E-Paper
Advertisement

WhatsApp: వాట్సప్ అదిరిపోయే అప్డేట్.. ఈ గోల్డెన్ ఛాన్స్ ఐఫోన్ యూజర్లకు మాత్రమే!

WhatsApp: వాట్సప్ అదిరిపోయే అప్డేట్.. ఈ గోల్డెన్ ఛాన్స్ ఐఫోన్ యూజర్లకు మాత్రమే!
Advertisement

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. తాజాగా ఐఫోన్ యూజర్ల కోసం ‘షెడ్యూల్ మెసేజ్’ అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో ఉంది. ప్రస్తుతం గూగుల్ మెసేజెస్‌లో ఉన్నట్లే.. మనం పంపాలనుకున్న మెసేజ్‌ను ముందుగానే టైప్ చేసి, మనకు కావాల్సిన తేదీ, సమయాన్ని సెట్ చేసుకునే వీలుంటుంది. ఆ సమయానికి మీరు ముందే టైప్ చేసి పెట్టిన మెసేజ్ ఆటోమేటిక్‌గా అవతలి వ్యక్తికి వెళ్లిపోతుంది.

ఇదెలా పనిచేస్తుంది?

వాట్సప్ త్వరలో అందుబాటులోకి తీసుకురాన్ను ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడం కూడా చాలా సులభం. మీరు ఎవరికైనా మెసేజ్ పంపేటప్పుడు టైం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు సెట్ చేసిన టైం కంటే ముందే ఆ మెసేజ్‌లను చూసుకోవడానికి, అవసరమైతే మార్పులు చేయడానికి లేదా డిలీట్ చేయడానికి ఓ ప్రత్యేక విభాగం కూడా ఉంటుంది.

Advertisement

Also Read: అమ్మో.. ఇంత తక్కువకా? శాంసంగ్ S25 అల్ట్రాపై రూ.20 వేల తగ్గింపు మావా!

ఎడిట్ చేయాలనుకుంటే?

ముఖ్యంగా ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లిరోజు విషెస్ చెప్పాలన్నా, ఆఫీస్ రిమైండర్లు పంపాలన్నా ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం సెట్ చేసిన మెసేజ్‌ను పంపకముందే డిలీట్ చేస్తే అవతలి వ్యక్తికి ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లదు. ఈ సదుపాయం వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూపుల్లో కూడా అందుబాటులో ఉండనుంది.

మరో క్రేజీ ఫీచర్..

Advertisement

ఇదే కాకుండా.. వాట్సాప్ ఇటీవల ‘గ్రూప్ మెసేజ్ హిస్టరీ’ అనే మరో ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. సాధారణంగా ఏదైనా గ్రూప్‌లో కొత్తగా చేరినవారికి పాత మెసేజ్‌లు కనిపించవు. కానీ, ఈ కొత్త ఫీచర్ ద్వారా గ్రూప్ అడ్మిన్లు కొత్తగా వచ్చిన వారికి గత 25 నుంచి 100 మెసేజ్‌ల వరకు కనిపించేలా చేయవచ్చు. దీంతో గ్రూప్‌లో ఏం జరుగుతుందో కొత్తగా జాయిన్ అయిన సభ్యులకు సులభంగా అర్థమవుతుంది. ఈ మెసేజ్‌లు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పూర్తి భద్రతను కలిగి ఉంటాయి.

Also Read: రూ.7,999కే రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ మావా.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×