E-Paper
Advertisement

ఇలాంటి ప్లాన్ ఎప్పుడూ చూసుండరు.. ఒక్క రీఛార్జ్‌తో 365 రోజుల వాలిడిటీ.. రాత్రిపూట ఫ్రీ డేటా!

ఇలాంటి ప్లాన్ ఎప్పుడూ చూసుండరు.. ఒక్క రీఛార్జ్‌తో 365 రోజుల వాలిడిటీ.. రాత్రిపూట ఫ్రీ డేటా!
Advertisement

Vi 3999 Plan: టెలికాం రంగంలో పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి కంపెనీలు సరికొత్త ప్లాన్లను తీసుకొస్తూనే ఉంటాయి. తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఒక అదిరిపోయే లాంగ్ టర్మ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. పదే పదే రీఛార్జ్ చేసుకునే తలనొప్పి లేకుండా.. ఒక్కసారి రీఛార్జ్‌తో ఏడాది అంతా నిశ్చింతగా ఉండాలనుకునే వారికి ఈ ప్లాన్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. దీని ధర రూ.3999గా ఉంది.

ఏడాది మొత్తం అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా:

ఈ ప్లాన్ తీసుకున్న వారికి కంపెనీ పూర్తి 365 రోజుల వాలిడిటీని అందిస్తోంది. దీనిలో భాగంగా వినియోగదారులు ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్‌గా కాల్స్ మాట్లాడుకోవచ్చు. దీంతో పాటు ప్రతిరోజూ 2GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఒకవేళ రోజువారీ డేటా కోటా అయిపోయినా సరే, ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు. 64Kbps వేగంతో బ్రౌజింగ్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 SMS పంపుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది.

రాత్రిపూట నాన్‌స్టాప్ డేటా, మరిన్ని బెనిఫిట్స్:

Advertisement

ఈ ప్లాన్ లోని మరో ప్రత్యేకత ఏమిటంటే.. అర్ధరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వినియోగదారులు ఎలాంటి పరిమితి లేకుండా అన్‌లిమిటెడ్ ఉచిత డేటాను వాడుకోవచ్చు. అంతేకాకుండా.. సోమవారం నుండి శుక్రవారం వరకు మిగిలిపోయిన డేటాను శని, ఆదివారాల్లో వాడుకునేలా వీకెండ్ డేటా రోల్‌ఓవర్ సదుపాయాన్ని కూడా కల్పించారు. దీనికి తోడు అదనంగా నెలకు 2GB బ్యాకప్ డేటాను కూడా కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

Also Read: 8000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లు.. OnePlus Turbo 6X Pro వచ్చేస్తోంది, పూర్తి వివరాలివే!

ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు:

Advertisement

వినోదాన్ని ఇష్టపడే వారి కోసం ఈ ప్లాన్‌లో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను కూడా జత చేశారు. ఇందులో ఏడాది పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు లైవ్ స్పోర్ట్స్, సరికొత్త సినిమాలు, టీవీ సీరియల్స్ వంటి వినోదాన్ని మొబైల్‌లోనే ఆస్వాదించవచ్చు.

అమెజాన్ ప్రైమ్ లైట్ ప్రయోజనాలు:

దీంతోపాటు వినియోగదారులకు ఒక ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. దీని సహాయంతో ప్రైమ్ వీడియో కంటెంట్‌ను మొబైల్ లేదా టీవీలో 720p హెచ్‌డీ క్వాలిటీతో వీక్షించవచ్చు. కేవలం వినోదమే కాకుండా, అమెజాన్‌‌లో షాపింగ్ చేసేటప్పుడు వస్తువులను ఒక రోజులోనే ఉచితంగా డెలివరీ పొందే సదుపాయం కూడా ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా అందుతుంది. మొత్తానికి జియో, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజాలకు పోటీగా వి (Vi) తెచ్చిన ఈ సూపర్ హీరో ప్లాన్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Also Read: 30, 40 ఏళ్లకే గుండెపోటు.. ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు చేస్తున్న ఆ 4 ఘోరమైన తప్పులు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×