E-Paper
Advertisement

WhatsApp Plus వచ్చేసింది.. కొత్త ఫీచర్లు, ప్రయోజనాలు ఇవే!

WhatsApp Plus వచ్చేసింది.. కొత్త ఫీచర్లు, ప్రయోజనాలు ఇవే!
Advertisement

WhatsApp Plus: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీలను పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లతో పాటు వాట్సప్‌లో కూడా ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారి కోసం WhatsApp Plus పేరుతో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. సాధారణ వాట్సప్ కంటే దీనిలో మరిన్ని ఆకర్షణీయమైన మార్పులు, అదనపు సదుపాయాలు ఉన్నాయి.

ధరల వివరాలు ఇలా:

ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ సేవలను నెలకు కేవలం రూ.49కే అందిస్తుండగా.. ఫేస్‌బుక్ ప్లస్ ధర అమెరికాలో సుమారు రూ.330గా ఉంది. అయితే WhatsApp Plus ధరను అమెరికాలో దాదాపు రూ.250గా నిర్ణయించారు. కాకపోతే, భారతీయ వినియోగదారుల కోసం ఈ వాట్సప్ ప్లస్, ఫేస్‌బుక్ ప్యాకేజీల అధికారిక ధరలను మెటా ఇంకా ప్రకటించాల్సి ఉంది. రోజువారీ వాట్సప్ వాడకంలో ఈ కొత్త ఫీచర్లు మనకు ఎంతవరకు ఉపయోగపడతాయో తెలుసుకోవడం ముఖ్యం.

సరికొత్త లుక్, థీమ్స్:

Advertisement

వాట్సప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల యాప్ రూపురేఖలను పూర్తిగా మార్చుకోవచ్చు. సాధారణంగా లభించే థీమ్స్ కంటే చాలా ఎక్కువ ఆప్షన్లు దీనిలో ఉంటాయి. చాట్ బబుల్ రంగులను, బ్యాక్‌గ్రౌండ్ వాల్‌పేపర్‌లను మార్చుకోవడంతో పాటు, మన ఫోన్ హోమ్ స్క్రీన్‌పై కనిపించే వాట్సప్ ఐకాన్‌ను కూడా మనకు నచ్చిన డిజైన్‌లోకి మార్చుకునే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. అలాగే మరింత ఆకర్షణీయమైన ప్రీమియం స్టిక్కర్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.

Also Read: YouTube Shortsలో బిగ్ చేంజెస్.. లైక్ బటన్ స్థానంలో హార్ట్ సింబల్, ఆ ఫీచర్ కంప్లీట్‌గా అవుట్!

సౌకర్యవంతమైన చాట్, అలర్ట్స్:

Advertisement

ఈ ప్రీమియం ప్యాకేజీలో చాటింగ్‌ను మరింత సులభతరం చేసే ఫీచర్లు ఉన్నాయి. సాధారణ వాట్సప్‌లో కేవలం మూడు చాట్‌లను మాత్రమే పిన్ చేసుకునే వీలుండగా.. వాట్సప్ ప్లస్‌లో అంతకంటే ఎక్కువ చాట్‌లను స్క్రీన్ పైభాగంలో ఉంచుకోవచ్చు. దీంతో పాటు మన ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ గ్రూపుల కోసం ప్రత్యేకమైన లిస్టులను తయారు చేసుకుని, వాటికి వేర్వేరు రింగ్‌టోన్లు, అలర్ట్ టోన్లు సెట్ చేసుకోవచ్చు. తద్వారా ఫోన్ చేతిలోకి తీసుకోకుండానే ఏ పర్సన్ నుంచి మెసేజ్ వచ్చిందో రింగ్‌టోన్ ద్వారా సులువుగా గుర్తుపట్టవచ్చు.

సబ్‌స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి?

ఇది వాట్సప్ లోనే అధికారికంగా లభించే ఫీచర్. దీని కోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. Subscriptions ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ WhatsApp Plus పై క్లిక్ చేసి, యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ ద్వారా పేమెంట్ పూర్తి చేస్తే ఈ ప్రీమియం సేవలు యాక్టివేట్ అవుతాయి. భవిష్యత్తులో ఇందులో మెసేజ్ షెడ్యూలింగ్, ఆటో రిప్లై, స్పామ్ ఫోల్డర్ వంటి మరిన్ని ఉపయోగకరమైన ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది.

Also Read: లీకైన యాపిల్ సీక్రెట్ ప్లాన్.. తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్‌లను మించిన ఫీచర్లతో iRing‌ను దించనుంది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×