E-Paper
Advertisement

వాషింగ్ మెషిన్ నుంచి కాలిన వాసన వస్తోందా? వెంటనే ఈ పని చేయకపోతే ఎప్పుడైనా పేలొచ్చు!

వాషింగ్ మెషిన్ నుంచి కాలిన వాసన వస్తోందా? వెంటనే ఈ పని చేయకపోతే ఎప్పుడైనా పేలొచ్చు!
Advertisement

Washing Machine Problems: ప్రతి ఇంట్లోనూ రోజూ విరామం లేకుండా తిరిగే మిషన్లలో వాషింగ్ మెషిన్ ఒకటి. బట్టలు ఉతకడం సులువు చేస్తుంది కాబట్టి.. దీన్ని ఎక్కువగా వాడుతుంటాం. అయితే ఇందులో వచ్చే చిన్న చిన్న సమస్యలను మాత్రం అస్సలు పట్టించుకోం. పూర్తిగా ఆగిపోయే వరకు దాని జోలికి వెళ్లం. కానీ, కొన్ని చిన్న లోపాలు పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని మీకు తెలుసా? అందుకే.. కరెంట్ షాక్, షార్ట్ సర్క్యూట్, వాషింగ్ మెషిన్ పేలిపోవడం వంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తాకితే షాక్ కొడుతుందా?

చాలామందికి వాషింగ్ మెషిన్ ముట్టుకున్నప్పుడు జిల్లుమనే అనుభూతి కలుగుతుంది. అయితే ఏం కాదులే.. అని దీన్ని వదిలేస్తుంటారు. కానీ ఇది చాలా డేంజర్. ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా లేకపోయినా, లోపల వైర్లు కట్ అయి బాడీకి తగులుతున్నా ఇలా జరుగుతుంది. ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నప్పుడు ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వెంటనే టెక్నీషియన్‌ను పిలిపించి వైరింగ్ చెక్ చేయించుకోవాలి. దీనికి సుమారుగా రూ.500 నుంచి రూ.2500 వరకు ఖర్చవ్వొచ్చు.

కాలిన వాసన వస్తోందా?

Advertisement

మిషన్ రన్ అవుతున్నప్పుడు ప్లాస్టిక్ కాలుతున్నట్లు లేదా ఏదో మాడుతున్నట్లు వాసన వస్తే వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి. మోటార్ ఓవర్‌హీట్ అవ్వడం లేదా లోపల వైర్లు కరిగిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని అలాగే వదిలేస్తే మిషన్ లోపల మంటలు చెలరేగి పెద్ద ప్రమాదం జరగొచ్చు. మోటార్ పూర్తిగా పాడైతే ఖర్చు కూడా భారీగా ఉంటుంది. దీని రిపేరుకు రూ.1000 నుండి రూ.5000 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది.

నీళ్లు లీక్ అవుతున్నాయా?

మిషన్ కింద లేదా పక్కన కొద్దిగా నీరు చేరుతుంటే చాలామంది తుడిచేసి ఊరుకుంటారు. పైపులు పాతబడిపోవడం లేదా డోర్ రబ్బర్ లూజ్ అవ్వడం వల్ల నీళ్లు కారుతుంటాయి. ఈ నీరు బోర్డులోకి లేదా వైర్లలోకి వెళ్తే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. తడి నేలపై నిలబడి మిషన్ ముట్టుకుంటే గట్టిగా షాక్ కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి లీకేజీలను వెంటనే సరిచేయాలి. దీనికి రూ.300 నుండి రూ.2000 లోపే ఖర్చవుతుంది.

Advertisement

Also Read: ఇంత తక్కువ ధరకా? Samsung Galaxy S2 5G కొనడానికి ఇదే బెస్ట్ టైమ్, ఏకంగా రూ.27వేలు తగ్గింపు!

మిషన్ నుంచి ఈ సౌండ్స్ వస్తే?

బట్టలు పిండేటప్పుడు మిషన్ విపరీతంగా ఊగిపోవడం, పెద్ద పెద్ద శబ్దాలు చేయడం గమనించే ఉంటారు. బట్టలు ఒకే వైపు ఎక్కువగా వేయడం వల్ల లేదా లోపల ఉండే బేరింగ్స్, షాక్ అబ్జార్బర్స్ పాడవటం వల్ల ఇలా జరుగుతుంది. దీనివల్ల మిషన్ లోపలి భాగాలు విరిగిపోవడమే కాకుండా.. మిషన్ కిందపడిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యను రూ.800 నుండి రూ.4000 ఖర్చుతో సరిచేసుకోవచ్చు.

స్విచ్ వేయగానే కరెంట్ పోతుందా?

వాషింగ్ మెషిన్ ఆన్ చేయగానే ఇంట్లో ఎంసిబి ట్రిప్ అవ్వడం లేదా పవర్ కట్ అవ్వడం జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. లోపల ఎక్కడో తీవ్రమైన షార్ట్ సర్క్యూట్ జరిగిందని దీని అర్థం. మళ్లీ మళ్లీ స్విచ్ ఆన్ చేసి ప్రయత్నిస్తే ఇల్లంతా పవర్ లైన్స్ పాడవుతాయి. వెంటనే ప్లగ్ తీసేసి మెకానిక్‌ను పిలవాలి. దీనికి కాస్త ఖర్చు ఎక్కువ ఖర్చయినా.. ప్రాణాల కంటే ముఖ్యం కాదు కదా. కనీసం ఏడాదికి ఒకసారైనా సర్వీసింగ్ చేయించడం, తడి లేని చోట మిషన్ ఉంచడం వల్ల ఇలాంటి ప్రమాదాల నుండి మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.

Also Read: కనీ వినీ ఎరుగని ఆఫర్.. 70 రోజుల పాటు రోజూ 3GB డేటా.. BSNL కొత్త ప్లాన్ చూశారా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×