E-Paper
Advertisement

Vivo Y31d Mobile: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 రోజులు వాడొచ్చు.. వివో Y31d షాకింగ్ ఫీచర్లు ఇవే!

Vivo Y31d Mobile: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 రోజులు వాడొచ్చు.. వివో Y31d షాకింగ్ ఫీచర్లు ఇవే!
Advertisement

Vivo Y31d Mobile: ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వివో తన Y సిరీస్ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘Vivo Y31d’ మార్కెట్‌లో విడుదలైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు ఆశించే వారి కోసమే సంస్థ ఈ ఫోన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఈ ఫోన్ సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తోందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్:

ఈ Vivo Y31d ఏకంగా 7,200mAh భారీ బ్యాటరీతో వస్తోంది. బ్లూవోల్ట్ టెక్నాలజీతో రూపొందిన ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి వాడుకోవచ్చు. గంటల కొద్దీ గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా ఛార్జింగ్ అయిపోతుందనే భయం ఉండదు. 43 నిమిషాల్లోనే సగం ఛార్జింగ్ పూర్తయ్యేలా 44W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

Advertisement

Also Read: శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఒలింపిక్ ఎడిషన్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలపై ఓ లుక్కేయండి!

రెండు కలర్ ఆప్షన్స్:

ఫోన్ కింద పడినా లేదా నీళ్లలో నానినా భయపడాల్సిన అవసరం లేదని కంపెనీ హామీ ఇస్తోంది. IP68, IP69 రేటింగ్స్‌తో వస్తున్న ఈ మొబైల్, నీటి అడుగున కూడా సేఫ్‌గా ఉంటుంది. గ్లో వైట్, స్టార్ లైట్ గ్రే రంగుల్లో లభించే ఈ ఫోన్.. మెటల్ కెమెరా మాడ్యూల్‌తో చాలా క్లాసీగా కనిపిస్తుంది.

మెరుగైన పనితీరు:

Advertisement

6.75 అంగుళాల పెద్ద స్క్రీన్ కలిగిన ఈ హ్యాండ్ సెట్.. 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు మద్దతు ఇస్తుంది. దీంతో సోషల్ మీడియా స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపించేలా హై బ్రైట్‌నెస్ మోడ్‌ను అందించారు. స్నాప్‌డ్రాగన్ 6s 4G జెన్ 2 ప్రాసెసర్‌పై ఇది రన్ అవుతుంది. అయితే ఇది కేవలం 4G నెట్‌వర్క్‌కే పరిమితం కావడం గమనించాల్సిన విషయం.

స్టీరియో స్పీకర్లు ప్రత్యేకం:

ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరాతో కూడిన డ్యూయల్ సెటప్ ఉంది. మ్యూజిక్ లవర్స్ కోసం దీనిలో స్టీరియో స్పీకరను ఇచ్చారు. ఇవి 400% వరకు వాల్యూమ్‌ను పెంచుతాయని వివో చెబుతోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత సరికొత్త ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ ధర‌, భారత్‌లో విడుదలపై త్వరలోనే స్పష్టత రానుంది.

Also Read: వారానికి రెండుసార్లు ఛార్జ్ చేస్తే చాలు.. 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ P4 పవర్ లాంచ్

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×