E-Paper
Advertisement

క్విక్ వాష్’వాడుతున్నారా ? ఇలా ఉతికితే బట్టలు గోవిందా..!

క్విక్ వాష్’వాడుతున్నారా ? ఇలా ఉతికితే బట్టలు గోవిందా..!
Advertisement

Quick Wash effects: ఈనాటి ఉరుకుల పరుగుల జీవితంలో సమయాన్ని ఆదా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ వాషింగ్ మెషీన్‌లో ‘క్విక్ వాష్’ (Quick Wash) ఆప్షన్‌ను ఎక్కువగా వాడుతున్నారు. గంటల కొద్దీ కాకుండా కేవలం 15 నుంచి 30 నిమిషాల్లోనే బట్టలు ఉతికేయడం వల్ల ఇది చాలా మందికి ఫేవరెట్ మోడ్‌గా మారింది. అయితే.. ప్రతిరోజూ అన్ని రకాల బట్టలకు ఈ షార్ట్‌కట్ సైకిల్ ఉపయోగించడం వల్ల బట్టల మన్నిక, వాషింగ్ మెషీన్ పై ఎలాంటి తీవ్రమైన ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజూ ‘క్విక్ వాష్’ వాడితే ఏం జరుగుతుంది?
వాషింగ్ మెషీన్లలో ఉండే ‘క్విక్ వాష్ ‘ లేదా ‘Express Wash’ అనేది ఒక అద్భుతమైన ఫీచర్ అయినప్పటికీ.. దానిని ప్రతి దానికీ వాడటం వల్ల బట్టలకు అనేక నష్టాలు వాటిల్లుతాయి.

Advertisement

1. మొండి మరకలు,మురికి:
క్విక్ వాష్ అనేది కేవలం తక్కువ మురికి ఉన్న బట్టలు లేదా ఒకసారి వేసుకుని తీసేసిన బట్టలు (ఉదాహరణకు ఆఫీస్ బట్టలు) కోసం మాత్రమే డిజైన్ చేయబడింది. జీన్స్, బెడ్ షీట్లు, టవల్స్ లేదా ఎక్కువ మురికి, చెమట పట్టిన బట్టలను ఇందులో వేస్తే.. అవి పూర్తిగా శుభ్రపడవు. తక్కువ సమయంలో నీరు బట్టల పొరల్లోకి.. పూర్తిగా వెళ్లేలోపే సైకిల్ ముగిసిపోతుంది. దీని వల్ల బట్టలలో బ్యాక్టీరియా, దుర్వాసన అలాగే ఉండిపోతాయి.

2. డిటర్జెంట్ మిగిలిపోవడం, చర్మ సమస్యలు:
ఈ సైకిల్‌లో నీటి వాడకం తక్కువగా ఉండటమే కాకుండా, బట్టలను పిండే సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు సాధారణ వాష్ లాగే ఎక్కువ డిటర్జెంట్ పౌడర్ లేదా లిక్విడ్ వేస్తే.. అది బట్టల నుంచి పూర్తిగా తొలగిపోదు. ఎండబెట్టిన తర్వాత బట్టలపై తెల్లటి మచ్చలు కనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఈ డిటర్జెంట్ అవశేషాలు ఉన్న బట్టలను వేసుకోవడం వల్ల చర్మ అలర్జీలు, దురద వంటి సమస్యలు వస్తాయి.

Advertisement

3. ఫ్యాబ్రిక్ దెబ్బతినడం:
తక్కువ సమయంలోనే బట్టలను ఉతికి, ఆరబెట్టడానికి మెషీన్ చాలా వేగంగా తిరగాల్సి వస్తుంది. ఈ హై-స్పీడ్ అజిటేషన్, స్పిన్ వల్ల కాటన్, సిల్క్ లేదా ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న సున్నితమైన బట్టల దారాలు బలహీనపడతాయి. బట్టలు సాగిపోవడం, రంగు వెలిసిపోవడం, త్వరగా చిరిగిపోయే ప్రమాదం ఈ మోడ్‌లో చాలా ఎక్కువ.

వాషింగ్ మెషీన్‌పై పడే ప్రభావం:
క్విక్ వాష్ వల్ల కేవలం బట్టలు మాత్రమే కాదు.. మీ వాషింగ్ మెషీన్ కూడా పాడవుతుంది.

సబ్బు పేరుకుపోవడం: తక్కువ నీటితో డిటర్జెంట్ పూర్తిగా కరగకపోవడం వల్ల మెషీన్ డ్రమ్ వెనక భాగంలో, పైపుల్లో జిడ్డు లాంటి సబ్బు పొర పేరుకుపోతుంది.

దుర్వాసన, బూజు: మెషీన్ లోపల బ్యాక్టీరియా, బూజు చేరి కాలక్రమేణా మెషీన్ నుంచి కుళ్ళిన వాసన రావడం మొదలవుతుంది.

క్విక్ వాష్‌ను స్మార్ట్‌గా, సురక్షితంగా వాడటం ఎలా?

వాషింగ్ మెషీన్‌లో ‘క్విక్ వాష్’ మోడ్ వాడేటప్పుడు బట్టలు పాడవకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ సైకిల్‌లో కేవలం తక్కువ మురికి ఉన్న తేలికపాటి బట్టలు మాత్రమే ఉతకాలి. అంతే తప్ప హెవీ జీన్స్, మందపాటి టవల్స్, బెడ్ షీట్లను అస్సలు వేయకూడదు. అలాగే.. మెషీన్ నిండా బట్టలను దట్టించి కూడబెట్టకుండా, మెషీన్ కెపాసిటీలో కేవలం సగం వరకు మాత్రమే బట్టలను వేసుకోవాలి. ఇక డిటర్జెంట్ విషయానికి వస్తే.. ఇందులో ఎక్కువ మొత్తంలో పౌడర్ డిటర్జెంట్ వాడటం పూర్తిగా ఆపేయాలి. దానికి బదులుగా సాధారణంగా వాడే మోతాదు కంటే సగం పరిమాణంలోనే లిక్విడ్ డిటర్జెంట్‌ను ఉపయోగించడం వల్ల బట్టలు చక్కగా శుభ్రపడటమే కాకుండా వాటి మన్నిక కూడా పెరుగుతుంది.

Also Read: పాతకాలపు అందం.. లేటెస్ట్ టెక్నాలజీ, ఈ వేసవికి బెస్ట్ క్లాసిక్ ఫ్యాన్స్!

సమయాన్ని.. కరెంట్‌ను ఆదా చేసుకోవడం మంచిదే కానీ, అది మీ విలువైన బట్టలను నాశనం చేసేలా ఉండకూడదు. ‘క్విక్ వాష్’ అనేది అత్యవసర సమయాల్లో వాడుకోవడానికి ఇచ్చిన ఒక ప్రత్యామ్నాయం మాత్రమే కానీ.. అది రెగ్యులర్ వాషింగ్ మోడ్ కాదు. వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే దీనిని పరిమితంగా వాడుతూ, మిగిలిన సమయాల్లో బట్టల రకాన్ని బట్టి ‘కాటన్’ లేదా ‘నార్మల్’ వాష్ సైకిల్స్ ఎంచుకోవడమే మీ బట్టలకు కూడా మంచిది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×