E-Paper
Advertisement

Netflix: ఇకపై మీరే న్యాయనిర్ణేతలు.. నెట్‌ఫ్లిక్స్ లైవ్ ఓటింగ్ వచ్చేసింది.. ఇక ఆ షోలో ఏం జరగాలో మీ చేతుల్లోనే!

Netflix: ఇకపై మీరే న్యాయనిర్ణేతలు.. నెట్‌ఫ్లిక్స్ లైవ్ ఓటింగ్ వచ్చేసింది.. ఇక ఆ షోలో ఏం జరగాలో మీ చేతుల్లోనే!
Advertisement

Netflix: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మరో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఇప్పటివరకు కేవలం మనకు నచ్చిన సినిమాలు, షోలను చూసి ఎంజాయ్ చేసేవాళ్లం. కానీ ఇకపై మనం చూసే షోల ఫలితాలను కూడా మనమే డిసైడ్ చేయవచ్చు. షోలో ఏం జరగాలో మనం డిసైడ్ చేయడం ఏంటి.. అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. తాజాగా నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన ‘Real Time Voting’ ఫీచర్‌ ద్వారా ప్రేక్షకులు షో చూస్తూనే, లైవ్ ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. అదెలాగో ఇప్పుడు చూసేద్దాం..

మీరే న్యాయనిర్ణేతలు..

సాధారణంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా షో లేదా సినిమా నచ్చితే థంబ్స్ అప్ ఇవ్వడం, నచ్చకపోతే థంబ్స్ డౌన్ చేయడం మనకు తెలుసు. అయితే కొత్తగా వచ్చిన ఈ రియల్ టైమ్ ఓటింగ్ ఫీచర్ అంతకుమించి ఉండబోతోంది. లైవ్ స్ట్రీమింగ్ జరుగుతున్న టైంలోనే ప్రేక్షకులు ఓటు వేసి, షోలోని మెంబర్లను లేదా స్టోరీలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే.. తెరపై ఏం జరగాలో కూడా రిమోట్ ద్వారా మీరే నిర్ణయించే అవకాశం నెట్‌ఫ్లిక్స్ కల్పించిందన్నమాట.

Advertisement

Also Read: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5తో వచ్చిన తొలి ఫోన్.. మోటొరోలా సిగ్నేచర్ ఫీచర్లు చూస్తే మైండ్ పోతుంది భయ్యా!

ఇప్పటికే అందుబాటులోకి..

ఈ ఫీచర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఈనెల 21న Star Search అనే లైవ్ షో ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే.. టీవీ ద్వారా నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నట్లయితే మీ రిమోట్ ద్వారా ఓటు వేయొచ్చు. లేదా మొబైల్ యూజర్ అయితే స్క్రీన్‌పై వచ్చే ఆప్షన్లను ట్యాప్ చేయడం ద్వారా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. అయితే, వెబ్ బ్రౌజర్‌లో నెట్‌ఫ్లిక్స్ చూసే వారికి ప్రస్తుతానికి ఈ సౌకర్యం అందుబాటులో లేదు. అలాగే ఒక ఐడీ నుంచి ఒక్కసారి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది.

స్ట్రీమింగ్ రంగంలో కొత్త మార్పు..

Advertisement

భవిష్యత్తులో మరిన్ని రియాలిటీ షోలు, లైవ్ ఈవెంట్లలో ఈ Real Time Votingను విస్తరిస్తామని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కేవలం ప్రేక్షకుల్లా చూసి ఊరుకోకుండా.. షోలో భాగస్వాములు అయ్యే ఈ విధానం స్ట్రీమింగ్ రంగంలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించబోతోంది. ఇకపై నెట్‌ఫ్లిక్స్ లైవ్ షోల భవిష్యత్తు పూర్తిగా ప్రేక్షకుల చేతుల్లోనే ఉండనుంది.

Also Read: కెమెరా కింగ్ ఒప్పో ఫైండ్ X8 ప్రోపై ఏకంగా రూ.18వేల తగ్గింపు.. అమెజాన్ సేల్ ఆఫర్ ఫుల్ డీటెయిల్స్!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×