E-Paper
Advertisement

Phone Battery: ఓడియమ్మ బడవా.. ఫోన్లో త్వరగా ఛార్జింగ్ అయిపోవడానికి అసలు కారణం ఇదా?

Phone Battery: ఓడియమ్మ బడవా.. ఫోన్లో త్వరగా ఛార్జింగ్ అయిపోవడానికి అసలు కారణం ఇదా?
Advertisement

Phone Battery: మన మొబైల్‌కు ఫుల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఏదైనా ముఖ్యమైన కాల్‌లో ఉన్నప్పుడో లేదా క్రికెట్ చూస్తున్నప్పుడో సడెన్‌గా ‘బ్యాటరీ లో’ అని స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఎక్కడ లేని కోపం తన్నుకొస్తుంది కదూ. అది కూడా సడెన్‌గా ఫోన్ బ్యాటరీ 5 శాతానికి పడిపోతే.. అప్పుడు వచ్చే చిరాకు అంతా ఇంతా కాదు. ఆ సమయంలో చాలామంది వెంటనే చేసే పని స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించడం లేదా యాప్స్‌ను క్లోజ్ చేయడం. కానీ, ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడానికి స్క్రీన్ మాత్రమే కాదు.. నెట్‌వర్క్ సిగ్నల్ కూడా కారణం కావొచ్చంటున్నారు టెక్ నిపుణులు.

సిగ్నల్స్ లేకపోతే ఛార్జింగూ ఉండదు:

మనం ఉండే ప్రాంతంలో సిగ్నల్ వీక్‌గా ఉంటే.. సెల్ టవర్‌తో కనెక్ట్ అవ్వడానికి ఫోన్ మరింత బ్యాటరీని వాడుకుంటుంది. సిగ్నల్ కోసం ఫోన్ వెతుకుతూ ఉండటం వల్ల బ్యాటరీ వేగంగా ఖర్చవ్వడమే కాకుండా, ఫోన్ కూడా వేడెక్కుతుంది. అందుకే ఫుల్ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతంలో కంటే.. సిగ్నల్ సరిగ్గా లేని చోట మన ఫోన్ త్వరగా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. బ్యాటరీ లైఫ్ అనేది కేవలం దాని కెపాసిటీ మీద మాత్రమే కాదు, నెట్‌వర్క్ సామర్థ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది.

Advertisement

Also Read: నోకియా కీప్యాడ్ ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడొచ్చు!

ఏఐ సాయంతో బ్యాటరీ మేనేజ్:

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా లేదా గూగుల్ పిక్సెల్ 10 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయంతో బ్యాటరీని బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఇవి రోజంతా అదే పనిగా ఫోన్ వాడేవారి బ్యాక్ గ్రౌండ్ యాక్టివిటీని నియంత్రిస్తాయి. అలాగే, వెరిజోన్ వంటి నెట్‌వర్క్ సంస్థలు ఎక్కువ సెల్ టవర్లను దగ్గరగా ఏర్పాటు చేయడం ద్వారా ఫోన్ తక్కువ పవర్‌తోనే బలమైన సిగ్నల్‌ను పొందేలా చేస్తున్నాయి.

ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండాలంటే?

Advertisement

స్మార్ట‌ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ గంటలు రావాలంటే కేవలం బ్రైట్‌నెస్ తగ్గిస్తే సరిపోదు. బలమైన నెట్‌వర్క్ కనెక్టివిటీ కూడా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీ ఫోన్ బ్యాటరీలో ఏవైనా సమస్యలు ఉంటే, ఫోన్ వారంటీ ముగిసినా కూడా కొన్ని ప్రొటెక్షన్ ప్లాన్స్ ద్వారా బ్యాటరీ రీప్లేస్‌మెంట్ సౌకర్యాన్ని పొందొచ్చు. ఇక నుంచి ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంటే.. ఓసారి మీ నెట్‌వర్క్ సిగ్నల్‌ను కూడా చెక్ చేసుకోవడం బెటర్.

Also Read: రూ.899 నుంచే ఫిలిప్స్ కొత్త హెడ్‌ఫోన్స్, సౌండ్‌బార్స్.. ఫీచర్స్, క్వాలిటీలో తిరుగులేదు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×