E-Paper
Advertisement

ఐఫోన్ వాడుతున్నారా? వాట్సప్‌లో వచ్చిన ఈ కొత్త మార్పు చూశారా.. ఇక పండగే!

ఐఫోన్ వాడుతున్నారా? వాట్సప్‌లో వచ్చిన ఈ కొత్త మార్పు చూశారా.. ఇక పండగే!
Advertisement

WhatsApp iOS Multi Account: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్.. ఐఫోన్ యూజర్ల కోసం ఒక అదిరిపోయే ఫీచర్‌ను విస్తృతంగా అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకు ఒకే ఐఫోన్‌లో రెండు వేర్వేరు వాట్సప్ అకౌంట్లు వాడటం అంత సులువుగా కుదిరేది కాదు. కానీ ఇకపై ఒకే యాప్‌లో రెండు అకౌంట్లను చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లకు గతంలోనే వచ్చిన ఈ మల్టీ అకౌంట్ సపోర్ట్, ఇప్పుడు ఎక్కువ మంది ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వస్తోంది.

బిజినెస్ యాప్ అక్కర్లేదు:

గతంలో ఐఫోన్‌లో రెండు నెంబర్లపై వాట్సప్ వాడాలంటే.. ఒకటి నార్మల్ యాప్, మరొకటి వాట్సప్ బిజినెస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. లేదా రెండో ఫోన్ మెయింటైన్ చేయాల్సి వచ్చేది. కానీ తాజా అప్‌డేట్‌తో ఆ తిప్పలు తప్పనున్నాయి. ఆఫీస్ పనులకు ఒక అకౌంట్, పర్సనల్ చాటింగ్ కోసం మరో అకౌంట్ ఒకే అప్లికేషన్‌లో వాడుకోవచ్చు.

Advertisement

Also Read: షాకింగ్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్‌వాచ్‌లు.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!

సెటప్ చేయడం చాలా ఈజీ:

ఈ ఫీచర్ వాడటం చాలా సులువు. వాట్సప్ సెట్టింగ్స్‌లోని You ట్యాబ్ లేదా అకౌంట్ మేనేజ్‌మెంట్ సెక్షన్‌లోకి వెళ్లి రెండో నెంబర్‌ను యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గరున్న రెండో ఫోన్ నెంబర్‌తో లాగిన్ అవ్వడమే కాకుండా.. QR కోడ్ స్కాన్ చేసి లింక్డ్ డివైజ్‌గా కూడా దీనిని కాన్ఫిగర్ చేసుకోవచ్చు.

చాట్స్ అన్నీ సేఫ్‌:

Advertisement

ఒకసారి సెటప్ పూర్తయ్యాక.. మళ్లీ మళ్లీ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా ప్రొఫైల్స్ మార్చుకోవచ్చు. కింద ఉండే You ట్యాబ్‌ను కాసేపు లాంగ్ ప్రెస్ చేస్తే (నొక్కి పట్టి ఉంచితే) అకౌంట్స్ మారిపోతాయి. రెండు అకౌంట్లకు సంబంధించిన చాట్స్, నోటిఫికేషన్లు, సెట్టింగ్స్ దేనికదే విడివిడిగా ఉంటాయి కాబట్టి.. డేటా మిక్స్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ 26.22.76 వెర్షన్‌లో క్రమంగా అందరికీ రోల్ అవుట్ అవుతోంది.

Also Read: ప్రాంతీయ భాషల్లో మాట్లాడే AI ఫీచర్లతో Infinix Smart 20.. ఈ ధరలో ఇలాంటి ఫోన్ దొరకడం కష్టమే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×