E-Paper
Advertisement

ఇంత తక్కువ ధరలో అలాంటి ఫీచర్లా? మార్కెట్‌లోకి సైలెంట్‌గా వచ్చి రచ్చలేపుతున్న Vivo Y6a!

ఇంత తక్కువ ధరలో అలాంటి ఫీచర్లా? మార్కెట్‌లోకి సైలెంట్‌గా వచ్చి రచ్చలేపుతున్న Vivo Y6a!
Advertisement

Vivo Y6a: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో చైనా మార్కెట్లో సరికొత్త బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. Vivo Y6a పేరుతో వచ్చిన ఈ ఫోన్.. త్వరలో రాబోయే Vivo X Fold 6 కంటే ముందే మార్కెట్లోకి అడుగుపెట్టింది. స్క్వేర్ ఆకారంలో ఉండే కెమెరా సెటప్, పంచ్ హోల్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ లుక్ చాలా స్టైలిష్‌గా ఉంది. ప్రస్తుతం చైనాలోని వీవో ఆన్‌లైన్ స్టోర్‌లో ఇది అమ్మకానికి అందుబాటులో ఉంది.

ఈ Vivo Y6a కేవలం ఒకే ఒక వేరియంట్‌లో లభిస్తుంది. 8GB RAM, 256GB స్టోరేజ్ ఉన్న ఈ మోడల్ ధరను చైనాలో రూ.28,000 వరకు ఉంటుంది. గెలాక్సీ సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్, ఫీనిక్స్ వెల్‌కమ్స్ గోల్డ్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగుల్లో దీనిని కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Also Read: యాపిల్ సంచలన నిర్ణయం.. ఆ రెండు ప్రాసెసర్లు పక్కనబెట్టి.. నేరుగా M7తో భారీ స్కెచ్!

ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజినల్ ఓఎస్ 6 సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులను చాలా వేగంగా, స్మూత్‌గా రన్ చేయడానికి సహాయపడుతుంది.

Advertisement

ఇకపోతే ఫొటోల విషయానికి వస్తే.. ఈ ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది ఆటో ఫోకస్, 10x డిజిటల్ జూమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP కెమెరాను అందించారు. దీని ద్వారా 1080p క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.

Vivo Y6aలో ఏకంగా 7,200mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఎక్కువ గంటలు వస్తుంది. దీంతో పాటు ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఉండటం వల్ల ధూళి, నీటి నుండి ఫోన్‌కు రక్షణ లభిస్తుంది. 5G, వైఫై, బ్లూటూత్, టైప్-సి పోర్ట్ వంటి అన్ని రకాల కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: గూగుల్ పిక్సెల్ ఫోన్లలో Android 17 అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి!

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×