E-Paper
Advertisement

మీ WhatsApp హ్యాక్ అయిందా? ఢిల్లీ పోలీస్ చెప్పిన ఈ సీక్రెట్ కోడ్‌తో క్షణాల్లో రికవరీ చేయొచ్చు!

మీ WhatsApp హ్యాక్ అయిందా? ఢిల్లీ పోలీస్ చెప్పిన ఈ సీక్రెట్ కోడ్‌తో క్షణాల్లో రికవరీ చేయొచ్చు!
Advertisement

WhatsApp Safety Tips: ఈ రోజుల్లో వాట్సప్ లేనిదే ఏ పనీ జరగడం లేదు. చాటింగ్‌తో పాటు ముఖ్యమైన ఫైల్స్, బ్యాంకింగ్ వివరాలు కూడా దీని ద్వారానే పంచుకుంటున్నాం. అలాంటిది ఒక్కసారిగా మన వాట్సప్ అకౌంట్ లాగౌట్ అయిపోయినా లేదా హ్యాక్ అయినా గుండె ఆగినంత పనవుతుంది. అయితే, ఇలాంటి కంగారు పెట్టే పరిస్థితి నుంచి సులువుగా బయటపడటానికి ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం ఒక అద్భుతమైన ట్రిక్ చెప్పింది. కేవలం ఒక చిన్న కోడ్‌తో మీ అకౌంట్‌ను హ్యాకర్ల చేతుల్లో నుంచి కాపాడుకోవచ్చు. అదెలాగంటే..

ఆ సీక్రెట్ కోడ్ ఏంటి?

మీ వాట్సప్ హ్యాక్ అయ్యిందని అనుమానం వస్తే వెంటనే మీ మొబైల్ డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి ##21# కి కాల్ చేయండి. ఈ కోడ్ డయల్ చేయగానే మీ నెంబర్‌కు యాక్టివేట్ అయి ఉన్న అన్ని రకాల కాల్, మెసేజ్ ఫార్వార్డింగ్ సేవలు వెంటనే రద్దవుతాయి. సాధారణంగా హ్యాకర్లు మనకు వచ్చే వాట్సప్ వెరిఫికేషన్ కోడ్‌లను (OTP) దొంగిలించడానికి మనకు తెలియకుండానే కాల్ ఫార్వార్డింగ్ ఆప్షన్ ఆన్ చేస్తుంటారు. ఈ కోడ్ ద్వారా దానికి చెక్ పెట్టవచ్చు.

దీని వల్ల ఉపయోగం ఏంటి?

Advertisement

కాల్ ఫార్వార్డింగ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆ తర్వాత వచ్చే వెరిఫికేషన్ మెసేజ్‌లు లేదా కాల్స్ అన్నీ నేరుగా మీ ఫోన్‌కే వస్తాయి. దీనివల్ల హ్యాకర్ మీ అకౌంట్‌ను వాడుకోలేడు. మీ ఓటీపీలు మీకే రావడం వల్ల మీరు చాలా సులభంగా మీ వాట్సప్ అకౌంట్‌ను మళ్లీ లాగిన్ చేసి మీ ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు.

మెటాకు ఫిర్యాదు చేయడమెలా?

ఒకవేళ కోడ్ డయల్ చేసినా మీ సమస్య తీరకపోతే.. వెంటనే వాట్సప్ మాతృసంస్థ అయిన మెటా అధికారిక గ్రీవెన్స్ వెబ్‌సైట్‌ను ఆశ్రయించాలి. అక్కడ అడిగిన వివరాల్లో మీరు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ కాదని సెలెక్ట్ చేసి, మీ కంట్రీ కోడ్‌తో కూడిన వాట్సప్ నెంబర్ ఇవ్వాలి. కేటగిరీల్లో ‘అకౌంట్ హ్యాక్డ్’ అని ఎంచుకుని మీ సమస్యను వివరించాలి. మీ పూర్తి పేరు, ఈ-మెయిల్ ఐడీ కరెక్ట్‌గా ఇచ్చి సబ్మిట్ చేస్తే మెటా టీమ్ మీ అకౌంట్ రికవరీకి సహాయం చేస్తుంది.

అకౌంట్‌ను సేఫ్‌గా ఉంచే మార్గాలివే:

Advertisement

భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ వాట్సప్‌లో ‘టూ-స్టెప్ వెరిఫికేషన్’ కచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి. మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు. అలాగే వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘లింక్డ్ డివైసెస్’ ఆప్షన్‌ను తరచూ చెక్ చేసుకుంటూ ఉండండి. గుర్తుతెలియని లింక్‌లపై క్లిక్ చేయకపోవడం, యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం వల్ల మీ వాట్సప్ అకౌంట్‌ను భద్రంగా ఉంచుకోవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×