E-Paper
Advertisement

Vivo Y51 Pro 5G: రూ.25 వేలకే 5G స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, IP69 రేటింగ్‌తో వివో Y51 ప్రో లాంచ్!

Vivo Y51 Pro 5G: రూ.25 వేలకే 5G స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, IP69 రేటింగ్‌తో వివో Y51 ప్రో లాంచ్!
Advertisement

Vivo Y51 Pro 5G: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు వివో అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. తన పాపులర్ Y సిరీస్‌లో భాగంగా Vivo Y51 Pro 5Gని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని, భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు. మార్చి 11 నుంచే ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక స్టోర్లలో ఇది అందుబాటులోకి వచ్చింది.

ఆఫర్ల వివరాలు ఇలా..

ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 256GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.27,999గా నిర్ణయించారు. ఫెస్టివ్ రెడ్, నోబుల్ గోల్డ్ రంగుల్లో  ఈ ఫోన్ లభిస్తుంది. మార్చి 16లోపు కొనుగోలు చేసే వారికి రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్ లభించడం విశేషం.

Advertisement

Also Read: గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నా చింత లేదు.. ఈ 5 పద్ధతులతో వంట చేయడం చాలా ఈజీ!

అదిరిపోయే డిస్‌ప్లే..

6.75 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తున్న ఈ ఫోన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్‌ను దీనిలో వాడారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6పై ఇది పనిచేస్తుంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం దీనికి IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు.

50 మెగాపిక్సల్ కెమెరా..

Advertisement

Vivo Y51 Pro 5G ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP సెకండరీ కెమెరా ఉంది. ఇక సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. దీని ద్వారా 4K క్వాలిటీతో వీడియోలు రికార్డ్ చేయొచ్చు. ఇకపోతే ఈ ఫోన్‌లో 7,200mAh భారీ బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఛార్జింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.4 వంటి లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Also Read: ఈ ఒక్క స్మార్ట్ కుక్కర్ ఉంటే.. గ్యాస్ సిలిండర్‌తో పనిలేదు, టాప్ 5 మోడల్స్ ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×