E-Paper
Advertisement

మహిళల రక్షణకు కొత్త టెక్నాలజీ.. ‘సేఫ్టీ మ్యాప్’ ఎలా పనిచేస్తుందో తెలుసా?

మహిళల రక్షణకు కొత్త టెక్నాలజీ.. ‘సేఫ్టీ మ్యాప్’ ఎలా పనిచేస్తుందో తెలుసా?
Advertisement

Women safety apps: ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అప్‌గ్రేడ్ అయింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే.. ప్రపంచాన్నే చుట్టేయొచ్చు. అయితే, మహిళల భద్రత విషయానికి వస్తే టెక్నాలజీ మరింత కీలకంగా మారుతోంది. రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా తెలియని ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు మహిళలకు రక్షణగా నిలిచే ఒక అద్భుతమైన డిజిటల్ టూల్ ‘సేఫ్టీ మ్యాప్’. అసలు ఈ సేఫ్టీ మ్యాప్ అంటే ఏంటి? కష్ట సమయాల్లో.. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు దీనిని ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సేఫ్టీ మ్యాప్ అంటే ఏమిటి?

సాధారణంగా మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లడానికి లేదా రూట్స్ తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్ వాడుతుంటాం. కానీ ‘సేఫ్టీ మ్యాప్స్’ అనేవి కేవలం దారి చూపించడానికే కాదు, ఆ దారి ఎంతవరకు సురక్షితమైనదో కూడా చెప్తాయి. అంటే ఒక ప్రాంతంలో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా, జనసంచారం ఎలా ఉంది, గతంలో అక్కడ ఏవైనా నేరాలు జరిగాయా, దగ్గరలో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది వంటి వివరాలను రియల్-టైమ్‌లో చూపించే మ్యాప్‌లనే ‘సేఫ్టీ మ్యాప్స్’ అంటారు. ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్‌తో పాటు పలు రకాల విమెన్ సేఫ్టీ యాప్స్ (ఉదాహరణకు మై సేఫ్టీ పిన్ – My Safetipin) ఈ ఫీచర్లను అందిస్తున్నాయి.

Advertisement

కష్ట సమయాల్లో ఎలా ఉపయోగించాలి?

ఆపదలో ఉన్నప్పుడు లేదా ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ఈ సేఫ్టీ మ్యాప్స్ మహిళలకు ఒక లైఫ్ సేవర్ లాగా పని చేస్తాయి. వీటిని ఎలా ఉపయోగించవచ్చంటే..

Advertisement

సేఫ్ రూట్ సెలెక్షన్ : మీరు రాత్రి వేళల్లో క్యాబ్ లేదా ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు, కేవలం షార్ట్‌కట్ దారిని మాత్రమే కాకుండా.. సేఫ్టీ మ్యాప్ సహాయంతో ఎక్కువ జనం, వెలుతురు ఉన్న ‘సురక్షితమైన దారి’ని ఎంచుకోవచ్చు.

రియల్-టైమ్ లొకేషన్ షేరింగ్: కష్ట సమయాల్లో.. మీ ఫోన్ లోని మ్యాప్ ద్వారా.. మీ లైవ్ లొకేషన్‌ను కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు షేర్ చేయవచ్చు. దీని వల్ల మీరు ఎక్కడ ఉన్నారో వారు నిరంతరం ట్రాక్ చేయగలుగుతారు.

అత్యవసర సహాయ కేంద్రాల గుర్తింపు: ఏదైనా తెలియని ఏరియాలో.. మీకు ఆపద ఎదురైతే..మీ చుట్టు పక్కల అతి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్ లేదా పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో ఈ మ్యాప్స్ వెంటనే చూపిస్తాయి.

సేఫ్టీ స్కోర్ చెకింగ్ : కొన్ని అడ్వాన్స్‌డ్ సేఫ్టీ మ్యాప్స్ ఒక ఏరియాకు రేటింగ్ లేదా సేఫ్టీ స్కోర్ ఇస్తాయి. ఆ స్కోర్ చూసి ఆ ప్రాంతం మహిళలకు ఎంతవరకు సేఫ్ అనేది ముందే డిసైడ్ అవ్వొచ్చు.

SOS అలర్ట్స్ : చాలా సేఫ్టీ మ్యాప్స్ ఇన్-బిల్ట్ SOS ఫీచర్‌తో వస్తాయి. కష్ట సమయంలో.. వాచ్ లేదా ఫోన్‌ని గట్టిగా షేక్ చేసినా, లేదా పవర్ బటన్ ప్రెస్ చేసినా మీ లొకేషన్‌తో పాటు మెసేజ్ మీ కాంటాక్ట్స్‌కు, పోలీసులకు వెళ్తుంది.

గూగుల్ మ్యాప్స్‌లో సేఫ్టీ ఫీచర్స్:

మనం రెగ్యులర్‌గా వాడే గూగుల్ మ్యాప్స్‌లో కూడా కొన్ని బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు మీ ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేసి “Location Sharing” ఆప్షన్ ద్వారా మీ లొకేషన్‌ను మీ నమ్మకస్తులకు షేర్ చేయండి. అలాగే.. ప్రయాణంలో మీ డ్రైవర్ రూట్ మార్చితే మీకు వెంటనే అలర్ట్ వచ్చేలా “Off-route alerts” ఫీచర్‌ను ఆన్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది.

ఇల్లైనా, ఆఫీస్ అయినా మహిళల సేఫ్టీ ముఖ్యం. భయం కంటే అప్రమత్తత ఎప్పుడూ బెటర్. కాబట్టి.. ప్రతి మహిళా తమ స్మార్ట్‌ఫోన్‌లలో కేవలం సోషల్ మీడియా యాప్స్ మాత్రమే కాకుండా.. ఇలాంటి సేఫ్టీ మ్యాప్స్ , విమెన్ సేఫ్టీ అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేసుకుని, వాటిని ఎలా వాడాలో ముందే అవగాహన కలిగి ఉండటం ప్రస్తుతం ఎంతో అవసరం.

 

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×