// // స్టేటస్ పెట్టిన 15 నిమిషాల లోపు సీక్రెట్‌గా ఎడిట్ చేయొచ్చు, ఎలాగంటే? -->
E-Paper
Advertisement

WhatsApp యూజర్లకు బిగ్ రిలీఫ్.. స్టేటస్ క్యాప్షన్‌లో తప్పు పడిందా? ఇక డిలీట్ చేయక్కర్లేదు!

WhatsApp యూజర్లకు బిగ్ రిలీఫ్.. స్టేటస్ క్యాప్షన్‌లో తప్పు పడిందా? ఇక డిలీట్ చేయక్కర్లేదు!
Advertisement

WhatsApp Edit Caption: సోషల్ మీడియా వాడుతున్నప్పుడు ఏవో ఒక తప్పులు దొర్లడం సహజం. ముఖ్యంగా వాట్సప్‌లో ఏదైనా మంచి ఫొటో లేదా వీడియోను స్టేటస్‌గా పెట్టినప్పుడు.. కింద రాసే క్యాప్షన్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్ పడుతుంటాయి. అలాంటప్పుడు ఆ స్టేటస్‌ను డిలీట్ చేసి, మళ్లీ కొత్తగా పోస్ట్ చేయడం కాస్త విసుగ్గా అనిపిస్తుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సప్ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది.

15 నిమిషాలు మాత్రమే..

ఈ కొత్త అప్‌డేట్ ద్వారా మనం పోస్ట్ చేసిన స్టేటస్ క్యాప్షన్‌ను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక చిన్న కండిషన్ ఉంది. స్టేటస్ పెట్టిన 15 నిమిషాల లోపు మాత్రమే క్యాప్షన్‌ను మార్చే అవకాశం ఉంటుంది. మన మెసేజ్‌లను ఎడిట్ చేయడానికి ఉన్న సమయాన్నే దీనికి కూడా కేటాయించారు. ఈ సమయం దాటితే మాత్రం పాత క్యాప్షనే ఉండిపోతుంది.

రెండు సులభమైన మార్గాలు..

Advertisement

క్యాప్షన్ మార్చడానికి వాట్సప్ రెండు మార్గాలను అందిస్తోంది. మనం పెట్టిన స్టేటస్‌ల లిస్ట్ ఓపెన్ చేసి, డైరెక్ట్‌గా Edit Caption ఆప్షన్ ఎంచుకోవచ్చు. లేదా ఆ స్టేటస్ ఓపెన్ చేసినప్పుడు క్యాప్షన్ పక్కన కనిపించే పెన్సిల్ ఐకాన్ పై టాప్ చేసి కూడా వెంటనే మార్పులు చేసుకోవచ్చు. దీనివల్ల ఫొటో లేదా వీడియోను డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండానే మేటర్ మార్చేయవచ్చు.

Also Read: రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా..

Advertisement

సాధారణంగా ఛాటింగ్‌లో ఏదైనా మెసేజ్ ఎడిట్ చేస్తే Edited అని కనిపిస్తుంది. కానీ, స్టేటస్ క్యాప్షన్ విషయంలో మాత్రం అలాంటి లేబుల్ ఏమీ కనిపించదు. అంటే.. మనం క్యాప్షన్ మార్చినట్టు మన కాంటాక్ట్స్‌లో ఉన్న ఇతర వినియోగదారులకు అసలు తెలియదు. అయితే ఫైనల్ వెర్షన్‌లో కూడా ఇదే నియమం ఉంటుందో లేదో చూడాలి.

ప్రస్తుతానికి వీరికి మాత్రమే..

ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాలేదు. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ (2.26.30.1) ఉపయోగిస్తున్న కొద్దిమంది వినియోగదారులకు మాత్రమే టెస్టింగ్ కోసం ఇచ్చారు. ఇందులో ఎలాంటి లోపాలు లేవని తేలితే.. త్వరలోనే సాధారణ ఆండ్రాయిడ్ యూజర్లందరికీ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Also Read: జేబులో రూపాయి లేకపోయినా షాపింగ్ చేయొచ్చు.. Flipkart Pay Later ఆప్షన్ అదిరింది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×