E-Paper
Advertisement

పాస్‌వర్డ్‌లు, ఓటీపీల కాలం చెల్లిపోనుందా? సరికొత్త Passkeys టెక్నాలజీ అంటే ఏమిటీ?

పాస్‌వర్డ్‌లు, ఓటీపీల కాలం చెల్లిపోనుందా? సరికొత్త Passkeys టెక్నాలజీ అంటే ఏమిటీ?
Advertisement

Passkeys: ప్రతిరోజూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన స్మార్ట్‌ఫోన్‌లో ఏదో ఒక యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేస్తూనే ఉంటాం. అయితే ఆయా ఖాతాలను లాగిన్ చేయడానికి పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకోవడం, ఆ తర్వాత ఫోన్‌కు వచ్చే ఓటీపీల కోసం ఎదురుచూడటం కొన్నిసార్లు పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంటుంది. అయితే ఈ తిప్పలకు త్వరలోనే చెక్ పడనుంది. Passwords, OTPల కాలం చెల్లిపోయే రోజులు దగ్గరపడ్డాయి. వీటి స్థానంలో సరికొత్తగా Passkeys అనే అద్భుతమైన సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.

Passkeys అంటే ఏమిటి?

సాధారణంగా మనం వాడే పాస్‌వర్డ్‌ల స్థానంలో డిజిటల్ గుర్తింపును ఉపయోగించడమే ఈ పాస్‌కీస్ విధానం. మన స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్లలో స్క్రీన్ లాక్ కోసం ఉపయోగించే ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్ లేదా పిన్ నెంబర్ల సాయంతోనే నేరుగా వెబ్‌సైట్లలోకి లాగిన్ అయిపోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి పాస్‌వర్డ్‌లను సృష్టించాల్సిన లేదా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.

Advertisement

Also Read: మొబైల్‌లో సిమ్ కార్డ్ లేకపోయినా.. ఎమర్జెన్సీ కాల్ ఎలా కనెక్ట్ అవుతుందో తెలుసా?

ఇదెలా పనిచేస్తుంది?

ఈ సరికొత్త విధానం క్రిప్టోగ్రఫీ అనే అధునాతన భద్రతా పద్ధతిపై ఆధారపడి పనిచేస్తుంది. మనం ఏదైనా ఖాతాకు పాస్‌కీని సెట్ చేసినప్పుడు.. మన డివైజ్‌లో ఒక ప్రైవేట్ కీ, సదరు వెబ్‌సైట్ సర్వర్‌లో ఒక పబ్లిక్ కీ క్రియేట్ అవుతాయి. మనం లాగిన్ అవ్వాలని అనుకున్నప్పుడు మన ఫోన్ బయోమెట్రిక్ ద్వారా ఈ రెండు కీలు ఒకదానికొకటి మ్యాచ్ అయి, క్షణాల్లో ఖాతా ఓపెన్ అయిపోతుంది.

ఎందుకింత సురక్షితం?

Advertisement

హ్యాకర్లు మన పాస్‌వర్డ్‌లను దొంగిలించడం లేదా ఓటీపీలను హ్యాక్ చేయడం వంటి సైబర్ నేరాలకు ఈ విధానంతో పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. ఎందుకంటే.. మన బయోమెట్రిక్ డేటా కేవలం మన ఫోన్‌లో మాత్రమే భద్రంగా ఉంటుంది. సర్వర్‌లకు బదిలీ కాదు. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా జరిగే ఫిషింగ్ దాడుల నుండి కూడా ఇది పూర్తి రక్షణ కల్పిస్తుంది.

భవిష్యత్తు దీనిదే:

ఇప్పటికే గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు తమ వినియోగదారులకు ఈ పాస్‌కీస్ సేవలను అందిస్తున్నాయి. వాడకంలో ఎంతో సులువుగా, భద్రతలో అత్యంత కచ్చితత్వంతో ఉండే ఈ సాంకేతికత రాబోయే రోజుల్లో డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేయనుంది.

Also Read: Incognito Mode వాడుతున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్రౌజింగ్ హిస్టరీ అందరికీ తెలిసిపోతుంది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×