E-Paper
Advertisement

AC – Fridge: ఏసీ ఉన్న గదిలోనే ఫ్రిడ్జ్‌ను పెడుతున్నారా? మీ జేబుకి చిల్లు పడటం ఖాయం!

AC – Fridge: ఏసీ ఉన్న గదిలోనే ఫ్రిడ్జ్‌ను పెడుతున్నారా? మీ జేబుకి చిల్లు పడటం ఖాయం!
Advertisement

AC – Fridge: సాధారణంగా వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ఏసీని ఎక్కువగా వినియోగిస్తుంటాం. అయితే, చాలామంది బెడ్రూమ్‌లో లేదా ఏసీ ఉన్న గదిలోనే ఫ్రిడ్జ్‌ను కూడా ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల గది ఉష్ణోగ్రతపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఏసీ పనితీరుపై ప్రభావం చూపుతుందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రెండూ ఒకే గదిలో ఉంటే?

ఫ్రిడ్జ్‌ చేసే పనేంటంటే.. లోపల ఉన్న వస్తువులను చల్లబరిచే క్రమంలో, అక్కడ ఉన్న వేడిని గ్రహించి బయటకు పంపుతుంది. తద్వారా ఫ్రిడ్జ్ వెనుక భాగంలో ఉండే కాయిల్స్ ద్వారా ఈ వేడి గదిలోకి విడుదలవుతుంది. అంటే.. ఫ్రిడ్జ్ లోపల చల్లగా ఉన్నప్పటికీ, అది గదికి ఓ చిన్న హీటర్‌లా పనిచేస్తుందన్నమాట. దీనివల్ల గదిలోని గాలి కొద్ది మొత్తంలో వేడెక్కుతుంది.

Advertisement

Also Read: ఈ సమయాల్లో ఏసీ వేయొద్దు.. అలా చేస్తే ఈ రెండు నష్టాలు తప్పవు!

ఏసీపై అదనపు భారం..

సాధారణంగా గదిని చల్లగా ఉంచడమే ఏసీ పని. కానీ అదే గదిలో ఉన్న ఫ్రిడ్జ్ వేడిని విడుదల చేస్తున్నప్పుడు, ఏసీ ఆ అదనపు వేడిని కూడా బయటకు పంపాల్సి ఉంటుంది. దీనివల్ల ఏసీ కంప్రెసర్ ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా మీరు అనుకున్న దానికంటే విద్యుత్ వినియోగం పెరిగి, కరెంటు బిల్లు భారమవుతుంది.

సెన్సార్లు పాడైపోవచ్చు..

Advertisement

అలాగే గదిలో సరైన గాలి వెంటిలేషన్ లేకపోతే, ఫ్రిడ్జ్ నుంచి వచ్చే వేడి వల్ల గాలిలో తేమ పెరిగి గోడలపై బూజు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఏసీ గాలి నేరుగా ఫ్రిడ్జ్ వెనుక భాగంపై పడకుండా చూసుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్ కాయిల్స్ త్వరగా చల్లబడి, లోపల ఉన్న సెన్సార్లు పాడైపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఫ్రిడ్జ్ చుట్టూ కొంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకుంటే.. వేడి త్వరగా చల్లబడి ఏసీపై భారం తగ్గుతుంది.

Also Read: భారీ డిస్కౌంట్‌తో కోడాక్ మినీ క్యూడీ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×