// // Vivo Y18T - రూ. 9499కే వివో కొత్త మెుబైల్ లాంఛ్.. -->
E-Paper
Advertisement

Vivo Y18T : వివో జోరు.. రూ. 9499కే కొత్త మెుబైల్… ధర తక్కువైనా స్టోరేజ్, కెమెరా క్వాలిటీలో ఏ మాత్రం తగ్గలే

Vivo Y18T : వివో జోరు.. రూ. 9499కే కొత్త మెుబైల్… ధర తక్కువైనా స్టోరేజ్, కెమెరా క్వాలిటీలో ఏ మాత్రం తగ్గలే
Advertisement

Vivo Y18T : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో.. తాజాగా వై-సిరీస్ ఫోన్లలో భాగంగా వై18టీ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంఛ్ చేసింది. లేటెస్ట్ అప్డేట్స్ తో లాంఛ్ అయిన ఈ మెుబైల్ ను అందుబాటు ధరలోనే కొనే అవకాశం ఉందని వివో తెలిపింది.

ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్లోకి లాంఛ్  చేస్తున్న వివో.. కొన్నాళ్ల క్రితం తీసుకొచ్చిన వీ-సిరీస్ ఫోన్లకు మంచి డిమాండ్ కనిపించటంతో తాజాగా మరో మొబైల్ ను తీసుకొచ్చింది బడ్జెట్ లోనే రెండు కలర్ ఆప్షన్లలో వై18టీ స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసింది. ఐపీ54 రేటెడ్ బిల్డ్ తో వచ్చేసిన ఈ ఫోన్ వెనకవైపు  డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్ ఉన్నాయి. ఇక యూనిసోక్ టీ612 ప్రాసెసర్, 4 GB RAM  + 128 GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000mah కాగా 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

Advertisement

Vivo Y18T Mobile –

వీవో Y18T స్పెసిఫికేషన్స్ –

Advertisement

ధర – ఈ స్మార్ట్ ఫోన్లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇక 4 GGB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499. RAMను 8 GB వరకు పెంచుకోనే అవకాశం ఉంది.

కలర్స్ –  Vivo Y18T మెుబైల్ ను జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. వివోతో పాటు ఫ్లిప్కార్ట్ అధికారిక వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ప్రాసెసర్ – ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ OS 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి ఈ ఫోన్ పని చేయనుంది.

డిస్ ప్లే –  ఇందులో 6.56 అంగుళాల HD + LED డిస్ ప్లే ఉంది. 90 HZ రిఫ్రెష్ రేట్, 269 పీపీఐ డెన్సిటీ, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

కెమెరా – ఈ ఫోన్ వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 MP సెన్సార్ ఉంది.

కనెక్టివిటీ – బ్లూటూత్ V5.2, FM రేడియో, GPS, OTG, wifi, USB టైప్ – సీ పోర్ట్ అందుబాటులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ – కంపాస్, మోటార్ గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైతం అందించారు.

బ్యాటరీ – Vivo Y18Tలో 15W ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఉన్న 5000mah బ్యాటరీ ఉంది. ఇక ఒక్క ఛార్జింగ్ తో 62 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్, 6.8 గంటల పబ్జీ ప్లేబ్యాక్ టైమ్ ను ఈ ఫోన్ అందించనుంది. ఈ ఫోన్ మందం 0.83 సెంటీమీటర్లు, బరువు 185 గ్రాములు.

ఇక ఇంకెందుకు ఆలస్యం.. తక్కువ ధరతోనే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ను కొనాలనుకునే వినియోగదారులు కచ్చితంగా ఈ మోడల్ మొబైల్స్ ను తప్పుకుండా ట్రై చేేసేయండి.

ALSO READ : టెక్ ప్రియులకు ఇక పండగే.. ఆహా అనిపించే యాపిల్ కొత్త గ్యాడ్జెట్స్ వచ్చేస్తున్నాయ్

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×