E-Paper
Advertisement

Full HD Vs 4K Smart TV: స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ తేడాలు తెలియకపోతే మీ డబ్బు వృథానే!

Full HD Vs 4K Smart TV: స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ తేడాలు తెలియకపోతే మీ డబ్బు వృథానే!
Advertisement

Full HD Vs 4K Smart TV: నేటి టెక్నాలజీ యుగంలో టీవీ అంటే కేవలం వినోదం అందించే పెద్ద స్క్రీన్ మాత్రమే కాదు.. అదొక స్మార్ట్ డివైజ్. కరోనా తర్వాత చాలామంది థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం మానేశారు. ఇంట్లోనే బిగ్ స్క్రీన్ టీవీలతో వారికి నచ్చిన సినిమాలు చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఈ క్రమంలో OTT ప్లాట్‌ఫాంలు, గేమింగ్ వంటి వాటి వల్ల అందరూ స్మార్ట్ టీవీల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే, టీవీ కొనేటప్పుడు చాలామందికి ఎదురయ్యే ప్రధాన సమస్య.. Full HDకి 4Kకి మధ్య తేడా తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. మరి ఆ రెండింటి మధ్య అసలు తేడా ఏంటో ఇప్పుడు చూసేద్దామా..

రిజల్యూషన్ అంటే?

టీవీ స్క్రీన్ మీద ఉండే చిన్న చిన్న చుక్కలనే పిక్సెల్స్ అంటారు. ఈ పిక్సెల్స్ సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే బొమ్మ అంత స్పష్టంగా కనిపిస్తుంది. Full HD టీవీలో 1920×1080 పిక్సెల్స్ ఉంటే.. 4K టీవీలో అంతకంటే నాలుగు రెట్లు ఎక్కువగా అంటే.. 3840×2160 పిక్సెల్స్ ఉంటాయి. అందుకే 4K టీవీలో మనకు ప్రతి అంగుళం చాలా స్పష్టంగా, డీటెయిల్డ్‌గా కనిపిస్తుంది.

Advertisement

Also Read: రూ.20 వేలకే 1200 ANSI బ్రైట్‌నెస్.. గూగుల్ టీవీ సపోర్ట్‌తో బెస్ట్ హోమ్ థియేటర్ ప్రొజెక్టర్ లాంచ్!

పిక్చర్ క్వాలిటీలో తేడా..

మీరు గనుక 50 ఇంచులు అంతకంటే ఎక్కువ స్క్రీన్ ఉండే టీవీ తీసుకోవాలనుకుంటే.. 4K బెస్ట్ ఛాయిస్. దీనిలో కలర్స్ చాలా నేచురల్‌గా, రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. సినిమా చూస్తున్నా లేదా స్పోర్ట్స్ చూస్తున్నా మనం ఆ సీన్ లోనే ఉన్నామా అన్నంత అనుభూతి కలుగుతుంది. అదే 43 ఇంచుల కంటే తక్కువ సైజు టీవీ అయితే Full HD కూడా సరిపోతుంది.

ఇంటర్నెట్ స్పీడ్ ముఖ్యం..

Advertisement

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి యాప్స్ అన్నీ 4K వీడియోలను అందిస్తున్నాయి. వీటిని ఎంజాయ్ చేయాలంటే మీ దగ్గర 4K టీవీ ఉండటంతో పాటు కనీసం 25 Mbps స్పీడ్ ఇంటర్నెట్ కచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే వీడియో బఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.

మీ బడ్జెట్‌కు ఏది సరైందంటే?

కేవలం 4K అనే ట్యాగ్ చూసి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయవద్దు. మీ అవసరం 32 నుండి 43 ఇంచుల టీవీ మాత్రమే అయితే, తక్కువ ధరలో వచ్చే Full HD టీవీ మీకు సరిపోతుంది. కానీ, థియేటర్ లాంటి అనుభూతి కావాలి, పెద్ద స్క్రీన్ కావాలి అనుకుంటే మాత్రం కాస్త ఎక్కువైనా 4K టీవీని ఎంచుకోవడమే తెలివైన పని.

Also Read: పెన్‌డ్రైవ్‌కు ఆ రెండు రంధ్రాలు ఎందుకుంటాయో తెలుసా? దీని వెనుకున్న అసలు కారణం ఇదే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×