు..

9 కేజీ జంబో కెపాసిటీ డిజైన్:

Advertisement

ఈ వాషింగ్ మెషీన్ ప్లస్ పాయింట్ దీని 9 కేజీల భారీ కెపాసిటీ. ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న పెద్ద కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఒకేసారి వారానికి సరిపడా బట్టలను, భారీ బ్లాంకెట్లను కూడా ఇందులో చాలా ఈజీగా ఉతకొచ్చు. దీని బాడీ హై-క్వాలిటీ ప్లాస్టిక్ తో డిజైన్ చేయబడింది. దీనివల్ల తుప్పు పట్టే అవకాశమే లేదు. కింద అమర్చిన పవర్‌ఫుల్ చక్రాల సహాయంతో దీన్ని ఇంట్లో ఎక్కడికైనా ఈజీగా జరపవచ్చు.

మొండి మరకలను వదిలించే సూపర్ సోక్ టెక్నాలజీ:

ఈ మెషీన్ లో ఇచ్చే “సూపర్ సోక్” ఫీచర్ బట్టలపై ఉండే మొండి మురికిని చిటికెలో వదిలిస్తుంది. బట్టలు ఉతకడానికి ముందు సుమారు 25 నిమిషాల పాటు డిటర్జెంట్ నీటిలో బట్టలను ఇది కంటిన్యూస్ గా నానబెడుతుంది. దీని వల్ల కాలర్లపై ఉండే మురికి, జిడ్డు ఈజీగా వదిలిపోతాయి.

పవర్‌ఫుల్ పల్సేటర్ అండ్ టర్బో డ్రైయర్:

Advertisement

ఇందులో వచ్చే పవర్‌ఫుల్ ఇంపెల్లర్ మోషన్ బట్టలను అన్ని వైపులా తిప్పుతూ చేత్తో ఉతికిన తరహా క్లీనింగ్ ఇస్తుంది. ఇక వర్షాకాలం లేదా చలి కాలంలో బట్టలు త్వరగా ఆరడానికి దీనిలోని “టర్బో డ్రై” ఫీచర్ అద్భుతంగా పని చేస్తుంది. దీని హై-స్పీడ్ డ్రైయర్ టబ్ గాలిని వేగంగా లోపలికి లాగి, కేవలం 10 నిమిషాల స్పిన్ లోనే బట్టల్లోని తేమను పూర్తిగా పిండేస్తుంది.

Also Read: ఇంటి కోసం బెస్ట్..ఇన్వర్టర్ కొనాలనుకుంటున్నారా ?

తక్కువ కరెంట్.. తక్కువ నీరు:

ఫుల్లీ ఆటోమేటిక్ మెషీన్లతో పోలిస్తే సెమీ ఆటోమేటిక్ మెషీన్లలో నీటి ఖర్చు మన చేతుల్లోనే ఉంటుంది. వర్ల్‌పూల్ ACE XL 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ తో వస్తుంది. కాబట్టి ఇది కరెంట్ బిల్లును చాలా ఆదా చేస్తుంది. బోర్ వాటర్ లేదా హార్డ్ వాటర్ లో కూడా డిటర్జెంట్ బాగా కరిగేలా చేసే స్పెషల్ మెకానిజం ఇందులో ఉంది.

తక్కువ బడ్జెట్ లో, ఎక్కువ కాలం పాడవకుండా ఉండే.. పవర్‌ఫుల్ వాషింగ్ మెషీన్ కావాలనుకునే పెద్ద ఫ్యామిలీస్ కి వర్ల్‌పూల్ 9 కేజీ ACE XL ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్. మార్కెట్ లో , అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్న ఈ మోడల్ ని కొని మీ పనులను మరింత స్మార్ట్ గా మార్చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×