E-Paper
Advertisement

ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు వాట్సప్ బంపర్ ఆఫర్.. ఇక యాప్‌లోనే వరల్డ్ కప్ లైవ్ అప్‌డేట్స్!

ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు వాట్సప్ బంపర్ ఆఫర్.. ఇక యాప్‌లోనే వరల్డ్ కప్ లైవ్ అప్‌డేట్స్!
Advertisement

WhatsApp Football Hub 2026: ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈసారి మ్యాచ్ అప్‌డేట్స్ కోసం వేర్వేరు యాప్‌లు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా వాట్సప్ ఒక సూపర్ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. Football Central 2026 పేరుతో ఒక ప్రత్యేకమైన హబ్‌ను వాట్సప్ సిద్ధం చేస్తోంది. దీని ద్వారా లైవ్ స్కోర్లు, తాజా వార్తలు, జట్ల వివరాలను నేరుగా యాప్‌లోనే చూసుకోవచ్చు.

అప్‌డేట్స్ ట్యాబ్‌లోనే కొత్త హబ్:

ఈ సరికొత్త ఫీచర్ వాట్సప్‌లోని అప్‌డేట్స్ ట్యాబ్‌లో కనిపించనుంది. అక్కడ వచ్చే ఒక ప్రత్యేక బ్యానర్‌ను క్లిక్ చేయడం ద్వారా యూజర్లు నేరుగా ఫుట్‌బాల్ సెంట్రల్ విభాగంలోకి వెళ్లొచ్చు. అక్కడ మనకు నచ్చిన దేశాల జట్లను ఫాలో అవ్వడమే కాకుండా.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు రియల్ టైమ్ అలర్ట్స్ కూడా పొందొచ్చు. దీనివల్ల ఆఫీస్ పనిలో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా మ్యాచ్ వివరాలను అస్సలు మిస్ అవ్వకుండా ఉండొచ్చు.

గ్రూపులు, ఛానెల్స్ రికమండేషన్స్:

Advertisement

కేవలం స్కోర్లు మాత్రమే కాకుండా.. ఫుట్‌బాల్‌కు సంబంధించిన చర్చల్లో పాల్గొనేందుకు కూడా వాట్సప్ వీలు కల్పిస్తోంది. యూజర్ల ఆసక్తులకు అనుగుణంగా ఫుట్‌బాల్ ఛానెల్స్, కమ్యూనిటీలను ఈ హబ్ సజెస్ట్ చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్, విశ్లేషణలు అందించే క్రియేటర్లను, పబ్లిషర్లను అభిమానులు సులభంగా కనుగొనవచ్చు. దీనికోసం వాట్సప్ తమ ఛానెల్స్ డిస్కవరీ ఫీచర్‌ను మరింత మెరుగుపరుస్తోంది.

Also Read: ఐదు క్రేజీ కలర్స్‌, గేమింగ్ లుక్‌తో వచ్చేస్తోన్న Ai Plus 5G ఫోన్లు.. లాంచ్‌కు ముందే లుక్ లీక్!

మారుతున్న మెసేజింగ్ యాప్స్:

Advertisement

ఒకప్పుడు కేవలం మెసేజ్‌లు పంపుకోవడానికే పరిమితమైన వాట్సప్, ఇప్పుడు లైవ్ కంటెంట్ హబ్‌గా మారుతోంది. స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వార్తలను రియల్ టైమ్‌లో అందించడం ద్వారా యూజర్లను మరింతగా ఆకట్టుకోవాలని చూస్తోంది. ఈ కొత్త ప్రయత్నం మెసేజింగ్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పుకు సంకేతంగా నిలుస్తోంది.

త్వరలోనే అందుబాటులోకి:

జూన్, జూలై నెలల్లో అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరిగే వరల్డ్ కప్ సమయానికి ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు విడతల వారీగా ఈ అప్‌డేట్‌ను రోల్ అవుట్ చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులందరికీ అందుబాటులోకి రానుంది. దీనితో వరల్డ్ కప్ చూసే అనుభూతి మరింత సరదాగా మారబోతోంది.

Also Read: అలెక్సా సపోర్ట్‌తో సరికొత్త అమెజాన్ స్మార్ట్ స్పీకర్లు.. ఇక రూమ్‌లోకి రాగానే అన్నీ ఆటోమేటిక్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×