E-Paper
Advertisement

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?
Advertisement

WhatsApp: ప్రస్తుతం వాట్సప్ అనేది ఓ అత్యవసరంగా మారిపోయింది. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లోనూ కచ్చితంగా ఈ యాప్ ఉంటుంది. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. కొన్ని కోట్లమంది వాట్సాప్‌ను వాడుతున్నారు. అయితే, వినియోగదారులకు మంచి అనుభూతిని ఇచ్చేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేసుకుంటూ వస్తోంది. అయితే, యూజర్ల సెక్యూరిటీ కొరకు కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు కొనసాగలేవు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను స్వీకరించలేని స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సప్ ఇక మీదట పనిచేయదు.

ఈ తనిఖీలు అత్యవసరం:

ఆర్థిక స్తోమత బాగాలేకో, ఇంకొన్ని కారణాల వల్లనో కొంతమంది సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొంటుంటారు. అలా ఉపయోగించిన సెకండ్ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుని కొనడం ఉత్తమం. లేదంటే.. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఉపయోగించిన ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఆ ఫోన్ వాట్సాప్‌కు మద్దతు ఇస్తుందో లేదో ముందే తనిఖీ చేయడం అవసరం.

Advertisement

వాట్సప్.. Android 5.0, అంతకంటే ఎక్కువ, iOS 15.1, అంతకంటే ఎక్కువ వెర్షన్‌లలో మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేయబోతున్నట్లయితే, అది Android 5 కంటే తక్కువ వెర్షన్‌తో లేదా iOS 15.1 కంటే తక్కువ వెర్షన్‌తో ఉన్న iPhoneతో అనుకూలంగా ఉందో లేదో చూసుకోవాలి. దీని కోసం ఫోన్ సెట్టింగ్‌లను తనిఖీ చేయాలి. ఇవన్నీ తనిఖీ చేయకుండానే సెకండ్ హ్యాండ్ ఫోన్‌ను కొనుగోలు చేయడం వల్ల తరువాత ఇబ్బంది పడవచ్చు.

OSను చెక్ చేయడమెలా?

మీరు కొనుగోలు చేసిన ఫోన్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తోందో తెలుసుకోవడం సులభమే. మీ ఫోన్ సెట్టింగ్స్‌లలో About ఆప్షన్‌కు వెళ్లాలి. తర్వాత ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీకు పూర్తి వివరాలు అక్కడ కనిపిస్తాయి. అలాగే iPhoneలోని ఆపరేటింగ్ సిస్టమ్‌ను తెలుసుకోవడానికి జనరల్‌కు వెళ్లి, ఆపై About విభాగానికి వెళ్లాలి. ఇక్కడే మీ ఫోన్ ఏ OSలో నడుస్తుందో తెలుసుకోవచ్చు.

ఆ ఫోన్లలో ఎందుకు పనిచేయదు?

Advertisement

వాట్సప్ సేవలు పాత OSలలో ఎందుకు పనిచేయయడం లేదంటూ.. చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. వాట్సప్ తమ ఫీచర్లను మెరుగుపరచడం, యాప్ భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది. సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను స్వీకరించలేని స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సప్ ఇకపై పనిచేయదు. పాత వెర్షన్ OSలకు మద్దతును నిలిపివేయడం ద్వారా కంపెనీ ఇప్పటికే ఉన్న కస్టమర్ల భద్రతపై దృష్టి పెడుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×